LIC Navjeevan Plan: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... నవజీవన్ ప్లాన్‌తో లాభాలు ఇవే
మీ పాలసీ ల్యాప్స్ అయిపోతుందని లేదా మీకు బోనస్ వస్తుందని నమ్మించి వివరాలన్నీ సేకరిస్తారు. బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు నెంబర్లన్నీ తీసుకొని క్షణాల్లో వేలకు వేలు మాయం చేస్తుంటారు.
ఇప్పుడు ఆర్థిక లావాదేవీలన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ ఉంటే చాలు... ఎన్ని లక్షల లావాదేవీలైనా చిటికెలో జరిగిపోవాల్సిందే. లావాదేవీలు ఎంత సులభతరం అవుతున్నాయో మోసాలూ అంతే ఎక్కువవుతున్నాయన్నది వాస్తవం. ఫిషింగ్, స్పూఫింగ్, సైబర్ బెదిరింపులు, డేటా చోరీ లాంటి అనేక సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలుకొని ప్రభుత్వరంగ, ప్రైవేట్ బ్యాంకులన్నీ కస్టమర్లను నిత్యం హెచ్చరిస్తుంటాయి. అప్రమత్తం చేస్తుంటాయి. కేవలం బ్యాంకులు మాత్రమే కాదు... లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలైన ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్ కూడా కస్టమర్లను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. తాజాగా లైఫ్ ఇన్స్యూరెన్స్ ఆఫ్ ఇండియా(LIC) పాలసీహోల్డర్లను మరోసారి హెచ్చరిస్తోంది.
— LIC India Forever (@LICIndiaForever) March 6, 2019
చాలామంది మోసగాళ్లు ఇ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్లు పంపి కస్టమర్లను వలలో వేసుకుంటారు. మీ పాలసీ ల్యాప్స్ అయిపోతుందని లేదా మీకు బోనస్ వస్తుందని నమ్మించి వివరాలన్నీ సేకరిస్తారు. బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు నెంబర్లన్నీ తీసుకొని క్షణాల్లో వేలకు వేలు మాయం చేస్తుంటారు. చాలామంది కస్టమర్లు తమకు వచ్చిన ఇమెయిల్స్, ఎస్ఎంఎస్లు కంపెనీ పంపించిందని నమ్మి మోసపోతుంటారు. అందుకే 'మీకు మంచి లాభాలు ఇస్తామని వచ్చే తప్పుడు కాల్స్ నమ్మొద్దు, మీ పాలసీ వివరాలు ఎవరికీ చెప్పొద్దు' అని ఎల్ఐసీ హెచ్చరిస్తోంది. పాలసీ వివరాలు చెప్పాలని ఎవరైనా కాల్ చేసినా, ఇమెయిల్ చేసినా పట్టించుకోవద్దని సూచిస్తోంది. ఇలాంటి వివరాల కోసం తమ ప్రతినిధులు ఎవరూ కాల్ చేయరని, ప్రలోభాలకు గురికావొద్దని అప్రమత్తం చేస్తోంది. మీకు ఇలా వచ్చే ఇమెయిల్స్‌ని ఫిషింగ్ అంటారు. అంటే మిమ్మల్ని ప్రలోభానికి గురిచేసి మీ బ్యాంకు, కార్డుల సమాచారం సేకరించి, ఆ సమాచారం సాయంతో మీ డబ్బులు నొక్కేయడం అన్నమాట. అందుకే మీకు ఇలాంటి ఇమెయిల్స్ వస్తే వెంటనే నమ్మేసి మీ కీలక సమాచారాన్ని వెల్లడించకూడదు. ఏదైనా ఉంటే నేరుగా బ్రాంచుకు వెళ్లి సంప్రదించడం మంచిది.
కొద్ది రోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కస్టమర్లకు ఇలాంటి హెచ్చరికలే చేసింది. మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు కొన్ని సూచనలు చేసింది. ఎక్కువగా జరిగే స్కిమ్మింగ్ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో వివరిస్తూ కస్టమర్లకు ఇమెయిల్ పంపింది. ఎస్బీఐ సూచనల ప్రకారం ఎక్కడైనా మీరు కార్డుతో షాపింగ్ చేసేప్పుడు మీరు మాత్రమే కార్డును స్వైప్ చేయాలి. కంపెనీ ప్రతినిధులకు ఇవ్వొద్దు. మీ పిన్ చెప్పకూడదు. మీరు పిన్ ఎంటర్ చేసేప్పుడు ఎవరికీ కనిపించకుండా చేతిని అడ్డుగా పెట్టాలి. ట్రాన్సాక్షన్ పూర్తైన తర్వాత కార్డు తీసుకోవడం మర్చిపోకూడదు. మీ పిన్ ఎవరికీ చెప్పకూడదు. ఇప్పడు అందరి దగ్గరా చిప్ కార్డులు ఉన్నాయి కాబట్టి... ఇక స్వైప్ చేయాల్సిన అవసరం ఉండదు. కార్డును పీఓఎస్ మెషీన్లో ఇన్సర్ట్ చేస్తే చాలు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే ముందు స్కిమ్మర్ డివైజ్ ఉంచారేమో ఓసారి పరిశీలించాలి. ఏటీఎంలో పిన్ ఎంటర్ చేసే కీప్యాడ్‌ను పరిశీలించాలి. అక్కడ మీ పిన్ తెలుసుకునేందుకు డూప్లికేట్ కీ ప్యాడ్ ఏర్పాటు చేస్తారు నేరగాళ్లు. ఎవరైనా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని పిన్ అడిగితే నమ్మకూడదు. మీ కార్డు నెంబర్, పిన్, సీవీవీ, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎవరికీ చెప్పొద్దు.
ఎల్ఐసీ అయినా, ఎస్బీఐ అయినా లేదా మీరు ఇతర ఏ బ్యాంకు అకౌంట్ వాడుతున్నా... మీ వ్యక్తిగత, బ్యాంకు సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకూడదన్న నియమాన్ని గుర్తుంచుకోవడం మంచిది.
Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.