హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Arogya Rakshak: ఎల్ఐసీ నుంచి కొత్త హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ... బెనిఫిట్స్ ఇవే

LIC Arogya Rakshak: ఎల్ఐసీ నుంచి కొత్త హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ... బెనిఫిట్స్ ఇవే

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

LIC Arogya Rakshak | లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC మరో హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎల్ఐసీ ఆరోగ్య రక్షక్ పాలసీ బెనిఫిట్స్ తెలుసుకోండి.

హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC కొత్త హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీని అందిస్తోంది. ఆరోగ్య రక్షక్ (Arogya Rakshak) పేరుతో ఈ పాలసీ అందుబాటులోకి వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో ఆరోగ్య బీమా తీసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. LIC Arogya Rakshak పాలసీలో పాలసీ తీసుకున్న వ్యక్తి, వారి జీవిత భాగస్వామి, 65 ఏళ్ల లోపు తల్లిదండ్రులు, 20 ఏళ్ల లోపు పిల్లలకు ఆరోగ్య బీమా లభిస్తుంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ బెనిఫిట్ ఎంతకైనా ఎంచుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ చేయడానికి వేర్వేరు ఆప్షన్స్ ఉంటాయి. హాస్పటలైజేషన్, సర్జరీ లాంటివి కవర్ అవుతాయి. ప్రిన్సిపల్ ఇన్స్యూర్డ్ అంటే పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ప్రీమియం వేవర్ వర్తిస్తుంది. అంటే ఆ పాలసీదారుడి కుటుంబ సభ్యులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పాలసీలో అంబులెన్స్ బెనిఫిట్, హెల్త్ చెకప్ బెనిఫిట్ లాంటివి కవర్ అవుతాయి.

Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ కావాలా? రోజూ రూ.7 పొదుపు చేస్తే చాలు

ఎల్ఐసీ ఆరోగ్య రక్షక్ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 18 ఏళ్లు. గరిష్ట వయస్సు 65 ఏళ్లు. పిల్లల వయస్సు 91 రోజుల నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. రూ.2,500 నుంచి రూ.10,000 వరకు డైలీ బెనిఫిట్ ఎంచుకోవచ్చు. ఆటో స్టెప్ అప్ బెనిఫిట్, నో క్లెయిమ్ బెనిఫిట్ ద్వారా హెల్త్ కవర్ పెంచుకోవచ్చు. మేజర్ సర్జికల్ బెనిఫిట్ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ కన్నా 100 రెట్లు ఎక్కువగా కవర్ అవుతుంది. అంటే రూ.2,50,000 నుంచి రూ.10,00,000 వరకు మేజర్ సర్జికల్ బెనిఫిట్ పొందొచ్చు. డే కేర్ ప్రొసీజర్ బెనిఫిట్, ఇతర సర్జికల్ బెనిఫిట్, మెడికల్ మేనేజ్‌మెంట్ బెనిఫిట్, మేజర్ సర్జికల్ బెనిఫిట్ రీస్టోరేషన్, ఎక్స్‌టెండెడ్ హాస్పటలైజేషన్ బెనిఫిట్, హెల్త్ చెకప్ బెనిఫిట్ లాంటివి ఉంటాయి.

EPFO: ఉద్యోగం మారగానే ఈపీఎఫ్ అకౌంట్‌లో ఈ వివరాలు అప్‌డేట్ చేయండి

ఉదాహరణకు 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రోజూ రూ.5000 డైలీ బెనిఫిట్ ఎంచుకొని ఎల్ఐసీ ఆరోగ్య రక్షక్ పాలసీ తీసుకుంటే రూ.7,884 ప్రీమియం చెల్లించాలి. 30 ఏళ్ల వ్యక్తి రూ.9,543 ప్రీమియం, 40 ఏళ్ల వ్యక్తి రూ.12,381 ప్రీమియం, 50 ఏళ్ల వ్యక్తి రూ.17,254 ప్రీమియం చెల్లించాలి. ఈ పాలసీలో భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని చేరిస్తే ప్రీమియం పెరుగుతుంది. పాలసీదారుడు, జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల వయస్సును బట్టి ప్రీమియం మారుతుంది. ఎల్ఐసీ ఆరోగ్య రక్షక్ పాలసీతో కలిపి ఎల్ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ఎల్ఐసీ యాక్సిడెంట్, బెనిఫిట్ రైడర్ తీసుకోవచ్చు. ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత 15 రోజుల వరకు ఫ్రీలుక్ పీరియడ్ ఉంటుంది. పాలసీ నచ్చకపోతే వెనక్కి ఇచ్చేయొచ్చు. పాలసీ ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత పాలసీ ల్యాప్స్ అవుతుంది.

First published:

Tags: Health Insurance, LIC, Personal Finance

ఉత్తమ కథలు