ఎంప్లాయీస్ ప్రావిడెంట్ అకౌంట్ ఉన్నవాళ్లంతా తమ యూఏఎన్ నెంబర్‌తో ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలి. ఉమాంగ్ మొబైల్ యాప్‌లో కూడా యూఏఎన్-ఆధార్ నెంబర్లను లింక్ చేసే అవకాశం కల్పించింది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమాంగ్ యాప్ ఉంటే చాలు. కేవలం ఐదు స్టెప్స్‌లో యూఏఎన్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
1. ముందుగా మీ స్మార్ట్పోన్లో ఉమాంగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్, యాప్‌స్టోర్‌లో ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
2. ఉమాంగ్ యాప్ ఓపెన్ చేస్తే అనేక సేవలు కనిపిస్తాయి. అందులో EPFO లింక్ పైన క్లిక్ చేయాలి.
3. ‘eKYC Services’ ఆప్షన్ క్లిక్ చేయండి.
4. మీకు ‘Aadhaar Seeding’ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
5. మీ UAN నెంబర్ ఎంటర్ చేస్తే మీ యూఏఎన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీతో పాటు వివరాలు ఎంటర్ చేస్తే మీ ఆధార్, యూఏఎన్ నెంబర్ లింక్ అవుతుంది.
Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.