• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • LIFE INSURANCE COUNCIL CLARIFIES THAT DEATHS DUE TO CORONAVIRUS WILL COVERED BY INSURANCE POLICIES SS

Insurance Policy: కరోనాతో చనిపోతే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందా? క్లారిటీ ఇచ్చిన ఎల్ఐసీ

Insurance Policy: కరోనాతో చనిపోతే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందా? క్లారిటీ ఇచ్చిన ఎల్ఐసీ

Insurance Policy: కరోనాతో చనిపోతే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందా? క్లారిటీ ఇచ్చిన ఎల్ఐసీ (ప్రతీకాత్మక చిత్రం)

Life Insurance | కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మరణాలు వేలల్లో ఉన్నాయి. మరి కరోనా వైరస్‌తో చనిపోతే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ వర్తిస్తుందా? మీ సందేహానికి సమాధానమిదే.

  • Share this:
    కరోనా వైరస్‌బారిన పడి చనిపోతే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందా? చాలామందిలో ఇవే అనుమానాలున్నాయి. దీనిపై లైఫ్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది. కోవిడ్-19 కారణంతో చనిపోతే క్లెయిమ్ సెటిల్ చేయాల్సిన బాధ్యత నైతికంగా, చట్టబద్ధంగా ఇన్స్యూరెన్స్ కంపెనీలపైన ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ కరోనా వైరస్‌కు సంబంధించిన డెత్ క్లెయిమ్స్ ప్రాసెస్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. 'ఫోర్స్ మ్యాజర్' అంటే అనూహ్య పరిస్థితులు అనే క్లాజ్ కోవిడ్ 19 డెత్ క్లెయిమ్స్‌కు వర్తించదని స్పష్టం చేసింది. 'ఫోర్స్ మ్యాజర్' క్లాజ్‌ను నియంత్రించలేని, ఊహించలేని చర్యలు, పరిస్థితులకు మాత్రమే వర్తిస్తుందని వివరించింది. ఇటీవల కరోనా వైరస్ విజృంభిస్తుండటం, మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో పాలసీహోల్డర్లలో అనేక అనుమానాలున్నాయి.

    కరోనా వైరస్ మహమ్మారి స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుండటం ప్రతీ ఇంట్లో లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ ప్రాథమిక అవసరాన్ని గుర్తుచేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా పాలసీ హోల్డర్లు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన ప్రతీ చర్యలపై లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇండస్ట్రీ దృష్టి పెట్టింది. డిజిటల్ పద్ధతుల్లో సేవలు అందిస్తోంది. ముఖ్యంగా కోవిడ్ 19 కారణంగా సంభవించే మరణాలకు సంబంధించిన క్లెయిమ్స్ సెటిల్ చేయడానికి కృషి చేస్తోంది.
    ఎస్ ఎన్ భట్టాచార్య, సెక్రెటరీ జనరల్, లైఫ్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్


    అసలు కరోనా వైరస్‌తో మరణిస్తే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చా? లేదా అనే డౌట్స్ ఉన్నాయి. వారంతా ఇన్స్యూరెన్స్ కంపెనీలను సంప్రదిస్తున్నారు. దీంతో లైఫ్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్ ఈ సందేహాలకు క్లారిటీ ఇచ్చింది. పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టింది.

    ఇవి కూడా చదవండి:

    Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు వాయిదా వేస్తే ఎంత నష్టమంటే...

    EMI moratorium: ఈఎంఐ వాయిదాకు అప్లై చేయండిలా...

    EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... కొత్త రూల్ అమలులోకి
    Published by:Santhosh Kumar S
    First published: