Home /News /business /

LIFE INSURANCE POLICY RULE CHANGED NOW 3 MONTH WAITING PERIOD IS MANDATORY TO TAKE LIFE INSURANCE POLICY FOR WHO RECOVERED WITH COVID SS

Life Insurance: లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ రూల్ మారింది... ఇక మూడు నెలలు ఆగాల్సిందే

Life Insurance: లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ రూల్ మారింది... ఇక మూడు నెలలు ఆగాల్సిందే
(ప్రతీకాత్మక చిత్రం)

Life Insurance: లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ రూల్ మారింది... ఇక మూడు నెలలు ఆగాల్సిందే (ప్రతీకాత్మక చిత్రం)

Life Insurance | లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనునేవారికి అలర్ట్. లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ (Insurance Policy) రూల్ రూల్ మారింది. కొత్త రూల్ ప్రకారం పాలసీ తీసుకోవాలంటే మూడు నెలలు ఆగాల్సిందే. ఎందుకో తెలుసుకోండి.

    కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో హెల్త్ ఇన్స్యూరెన్స్ (Health Insurance), టర్మ్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ (Life Insurance) లాంటి పాలసీలు తీసుకోవాలన్న స్పృహ, అవగాహన ప్రజల్లో పెరిగింది. అయితే కోవిడ్ 19 మరణాలతో ఇన్స్యూరెన్స్ క్లెయిమ్‌ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. కోవిడ్ 19 వైరస్ సోకి రికవర్ అయినవారు లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే మూడు నెలలు ఆగాల్సిందే. అంటే కరోనా నుంచి కోలుకున్న వెంటనే పాలసీ తీసుకోవడం సాధ్యం కాదు. మూడు నెలలు ఆగిన తర్వాత పాలసీ తీసుకోవాలి.

    ఇతర వ్యాధులకు, రోగాలకు వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్టుగానే కరోనా వైరస్‌కు కూడా వెయిటింగ్ పీరియడ్‌ను అమలు చేస్తున్నాయి ఇన్స్యూరెన్స్ కంపెనీలు. ఇప్పటికే పలు వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి కోవిడ్ 19 కూడా వచ్చి చేరింది. కరోనా వైరస్‌కు సంబంధించి మరణాల రేటు ఎక్కువగా ఉన్నందున కోవిడ్ 19 నుంచి కోలుకున్న వ్యక్తులు కొత్త ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవడానికి వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరి చేస్తున్నట్టు ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.

    Business Idea: కేవలం రూ.15 వేలతో వ్యాపారం... ట్రెండింగ్‌లో బిజినెస్ ఐడియా

    కరోనా వైరస్ కారణంగా అధిక మరణాల రేటు రీఇన్స్యూరెన్స్ వ్యాపారంపై ప్రభావం చూపిస్తోంది. కోవిడ్ 19 కేసులకు కూడా వెయిటింగ్ పీరియడ్ నిబంధనల్ని అమలు చేయాలని బీమా కంపెనీలను రీఇన్స్యూరర్లు కోరారు. కనీసం ఒక నెల నుంచి మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉండాలని సూచించారు. ఇన్స్యూరెన్స్ కంపెనీలు జారీ చేసే పాలసీలకు రీఇన్స్యూరెన్స్ సంస్థలు కవర్‌ను అందిస్తుంటాయి.

    భారతీయ ఇన్స్యూరర్స్‌కు ఈ రిస్కులన్నింటినీ ఎదుర్కొనే సామర్థ్యం లేదని, అందుకే రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల కన్నా ఎక్కువ ఉన్న బీమా పాలసీలను రీఇన్స్యూర్ చేస్తారని, అయితే రీఇన్స్యూరర్లు ఈ రిస్కును గుర్తించి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసులకు వెయిటింగ్ పీరియడ్ వర్తింపచేశారని ఇన్స్యూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IBAI) ప్రెసిడెంట్ సుమిత్ బోహ్రా తెలిపారు.

    LIC IPO Alert: ఎల్ఐసీ పాలసీ ఉందా? ఐపీఓలో కోటా కావాలంటే ఈ వివరాలు అప్‌డేట్ చేయండి

    ఇన్ఫెక్షన్ కారణంగా మరణాల రేటు ఎక్కువ ఉన్నందున వెయిటింగ్ పీరియడ్ వర్తించే వ్యాధుల జాబితాలో కరోనాను కూడా చేర్చారని అన్నారు. గతంలో మరణాల రేటు తక్కువగా ఉండేదని, ఇప్పుడు మరణాల రేటు ఎక్కువగా ఉంటే క్లెయిమ్‌లు చెల్లించడానికి ప్రీమియం మొత్తం సరిపోదని, కోవిడ్ ఓ సాధారణ జలుబు, ఫ్లూ లాంటిది కాదని బోహ్రా అన్నారు.

    భారతదేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.442 కోట్లకు పైగా రీఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.327 కోట్లు మాత్రమే ఉంది. ఇక ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు రీఇన్స్యూరెన్స్ ప్రీమియం కింద రూ.3,909 చెల్లించగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.3,074 కోట్లు ఉంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Insurance, Life Insurance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు