LIFE INSURANCE CORPORATION OF INDIA LIC LAUNCHES NEW SIIP POLICY KNOW BENEFITS SS
LIC Policy: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... సిప్ ప్లాన్‌తో లాభాలు ఇవే
LIC Policy: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... సిప్ ప్లాన్‌తో లాభాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
LIC SIIP Policy | ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. సరికొత్త పాలసీలను ప్రకటించింది ఎల్ఐసీ. మ్యూచువల్ ఫండ్‌తో పాటు జీవిత బీమా అందించే ఎల్ఐసీ సిప్ పాలసీ వివరాలు తెలుసుకోండి.
మీరు ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? లేదా భవిష్యత్తు అవసరాల కోసం నెలనెలా డబ్బులు దాచుకోవాలని అనుకుంటున్నారా? మీ కోసమే లైఫ్ ఇన్స్యూరెన్స్ ఆఫ్ ఇండియా-LIC సరికొత్త పాలసీని ప్రకటించింది. LIC SIIP పేరుతో యూనిట్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ ఇది. ఇందులో నెలకు కనీసం రూ.4,000 పొదుపు చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లాంటి స్కీమ్ ఇది. అయితే ఇందులో లైఫ్ ఇన్స్యూరెన్స్ కవర్ కూడా లభిస్తుంది. ఈ పాలసీని ఏజెంట్ దగ్గర లేదా ఆన్లైన్లో తీసుకోవచ్చు. మరి ఎల్ఐసీ సిప్ పాలసీతో వచ్చే లాభాలు ఏంటో తెలుసుకోండి.
LIC SIIP Policy: ఎల్ఐసీ సిప్ పాలసీ వివరాలివే...
కనీస వయస్సు- 90 రోజులు
గరిష్ట వయస్సు- 65 ఏళ్లు
మెచ్యూరిటీకి కనీస వయస్సు- 18 ఏళ్లు
మెచ్యూరిటీకి గరిష్ట వయస్సు- 85 ఏళ్లు
పాలసీ టర్మ్- 10 నుంచి 25 ఏళ్లు
ఎంత పొదుపు చేయాలి: నెలకు రూ.4,000 లేదా ఏడాదికి రూ.40,000.
ఫండ్ ఆప్షన్స్- బాండ్, సెక్యూర్డ్, బ్యాలెన్స్డ్, గ్రోత్ పేరుతో నాలుగు ఫండ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఏడాదిలో ఈ నాలుగు ఫండ్స్‌లో ఏ ఆప్షన్‌లోకి అయినా ఉచితంగా మీ డబ్బును మార్చుకోవచ్చు.
విత్‌డ్రా- 5వ ఏడాది నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
పాలసీ లాభాలు- లైఫ్ రిస్క్ కవర్ ఉంటుంది. యూనిట్ ఫండ్ వ్యాల్యూకు గ్యారెంటీ అడిషన్స్ లభిస్తాయి. మెచ్యూరిటీ సమయంలో ఫండ్ వ్యాల్యూ ఎంత ఉంటే అంత మొత్తం లభిస్తుంది.
సమ్ అష్యూర్డ్: 55 ఏళ్ల లోపు ఉంటే వార్షిక ప్రీమియంకు 10 రెట్లు, 55 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారికి వార్షిక ప్రీమియంకు 7 రెట్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.