Maruti Suzuki: మారుతి సుజుకి వ్యాగన్​ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ విడుదల.. పాత మోడల్​కు ప్రధాన మార్పులివే!

Maruti Suzuki: మారుతి సుజుకి వ్యాగన్​ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ విడుదల.. పాత మోడల్​కు ప్రధాన మార్పులివే!

మారుతి సుజుకి తన వ్యాగన్ఆర్ మోడల్​లో ఎక్స్‌ట్రా ఎడిషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్​లో లభిస్తున్న VXi వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్​ను లాంచ్​ చేసింది.

  • Share this:
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వ్యాగన్ఆర్ మోడల్​లో ఎక్స్‌ట్రా ఎడిషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్​లో లభిస్తున్న VXi వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్​ను లాంచ్​ చేసింది. మార్కెట్​లో ఈ వేరియంట్​ రూ. 5.36 లక్షల నుంచి రూ. 5.71 లక్షల మధ్య లభిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్​ వ్యాగన్​ఆర్​ 1 లీటర్​, 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్​ వ్యాగన్​ఆర్​ విఎక్స్​ఐ వేరియంట్​తో పోల్చుకుంటే, ఈ ప్రత్యేకమైన వ్యాగన్​ ఆర్​ ఎక్స్​ట్రా ఎడిషన్​లో అనేక అదనపు ఫీచర్లను చేర్చింది. ఈ ఫీచర్లను కంపెనీ యాడ్​ఆన్​ యాక్సెసరీల రూపంలో అందిస్తోంది. వ్యాగన్​ఆర్​ ఎక్స్​ట్రా ఎడిషన్​లో మొత్తం 13 అదనపు ఫీచర్లను జోడించింది. ఇందులో ఎక్స్​టీరియర్​, ఇంటీరియర్​, ఫీచర్​ అప్​గ్రేడ్ వంటివి లభిస్తాయి. ​ఇక, వ్యాగన్​ ఆర్​ ఎక్స్​ట్రా ఎడిషన్​లో రూ. 23,000 విలువ చేసే యాక్సెసరీల కిట్​ను కూడా అందిస్తోంది. ఈ యాక్సెసరీస్​ అన్నింటిని విడివిడిగా కొనుగోలు చేస్తే సుమారు రూ 30,000 వరకు ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది. కాబట్టి వ్యాగన్​ఆర్​ ఎక్స్​ట్రా ఎడిషన్ కిట్​ను కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్లు సుమారు రూ. 7,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
Hyundai offer: ఆగస్టులో హ్యుందాయ్‌ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. భారీ తగ్గింపు.. ఎంతంటే..

ఈ కిట్​లో ఫ్రంట్​ అండ్​ రియర్​ బంపర్​ ప్రొటెక్టర్స్​, సైడ్​ స్కర్ట్స్​, వీల్​ ఆర్చ్​ క్లౌడింగ్​, బాడీ సైడ్ మౌల్డింగ్​, ఫాగ్​ ల్యాంప్​ గార్నిష్​, అప్పర్​ గ్రిల్ క్రోమ్​ గార్నిష్​, రియర్​ డోర్​ క్రోమ్ గార్నిష్​, నంబర్​ ప్లేట్​ గార్నిష్​, ఇంటీరియర్​ స్టైలింగ్​ కిట్​ వంటి స్టైలిష్​ యాక్సెసరీస్​ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా డిజిటల్​ ఎయిర్​ ఇన్​ప్లేటర్​, ట్రంక్​ ఆర్గనైజర్​, కార్​ ఛార్జర్​ ఎక్స్​టెండర్​ వంటి యాక్సెసరీలను అందిస్తోంది. మారుతి సుజుకి వ్యాగన్​ఆర్​ ఎక్స్​ట్రా ఎడిషన్​లో స్టైలింగ్​, కన్సీనెంట్​ యాక్సెసరీస్​ మినహా డిజైన్ ఎలాంటి మార్పులు చేయలేదు.

రెండు ఇంజిన్​ ఆప్షన్లతో..
ప్రస్తుతం వ్యాగన్​ఆర్​ రెండు ఇంజిన్​ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మొదటిది 1.0 లీటర్​, 3 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్. ఇది గరిష్టంగా 67 బిహెచ్​పి పవర్​, 90 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండోది 1.2 లీటర్​ 4 సిలిండర్ పెట్రోల్​ ఇంజిన్​. ఇది గరిష్టంగా 82 బిహెచ్​పి పవర్​ను, 113 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో 1.‌0 లీటర్​ పెట్రోల్​ వేరియంట్​ కేవలం 5 స్పీడ్​ మాన్యువల్​ గేర్​ బాక్స్​ ఆప్షన్​తో లభిస్తుంది. ఇక 1.2 లీటర్​ పెట్రోల్ వేరియంట్​ 5 స్పీడ్​ మాన్యువల్​, ఏఎమ్​టి ఆటోమేటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్లతో లభిస్తుంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రెండు దశాబ్దాలకు పైగా భారతీయ మార్కెట్లో పాపులర్​ మోడల్​గా కొనసాగుతోంది.
Published by:Nikhil Kumar S
First published: