EPFO: ఈపీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ లింక్... ఉమాంగ్ యాప్‌లో చేయండిలా

EPFO | మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమాంగ్ యాప్ ఉంటే చాలు. కేవలం ఐదు స్టెప్స్‌లో యూఏఎన్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

news18-telugu
Updated: May 3, 2019, 6:25 PM IST
EPFO: ఈపీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ లింక్... ఉమాంగ్ యాప్‌లో చేయండిలా
EPFO: ఈపీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ లింక్... ఉమాంగ్ యాప్‌లో చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 3, 2019, 6:25 PM IST
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ అకౌంట్ ఉన్నవాళ్లంతా తమ యూఏఎన్ నెంబర్‌తో ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలి. ఉమాంగ్ మొబైల్ యాప్‌లో కూడా యూఏఎన్-ఆధార్ నెంబర్లను లింక్ చేసే అవకాశం కల్పించింది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమాంగ్ యాప్ ఉంటే చాలు. కేవలం ఐదు స్టెప్స్‌లో యూఏఎన్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

1. ముందుగా మీ స్మార్ట్‌పోన్‌లో ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్, యాప్‌స్టోర్‌లో ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
2. ఉమాంగ్ యాప్ ఓపెన్ చేస్తే అనేక సేవలు కనిపిస్తాయి. అందులో EPFO లింక్ పైన క్లిక్ చేయాలి.

3. ‘eKYC Services’ ఆప్షన్ క్లిక్ చేయండి.
4. మీకు ‘Aadhaar Seeding’ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.


5. మీ UAN నెంబర్ ఎంటర్ చేస్తే మీ యూఏఎన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీతో పాటు వివరాలు ఎంటర్ చేస్తే మీ ఆధార్, యూఏఎన్ నెంబర్ లింక్ అవుతుంది.

Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్
Loading...

ఇవి కూడా చదవండి:

Credit Card: మీకు ఉపయోగపడే క్రెడిట్ కార్డ్ ఏదో తెలుసుకోండి ఇలా

Amazon-SBI offer: అమెజాన్‌లో ఈ 8 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్... ఎస్‌బీఐ కార్డుపై 10 శాతం డిస్కౌంట్

PAN Card: పాన్ కార్డు దరఖాస్తు... ఈ 10 తప్పులు చేయొద్దు
First published: May 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...