మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారా? ప్రతీ నెలా సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్-SIP ద్వారా పెట్టుబడి పెడుతున్నారా? మరి మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేశారా? లేకపోతే వెంటనే చేయండి. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే మీ మ్యూచువల్ ఫండ్స్‌లోని డబ్బులు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బులు తీసుకోవడం సాధ్యం కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీ కేవైసీ వివరాలన్నీ సబ్మిట్ చేయాలి. దీంతో పాటు మీ దగ్గర వేలిడ్లో ఉన్న పాన్ కార్డు ఉండాలి. ఒకవేళ పాన్ కార్డు చెల్లనట్టైతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సాధ్యం కాదు. పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి జూన్ 30 చివరి తేదీ. పాన్, ఆధార్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీ పాన్, ఆధార్ లింక్ అయిందో లేదో స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఒకవేళ మీరు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఆ పాన్ కార్డ్ చెల్లదు. పాన్ కార్డ్ చెల్లకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో మీ సిప్స్ ఆగిపోతాయి. ఇప్పటివరకు మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని వెనక్కి తీసుకోవడానికి కూడా సమస్యలు రావొచ్చు. మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్-CAMS లెక్కల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నవారిలో 20 లక్షల మంది ఇప్పటికీ తమ పాన్ నెంబర్లకు ఆధార్ నెంబర్లు లింక్ చేయలేదని తేలింది. ఇన్కమ్ ట్యాక్స్ నియమనిబంధనల ప్రకారం పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను 2021 జూన్ 30 లోగా లింక్ చేయాలి. లేకపోతే పాన్ కార్డ్ చెల్లనిదిగా మారిపోతుంది.
2021 జూన్ 30 లోగా పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఆ తర్వాత రూ.10,000 జరిమానా విధించనుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కస్టమర్ల కేవైసీ స్టేటస్ కూడా ఇన్వేలిడ్ అవుతుంది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం సాధ్యం కాదు. అంతేకాదు... ఇప్పటివరకు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ని రీడీమ్ చేసుకోవడం కూడా సాధ్యం కాదు. ప్రస్తుతం కొనసాగుతున్న సిప్స్ నిలిచిపోతాయి. అంతేకాదు... బ్యాంకుల్లోని సేవింగ్స్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అవుతాయి. విత్‌డ్రాయల్స్ చేయడం కుదరదు. పాన్, ఆధార్ లింక్ చేయకపోతే ఆర్థిక వ్యవహారాల్లో చాలావరకు ఇబ్బందులు రావొచ్చు.
పాన్, ఆధార్ లింక్ లేకపోతే కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ తీసుకోలేరు. డిబెంచర్స్, బాండ్స్ కొనుగోలు కూడా సాధ్యం కాదు. రూ.50,000 కన్నా ఎక్కువ జరిపే లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.