ఎల్ఐసీ నుంచి మీకు రావాల్సిన డబ్బులు బ్లాక్ అయ్యాయా? కారణాలు ఇవే...

మీ అకౌంట్ నెంబర్ ఎల్ఐసీ సంస్థ దగ్గర ఉంటుంది కాబట్టి మీ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడంలో ఎలాంటి జాప్యం ఉండదు. లేకపోతే మీరు ఎలాగూ మళ్లీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకతప్పదు.

news18-telugu
Updated: February 17, 2019, 8:07 AM IST
ఎల్ఐసీ నుంచి మీకు రావాల్సిన డబ్బులు బ్లాక్ అయ్యాయా? కారణాలు ఇవే...
ఎల్ఐసీ నుంచి మీకు రావాల్సిన డబ్బులు బ్లాక్ అయ్యాయా? కారణాలు ఇవే...
  • Share this:
మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? మీ పాలసీ త్వరలో మెచ్యూర్ కాబోతుందా? మెచ్యూరిటీ తర్వాత డబ్బులు వస్తాయని మీరు ధీమాగా ఉంటే సరిపోదు. ఎందుకంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ను ఎల్ఐసీతో లింక్ చేయకపోతే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. గతంలో ఎల్ఐసీ చెక్కు ద్వారా పాలసీ హోల్డర్లకు డబ్బులు చెల్లించేది. కానీ ఇటీవల నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తోంది. కాబట్టి మీ ఎల్ఐసీ పాలసీకి మీ బ్యాంకు అకౌంట్‌ను లింక్ చేయడం తప్పనిసరి.

Read this: PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకపోతే ఏమవుతుంది?పాలసీ మెచ్యూర్ అయ్యాక మీ డబ్బులు మీకు రావడానికి ఆలస్యం జరగకూడదంటే ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. మీ అకౌంట్ నెంబర్ ఎల్ఐసీ సంస్థ దగ్గర ఉంటుంది కాబట్టి మీ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడంలో ఎలాంటి జాప్యం ఉండదు. లేకపోతే మీరు ఎలాగూ మళ్లీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకతప్పదు. అందుకే ముందే మీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తే ఏ ఇబ్బందీ ఉండదు. ఇప్పటికీ చాలా మంది తమ బ్యాంక్ అకౌంట్లను ఎల్ఐసీ పాలసీకి లింక్ చేయలేదు. ఎల్ఐసీ పాలసీ తీసుకున్నప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను మీరు మీ ఏజెంట్‌కు ఇచ్చి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టీవ్‌గా లేకపోతే, కొత్త అకౌంట్ నెంబర్ అప్‌డేట్ చేయించాలి.Read this: LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు

Business news, link your lic policy with bank account, lic bank account link, Life Insurance Corporation, lic sms, lic policy login, lic policy status, lic agent login, lic customer care, lic old portal, lic billdesk, lic premium calculator, ఎల్ఐసీ బ్యాంక్ అకౌంట్ లింక్, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్, ఎల్ఐసీ ఎస్ఎంఎస్, ఎల్ఐసీ పాలసీ లాగిన్, ఎల్ఐసీ పాలసీ స్టేటస్, ఎల్ఐసీ లాగిన్, బిజినెస్ న్యూస్, బిజినెస్ వార్తలు


ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలి?

Loading...
ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం పెద్ద సమస్యేమీ కాదు. చాలా సులువైన ప్రాసెస్. ఇందుకోసం మీరు మీ క్యాన్సల్డ్ చెక్ లేదా మీ బ్యాంకు పాస్‌బుక్ ఫ్రంట్ పేజీని దగ్గర్లో ఉన్న ఎల్ఐసీ బ్రాంచ్‌లో ఇవ్వాలి. NEFT ఫామ్ ఫిల్ చేయడం తప్పనిసరి. NEFT ఫామ్‌కు బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ లేదా క్యాన్సల్డ్ చెక్ జతచేయాలి. వారం రోజుల్లో మీ ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఎల్ఐసీ నుంచి రావాల్సిన ప్రతీ రూపాయి బ్యాంకు అకౌంట్‌లోనే జమ అవుతుంది.

Read this: IRCTC APP: ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...

ఎల్ఐసీ నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్


కేవలం బ్యాంకు అకౌంట్ మాత్రమే కాదు మీ ఫోన్ నెంబర్‌ను కూడా పాలసీకి లింక్ చేయడం మంచిది. ఎందుకంటే మార్చి 1 నుంచి పాలసీ హోల్టర్లకు ప్రీమియం గడువు, చెల్లింపులు, పాలసీ ల్యాప్స్, బోనస్ లాంటి సమాచారం ఆటోమేటెడ్ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. మీ పాలసీకి ఫోన్ నెంబర్ లింక్ చేయకపోతే ఎల్ఐసీ నుంచి మీ పాలసీకి సంబంధించిన అప్‌డేట్స్ మీకు అందవు. మీరు మీ ఫోన్ నెంబర్‌ను ఎల్ఐసీలో అప్‌డేట్ చేయించాలంటే మీ ఏజెంట్‌కి కాల్ చేసి చెప్పొచ్చు. మీ మొబైల్ నెంబర్ మారినా ఎల్ఐసీకి సమాచారమివ్వాలి. మీరు ఆన్‌లైన్‌లో కూడా మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయొచ్చు. www.licindia.in/Customer-Services/Help-Us-To-Serve-You-Better లింక్ క్లిక్ చేసి మీ వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. లేదా 022-68276827 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.

Photos: సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

SBI Card: మీ ఎస్‌బీఐ కార్డు పోయిందా? వెంటనే ఇలా బ్లాక్ చేయొచ్చు

Flipkart TV Days: టీవీ కొనాలా? ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్స్ ఇవే...

Xiaomi Redmi Note 7: ఫిబ్రవరి 28న లాంఛ్ కానున్న రెడ్‌మీ నోట్ 7

Business Idea: రూ.1 లక్ష పెట్టుబడితో నెలకు రూ.14 వేల ఆదాయం
First published: February 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...