హోమ్ /వార్తలు /బిజినెస్ /

Link PAN: బ్యాంక్ అకౌంట్‌కి పాన్ లింక్ చేస్తేనే ఐటీఆర్ రీఫండ్

Link PAN: బ్యాంక్ అకౌంట్‌కి పాన్ లింక్ చేస్తేనే ఐటీఆర్ రీఫండ్

PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? ఇలా తెలుసుకోండి

PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? ఇలా తెలుసుకోండి

Link PAN | ఇప్పటివరకైతే ఐటీ డిపార్ట్‌మెంట్ బ్యాంక్ అకౌంట్లకు రీఫండ్ చేయడంతో పాటు చెక్కులు కూడా జారీ చేసేది. ఇకపై ఈ పద్ధతి మారిపోనుంది. బ్యాంక్ అకౌంట్‌లోకి మాత్రమే ఐటీఆర్ రీఫండ్ వస్తుంది.

    మీరు మీ బ్యాంక్ అకౌంట్‌కి పాన్ లింక్ చేశారా? ఇంకా చేయకపోతే వెంటనే మీ పాన్‌ను అకౌంట్‌కు లింక్ చేయండి. లేకపోతే మీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రీఫండ్ రాదని ఆదాయపు పన్ను శాఖ తేల్చి చెప్పింది. బ్యాంకు అకౌంట్లకు పాన్ లింక్ చేసిన వారికే మాత్రమే మార్చి 1 నుంచి ఇ-మోడ్‌లో రీఫండ్స్ జారీ చేస్తామని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. మీ అకౌంట్‌కి పాన్ లింక్ చేస్తే నేరుగా, వేగంగా, సురక్షితంగా డబ్బులు రీఫండ్ పంపే అవకాశం ఉంటుందన్నది ఐటీ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ప్రకటన సారాంశం.



    ఇప్పటివరకైతే ఐటీ డిపార్ట్‌మెంట్ బ్యాంక్ అకౌంట్లకు రీఫండ్ చేయడంతో పాటు చెక్కులు కూడా జారీ చేసేది. ఇకపై ఈ పద్ధతి మారిపోనుంది. బ్యాంక్ అకౌంట్‌లోకి మాత్రమే ఐటీఆర్ రీఫండ్ వస్తుంది. అది కూడా బ్యాంక్ అకౌంట్‌కు పాన్ లింక్ చేస్తేనే రీఫండ్ పొందొచ్చు. మరి ఇప్పటికే పాన్ లింక్ చేశారో లేదో తెలుసుకోవాలని సూచించింది. హోమ్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి పాన్ లింక్ చేయడంతో పాటు, ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో ధృవీకరించాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.


    Read this: Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఉందా? బీమా ఎంత ముఖ్యం?


    ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్లు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి అని ఐటీ డిపార్ట్‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 వరకు గడువు విధించింది. ఇప్పటి వరకు ఐటీ డిపార్ట్‌మెంట్ 42 కోట్ల పాన్ కార్డులు జారీ చేస్తే 23 కోట్ల మంది మాత్రమే తమ ఆధార్‌ లింక్ చేసినట్టు తాజా లెక్కలు చెబుతున్నాయి. మరి మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేశారో లేదో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.


    Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:


    PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి


    Personal Finance: క్రెడిట్ కార్డులు ఎక్కువున్నాయా? సిబిల్ స్కోర్‌కు ముప్పేనా?


    పవర్ బ్యాంక్ కొంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

    First published:

    Tags: Income tax, ITR, PAN

    ఉత్తమ కథలు