హోమ్ /వార్తలు /business /

PF Aadhaar Link: మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేశారా? వెంటనే చేయండి ఇలా

PF Aadhaar Link: మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేశారా? వెంటనే చేయండి ఇలా

PF Aadhaar Link | మీ ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేశారా? ఆన్‌లైన్‌లో ఎలా చేయాలో తెలుసుకోండి.

PF Aadhaar Link | మీ ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేశారా? ఆన్‌లైన్‌లో ఎలా చేయాలో తెలుసుకోండి.

PF Aadhaar Link | మీ ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేశారా? ఆన్‌లైన్‌లో ఎలా చేయాలో తెలుసుకోండి.

  మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా? మీ ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేశారా? ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. 2021 జూన్ 1 నుంచే ఈ రూల్ అమలు చేస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ రూల్ పాటించాల్సిందే. తమ ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్ వెరిఫై చేయాల్సిన బాధ్యత యాజమాన్యానిదే. ఒకవేళ ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయనట్టైతే ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. ఆధార్ లింక్ లేని పీఎఫ్ అకౌంట్‌లోకి యాజమాన్యం వాటా నిలిచిపోతుంది.

  EPF Withdrawal: ఈపీఎఫ్ ఖాతాదారులు కరోనాతో చనిపోతే క్లెయిమ్ కోసం దరఖాస్తు విధానం ఇదే

  SBI Insurance: ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.40 లక్షల వరకు ఇన్స్యూరెన్స్... అప్లై చేయండి ఇలా

  సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 లోని సెక్షన్ 142 ప్రకారం ఈపీఎఫ్ఓ కొత్త నియమనిబంధనల్ని అమలు చేసింది. జూన్ 1 నుంచి పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోయినా, యూఏఎన్ ఆధార్ వెరిఫికేషన్ పూర్తి కాకపోయినా ఎలక్ట్రానిక్ చాలాన్ కమ్ రిటర్న్ నిలిచిపోతుందని యాజమాన్యాలకు ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. అంటే ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్‌లో తమ వాటా మాత్రమే కనిపిస్తుంది. యజమాని షేర్ కనిపించదు. ఉద్యోగులు కూడా తమ ఆధార్ నెంబర్‌ను పీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  EPF Account: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... అకౌంట్‌లోకి వడ్డీ జమ చేసేది ఎప్పుడంటే

  Aadhaar: ఆధార్ వెరిఫికేషన్ కోసం కొత్త సర్వీస్... ఇలా వాడుకోండి

  PF Aadhaar Link: పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండి ఇలా

  ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేయాలి.

  యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

  ఆ తర్వాత Manage ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

  ఆ తర్వాత డ్రాప్‌డౌన్ మెనూలో KYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

  అందులో Aadhaar సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్, పేరు ఎంటర్ చేయాలి.

  ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే పేరు, నెంబర్ ఎంటర్ చేయాలి.

  ఆ తర్వాత Save పైన క్లిక్ చేయాలి.

  ఆ తర్వాత వివరాలు ఓసారి సరిచూసుకోవాలి.

  మీ వివరాలు యూఐడీఏఐ డేటాతో క్రాస్ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ అవుతుంది.

  అప్రూవ్ అయిన తర్వాత Verified అని కనిపిస్తుంది.

  First published:

  ఉత్తమ కథలు