హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC SMS Service: ఒక్క ఎస్ఎంఎస్‌తో ఎల్ఐసీ పాలసీ స్టేటస్ తెలుసుకోవచ్చు ఇలా

LIC SMS Service: ఒక్క ఎస్ఎంఎస్‌తో ఎల్ఐసీ పాలసీ స్టేటస్ తెలుసుకోవచ్చు ఇలా

LIC SMS Service: ఒక్క ఎస్ఎంఎస్‌తో ఎల్ఐసీ పాలసీ స్టేటస్ తెలుసుకోవచ్చు ఇలా

LIC SMS Service: ఒక్క ఎస్ఎంఎస్‌తో ఎల్ఐసీ పాలసీ స్టేటస్ తెలుసుకోవచ్చు ఇలా

LIC SMS Service | మీ పాలసీ స్టేట్‌మెంట్, పాలసీ ప్రీమియం, మెచ్యూరిటీ, పాలసీ స్టేటస్... ఇలా ఏ సమాచారం కావాలన్నా ఎస్ఎంఎస్‌ ద్వారా తెలుస్తుంది.

    లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా... భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద బీమా సంస్థ. ఎల్ఐసీ గురించి తెలియనివాళ్లుండరు. కుటుంబంలో ఒక్కరికైనా ఎల్ఐసీ పాలసీ ఉంటుంది. ఇకపై మీకు ఎల్ఐసీకి సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ పాలసీకి సంబంధించిన ఏ సమాచారమైనా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. మీరు ఇ-సర్వీసెస్ పొందాలనుకుంటే ముందుగా ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ సర్వీసుల కోసం రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం ఈ లింక్ https://ebiz.licindia.in/D2CPM/#Register క్లిక్ చేయండి. ఆన్‌లైన్ సర్వీసుల్ని ఉపయోగించుకొని మీ పాలసీ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మీ పేరు, పాలసీ నెంబర్, పుట్టిన తేదీతో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ ఎల్ఐసీ అకౌంట్ ఓపెన్ అవుతుంది.


    మీరు 022 6827 6827 నెంబర్‌కు కాల్ చేసి కూడా మీ పాలసీ వివరాలు తెలుసుకోవచ్చు. ఒక్క ఎస్ఎంఎస్‌ పంపినా ఎల్ఐసీ పాలసీ సమాచారం తెలుస్తోంది. మీ పాలసీ స్టేట్‌మెంట్, పాలసీ ప్రీమియం, మెచ్యూరిటీ, పాలసీ స్టేటస్... ఇలా ఏ సమాచారం కావాలన్నా ఎస్ఎంఎస్‌ ద్వారా తెలుస్తుంది. LICHELP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పాలసీ నెంబర్ టైప్ చేసి 9222492224 లేదా 56767877 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఎల్ఐసీ కస్టమర్లందరికీ ఈ సర్వీస్ ఉచితం. ఎస్ఎంఎస్ ద్వారా ఈ కింది వివరాలన్నీ పొందొచ్చు.


    ఇన్‌స్టాల్‌మెంట్ ప్రీమియం: ASKLIC PREMIUM

    రివైవల్ అమౌంట్: ASKLIC REVIVAL

    బోనస్ అడిషన్స్: ASKLIC BONUS

    లోన్: ASKLIC LOAN

    నామినేషన్ వివరాలు: ASKLIC NOM

    ఐపీపీ పాలసీ స్టేటస్: ASKLIC STAT

    సర్టిఫికెట్ డ్యూ: ASKLIC ECDUE

    యాన్యుటీ రిలీజ్ డేట్: ASKLIC ANNPD

    యాన్యుటీ అమౌంట్: ASKLIC AMOUNT

    చెక్ రిటర్న్ సమాచారం: ASKLIC CHQRET


    Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?



    ఇవి కూడా చదవండి:


    PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్‌కి పాన్ కార్డు అవసరమో తెలుసా?


    Railway Jobs: డిగ్రీ ఉందా? ఎంఎస్ ఆఫీస్ వచ్చా? రైల్వేలో 95 ఉద్యోగాలు...


    Zomato Cricket Cup: క్రికెట్ మ్యాచ్‌ ఫలితాన్ని కరెక్ట్‌గా చెప్తే 100% క్యాష్‌బ్యాక్

    First published:

    Tags: LIC, Personal Finance

    ఉత్తమ కథలు