LIC: మహిళా ఉద్యోగులకు ఎల్ఐసీ గుడ్ న్యూస్... ఇక 15 నెలలు ప్రసూతి సెలవులు
Life Insurance Corporation of India Leave Rules | మొదటి, రెండో సంతానానికి ఆరు నెలల చొప్పున, మూడో సంతానానికి మూడు నెలలు సెలవు తీసుకోవచ్చు.
news18-telugu
Updated: June 5, 2019, 5:16 PM IST

LIC: మహిళా ఉద్యోగులకు ఎల్ఐసీ గుడ్ న్యూస్... ఇక 15 నెలలు ప్రసూతి సెలవులు (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: June 5, 2019, 5:16 PM IST
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు శుభవార్త. మొత్తం సర్వీస్‌లో ప్రసూతి సెలవుల్ని 15 నెలలకు పొడిగించింది ఎల్ఐసీ. గతంలో ఉన్న ప్రసూతి సెలవుల కంటే మూడు నెలలు ఎక్కువగా సెలవులు లభిస్తాయి. మొత్తం సర్వీస్ పీరియడ్‌లో గరిష్టంగా 15 నెలల ప్రసూతి సెలవులు పొందొచ్చని ప్రకటించింది ఎల్ఐసీ. క్లాస్-1 అధికారులు, డెవలప్మెంట్ ఆఫీసర్స్, క్లాస్-III/IV ఉద్యోగులందరికీ 2019 మే 31 నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి. 2018 మార్చి 31 నాటి లెక్కల ప్రకారం ఎల్ఐసీలో మొత్తం 1.12 లక్షల మంది ఉద్యోగులు ఉండగా వారిలో 24,000 మంది మహిళలు.
సవరించిన సెలవుల నిబంధనల ప్రకారం ఒకేసారి ఆరు నెలల సెలవులు తీసుకోవచ్చు. ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులు ఒకేసారి గరిష్టంగా మూడు నెలలు సెలవు తీసుకోవచ్చు. అంటే మొదటి, రెండో సంతానానికి ఆరు నెలల చొప్పున, మూడో సంతానానికి మూడు నెలలు సెలవు తీసుకోవచ్చు. అంతేకాదు... పిల్లలు లేని మహిళా ఉద్యోగులకు రెండు నిబంధనలున్నాయి. మొదటి నిబంధన ప్రకారం ఏడాది లోపు ఉన్న పిల్లల్ని చట్టపరంగా దత్తత తీసుకున్నా మాతృత్వ సెలవులు వర్తిస్తాయి. గరిష్టంగా 12 వారాలు లేదా చిన్నారి వయస్సు ఏడాది వచ్చేవరకు సెలవులు తీసుకోవచ్చు. రెండో నిబంధన ప్రకారం పిల్లలు లేని మహిళలు సరోగసీ విధానంలో తల్లి అయితే చిన్నారి పుట్టిన నాటి నుంచి 12 వారాల సెలవు తీసుకోవచ్చు.
రెండు రోజుల క్రితమే ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీ జొమాటో తమ కంపెనీలో పనిచేసే మహిళలతో పాటు పురుషులకు 26 నెలల పేరెంటల్ లీవ్ ప్రకటించడం విశేషం. తల్లిదండ్రులిద్దరికీ 26 వారాల పేరెంటల్ లీవ్ ప్రకటించిన తొలి ఇండియన్ ప్రైవేట్ కంపెనీ జొమాటో. కొద్ది రోజుల క్రితం ఆల్కహాల్ తయారీ కంపెనీ డియాజియో కూడా తమ ఉద్యోగులకు 26 వారాల మాతృత్వ సెలవులు, నాలుగు వారాల పితృత్వ సెలవుల్ని ప్రకటించింది.Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?
ఇవి కూాడా చదవండి:
Budget 2019: స్మార్ట్‌ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు టాప్-10 మోడల్స్ ఇవే... Aadhaar Franchise: ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకోండి ఇలా
SBI-Aadhaar: ఒక్క నిమిషంలో మీ ఎస్బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండి ఇలా...
సవరించిన సెలవుల నిబంధనల ప్రకారం ఒకేసారి ఆరు నెలల సెలవులు తీసుకోవచ్చు. ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులు ఒకేసారి గరిష్టంగా మూడు నెలలు సెలవు తీసుకోవచ్చు. అంటే మొదటి, రెండో సంతానానికి ఆరు నెలల చొప్పున, మూడో సంతానానికి మూడు నెలలు సెలవు తీసుకోవచ్చు. అంతేకాదు... పిల్లలు లేని మహిళా ఉద్యోగులకు రెండు నిబంధనలున్నాయి. మొదటి నిబంధన ప్రకారం ఏడాది లోపు ఉన్న పిల్లల్ని చట్టపరంగా దత్తత తీసుకున్నా మాతృత్వ సెలవులు వర్తిస్తాయి. గరిష్టంగా 12 వారాలు లేదా చిన్నారి వయస్సు ఏడాది వచ్చేవరకు సెలవులు తీసుకోవచ్చు. రెండో నిబంధన ప్రకారం పిల్లలు లేని మహిళలు సరోగసీ విధానంలో తల్లి అయితే చిన్నారి పుట్టిన నాటి నుంచి 12 వారాల సెలవు తీసుకోవచ్చు.
రెండు రోజుల క్రితమే ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీ జొమాటో తమ కంపెనీలో పనిచేసే మహిళలతో పాటు పురుషులకు 26 నెలల పేరెంటల్ లీవ్ ప్రకటించడం విశేషం. తల్లిదండ్రులిద్దరికీ 26 వారాల పేరెంటల్ లీవ్ ప్రకటించిన తొలి ఇండియన్ ప్రైవేట్ కంపెనీ జొమాటో. కొద్ది రోజుల క్రితం ఆల్కహాల్ తయారీ కంపెనీ డియాజియో కూడా తమ ఉద్యోగులకు 26 వారాల మాతృత్వ సెలవులు, నాలుగు వారాల పితృత్వ సెలవుల్ని ప్రకటించింది.Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?
LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే
LIC: పాలసీలు ఉన్నవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్
LIC: ఎల్ఐసీ పాలసీ తీసుకుంటున్నారా? డిసెంబర్ 1 నుంచి మార్పులివే
LIC Agent: టెన్త్ పాసైతే ఎల్ఐసీ ఏజెంట్‌గా అవకాశాలు... దరఖాస్తుల్ని కోరుతున్న కంపెనీ
LIC Revival Campaign: గుడ్ న్యూస్... పాలసీ రివైవల్ క్యాంపైన్ గడువు పొడిగించిన ఎల్ఐసీ
LIC Children's Policy: మీ పిల్లల పేరుపై రోజుకు రూ.12 పొదుపు చేస్తే... వచ్చే లాభాలివే
ఇవి కూాడా చదవండి:
Budget 2019: స్మార్ట్‌ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు టాప్-10 మోడల్స్ ఇవే...
Loading...
SBI-Aadhaar: ఒక్క నిమిషంలో మీ ఎస్బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండి ఇలా...
Loading...