Home /News /business /

LIC ఖాతాదారులకు అలర్ట్.. అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక.. వివరాలివే

LIC ఖాతాదారులకు అలర్ట్.. అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    దేశంలో సైబర్ నేరాలు ఇటీవల అధికం అయ్యాయి. పేరొందిన సంస్థల లోగోలతో ప్రజలను కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. తాజాగా బీమా రంగం దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) లోగోలను వాడుతూ కొందరు ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ విషయం సంస్థ దృష్టికి వెళ్లడంతో స్పందించింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని తీవ్రంగా హెచ్చరించింది. సంస్థ లోగోను ఎవరూ అనుమతి లేకుండా వినియోగంచవద్దని స్పష్టం చేసింది ఎల్ఐసీ. అలా చేస్తే శిక్షార్హమని హెచ్చరించింది. ఎవరైనా ఇంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మరో కీలక ప్రకటనను సైతం ఎల్ఐసీ జారీ చేసింది. ఎవరైనా ఫోన్ చేసి ఎల్ఐసీకి సంబంధించిన వివరాలను అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని సూచించింది.

    బోనస్ కు సంబంధించిన వివరాలను ఎల్ఐసీ ఫోన్ ద్వారా తెలపదని వివరించింది సంస్థ. ఎల్ఐసీకి చెందిన అధికారులెవరూ ఫోన్ ద్వారా పాలసీ నంబర్, పాన్ నంబర్, నామినీ వివరాలను అడగరని సంస్థ స్పష్టం చేసింది. అలాంటి వివరాలను ఎవరైనా ఎల్ఐసీ అధికారులమంటూ ఫోన్ చేసి అడిగితే చెప్పవద్దని తెలిపింది.





    అలాంటి కాల్స్ వస్తే spuriouscalls@licindia.com ఈ మెయిల్ కు సమాచారం అందించాలని ఎల్ఐసీ సూచించింది. 022-6827 6827 నంబర్ కు సైతం ఎల్ఐసీ ఖాతాదారులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించింది. ఈ విషయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ఎల్ఐసీ. ఖాతాదారులతో పాటు, ప్రజలంతా ఈ విషయాలపై అవగాహన పెంచుకుని మోసపోకుండా ఉండాలని సూచించింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CYBER CRIME, LIC, Life Insurance, Online fraud

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు