LIC: ఎల్ఐసీ పాలసీ తీసుకుంటున్నారా? డిసెంబర్ 1 నుంచి మార్పులివే

Life Insurance corporation of India | ప్రస్తుతం ఉన్న ప్రపోజల్ ఫామ్స్‌తో పోలిస్తే కొత్త ఫామ్స్ మరింత సమగ్రంగా, సుదీర్ఘంగా ఉండనుంది. 2019 డిసెంబర్ 1న రీలాంఛ్ చేసే ప్లాన్స్‌ అన్నింటికీ రివైజ్డ్ ప్రపోజల్ ఫామ్స్‌ను మాత్రమే స్వీకరిస్తుంది ఎల్ఐసీ.

news18-telugu
Updated: November 27, 2019, 12:37 PM IST
LIC: ఎల్ఐసీ పాలసీ తీసుకుంటున్నారా? డిసెంబర్ 1 నుంచి మార్పులివే
LIC: ఎల్ఐసీ పాలసీ తీసుకుంటున్నారా? డిసెంబర్ 1 నుంచి మార్పులివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు కొత్త ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? మీరు ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారా? అయితే డిసెంబర్ 1 మీకు కీలకం కానుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC నవంబర్ 30న కొన్ని పాలసీలను రద్దు చేస్తుందన్న సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్ 1న కొత్త ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయి. అంతే కాదు... ఇంకా కొన్ని నిబంధనలు కూడా మారనున్నాయి. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI జారీ చేసిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఎల్ఐసీ కొన్ని నియమనిబంధనల్ని మార్చనుంది. ప్రపోజల్ ఫామ్స్‌ను కూడా మారుస్తోంది ఎల్ఐసీ. ప్రస్తుతం ఉన్న ప్రపోజల్ ఫామ్స్‌తో పోలిస్తే కొత్త ఫామ్స్ మరింత సమగ్రంగా, సుదీర్ఘంగా ఉండనుంది. 2019 డిసెంబర్ 1న రీలాంఛ్ చేసే ప్లాన్స్‌ అన్నింటికీ రివైజ్డ్ ప్రపోజల్ ఫామ్స్‌ను మాత్రమే స్వీకరిస్తుంది ఎల్ఐసీ.

ఉదాహరణకు 18 ఏళ్లు దాటిన వ్యక్తి ఇన్స్యూరెన్స్ తీసుకునేందుకు పూర్తిచేయాల్సిన ప్రపోజల్ ఫామ్ 300 ప్రస్తుతం 8 పేజీలు ఉంది. అందులో ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, నెఫ్ట్ ఫామ్ లాంటివి ఉంటాయి. ఇకపై ఆ ఫామ్ 11 పేజీలు ఉండబోతోంది. అందులో ఏజెంట్ రిపోర్ట్‌తో పాటు నెఫ్ట్ ఫామ్ కూడా ఉంటుంది. రివైజ్డ్ ప్రపోజల్ ఫామ్‌‌లో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. మొదటి సెక్షన్‌లో ప్రపోజర్ వివరాలు ఉంటాయి. కఠినమైన కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. దాంతో పాటు నామినీల ఐడీ ప్రూఫ్స్, మైనర్ నామినీ, పేరు, సంతకం లాంటివన్నీ తప్పనిసరి. రెండో సెక్షన్‌లో ప్లాన్ వివరాలు, రైడర్స్ లాంటివి ఉంటాయి. మూడో సెక్షన్‌లో వ్యక్తిగత, కుటుంబ వివరాలు, ఆరోగ్యం, అలవాట్లు, నాలుగో సెక్షన్‌లో డిక్లరేషన్ ఉంటాయి.

Vivo U20: ఆకట్టుకునే ఫీచర్లతో వివో యూ20... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

LIC: మీ ఎల్ఐసీ పాలసీ రెన్యువల్‌కు 3 రోజులే గడువు

LIC Agent: టెన్త్ పాసైతే ఎల్ఐసీ ఏజెంట్‌గా అవకాశాలు... దరఖాస్తుల్ని కోరుతున్న కంపెనీIRCTC Agent Scheme: పెట్టుబడి రూ.3999... నెలకు ఆదాయం రూ.80,000... బిజినెస్ ఐడియా ఇదే
First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>