హోమ్ /వార్తలు /business /

Personal Finance: మార్చి 31లోగా ఈ పనిచేయకపోతే ఎక్కువ టీడీఎస్‌ చెల్లించాల్సిందే

Personal Finance: మార్చి 31లోగా ఈ పనిచేయకపోతే ఎక్కువ టీడీఎస్‌ చెల్లించాల్సిందే

Personal Finance | మార్చి వచ్చిందంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక అంశాలు తెరపైకి వస్తుంటాయి. మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాల్సిన పనులు ఉంటాయి. మార్చి 31 లోగా ఈ పనిచేయకపోతే అధిక టీడీఎస్ చెల్లించాలి.

Personal Finance | మార్చి వచ్చిందంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక అంశాలు తెరపైకి వస్తుంటాయి. మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాల్సిన పనులు ఉంటాయి. మార్చి 31 లోగా ఈ పనిచేయకపోతే అధిక టీడీఎస్ చెల్లించాలి.

Personal Finance | మార్చి వచ్చిందంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక అంశాలు తెరపైకి వస్తుంటాయి. మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాల్సిన పనులు ఉంటాయి. మార్చి 31 లోగా ఈ పనిచేయకపోతే అధిక టీడీఎస్ చెల్లించాలి.

    ఇప్పటి వరకు పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌ను (PAN- Permanent Account Number) ఆధార్ కార్డ్‌తో (Aadhaar Card) లింక్ చేయకుంటే.. వచ్చే నెల నుంచి ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌ (TDS- Tax Deducted At Source) ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఆధార్‌కార్డుతో పాన్ వివరాలను లింక్‌ చేసుకొనేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. అప్పటిలోగా ఆధార్‌, పాన్‌ కార్డును లింక్‌ చేసుకోలేకపోతే డెబిట్‌, క్రెడిట్‌ కార్డు చెల్లింపులు, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లు, ఏటీఎం నుంచి నగదు తీసుకోవడం వంటి వాటిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ (Income Tax Act), సెక్షన్‌ 139AA ప్రకారం 2017 జులై 1 నాటికి పర్మినెంట్‌ అకౌంట్‌ నంబరు ఉన్న వారికి, ఆధార్‌ పొందే అర్హత ఉంటుంది. వాళ్లు ఆధార్‌, పాన్‌ను తప్పకుండా లింక్‌ చేసుకోవాలి.

    గడిచిన మూడేళ్లలో ఆధార్‌తో పాన్‌ నంబరును లింక్‌ చేసేందుకు దాదాపు చాలా సార్లు గడువును పొడిగిస్తూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (CBDT) నిర్ణయం తీసుకొంది. గడువులోగా ఆధార్‌ కార్డుతో, పాన్‌ కార్డు లింక్‌ చేసుకోలేకపోతే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌, సెక్షన్‌ 114AA(3) ప్రకారం పాన్‌ కార్డు పని చేయదు. అదే విధంగా కొత్తగా పాన్‌ కార్డు కోసం అప్లై చేసుకొనే వారు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌, 139AA ప్రకారం కచ్చితంగా ఆధార్‌ నంబరును నమోదు చేసుకోవాలి.

    March Deadlines: అలర్ట్... మార్చి 31 లోపు పూర్తి చేయాల్సిన 6 ముఖ్యమైన పనులు ఇవే

    గడువు దాటితే అధిక పన్ను తప్పదు

    ఒకవేళ పాన్‌ కార్డు పనిచేయకపోతే.. పాన్‌ కార్డును సదరు వ్యక్తి సబ్మిట్‌ చేయలేదని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ భావిస్తుంది. పాన్‌ కార్డును సబ్మిట్‌ చేకపోతే ఎదురయ్యే పరిణామాలను సంబంధిత వ్యక్తి కచ్చితంగా భరించాల్సి ఉంటుంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌, సెక్షన్‌ 206AA(6) ప్రకారం పన్ను శ్లాబు కిందకు వచ్చే స్థాయిలో ఆదాయం అందుకొంటున్నవారు తప్పకుండా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు పాన్‌ కార్డు వివరాలు అందజేయాలి. ఇచ్చిన పాన్‌ నంబరు సరైనది కాకపోయినా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌, సెక్షన్‌ 206AA(6) ప్రకారం.. సదరు వ్యక్తి పాన్‌ కార్డు వివరాలు అందజేయలేదనే భావించి తదుపరి చర్యలు తీసుకొంటారు.

    మార్చి 31వ తేదీలోగా పాన్‌, ఆధార్‌ను లింక్‌ చేసుకోని వారి పాన్‌ కార్డు పనిచేయదు. అప్పుడు ఇన్‌కమ్‌ ట్యాక్‌ యాక్ట్‌, సెక్షన్‌ 206AA ప్రకారం టీడీఎస్‌ను అధిక రేటు 20 శాతంతో చెల్లించాల్సి ఉంటుంది. టీడీఎస్‌ కిందకు వచ్చే ఫిక్స్డ్‌ డిపాజిట్లు, డివిడెండ్లు తదితరాలపై కూడా ఇదే ప్రభావం కనిపిస్తుంది. ఉదాహరణకు ఫిక్స్డ్‌ డిపాజిట్‌పై లభించే వడ్డీపై టీడీఎస్‌ 10 శాతం ఉంటే.. లభిస్తున్న వడ్డీ రూ.40 వేలు దాటితే.. ఆధార్‌తో పాన్‌కార్డును లింక్‌ చేయని పక్షంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌, సెక్షన్‌ 206AA ప్రకారం 20 శాతం టీడీఎస్‌ చెల్లించాల్సి వస్తుంది.

    Deadline Alert: వారికి రేపే లాస్ట్ డేట్... డెడ్‌లైన్ మిస్ అయితే భారీ జరిమానా, జైలు శిక్ష

    పాన్‌ వివరాలు అందించని ప్రతిసారి జరిమానా

    ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌, సెక్షన్‌ 272B ప్రకారం పాన్‌ వివరాలు అందించని ప్రతిసారి రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఇతర పరిణామాలు ఎదుర్కోవడంతోపాటు జరిమానా అధనం. మార్చి 31వ తేదీలోగా ఆధార్‌కార్డుతో పాన్‌ కార్డును లింక్‌ చేయకపోయినా పాన్‌ పనిచేయదు కాబట్టి.. వివరాలు అందించలేదనే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విభాగం భావిస్తుంది.

    First published:

    ఉత్తమ కథలు