LIC Jeevan Amar: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... లాభాలు ఇవే

LIC Jeevan Amar Policy | ఎల్ఐసీ జీవన్ అమర్ టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ అన్న విషయం గుర్తుంచుకోవాలి. అంటే పాలసీదారుడు ప్రీమియం చెల్లిస్తున్న గడువులో చనిపోతేనే వారి కుటుంబానికి బీమా డబ్బులు వస్తాయి.

news18-telugu
Updated: August 7, 2019, 6:03 PM IST
LIC Jeevan Amar: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... లాభాలు ఇవే
LIC Jeevan Amar: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... లాభాలు ఇవే
news18-telugu
Updated: August 7, 2019, 6:03 PM IST
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా... భారత ప్రభుత్వానికి చెందిన బీమా రంగ సంస్థ. ఎల్ఐసీ గురించి తెలియని వాళ్లుండరు. వేర్వేరు వర్గాలకు వేర్వేరు పాలసీలతో గ్రామగ్రామానికి విస్తరించిన బీమా కంపెనీ ఇది. ఇప్పుడు 'ఎల్ఐసీ జీవన్ అమర్' పేరుతో కొత్త పాలసీని తీసుకొచ్చింది. రూ.1 కోటికి టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్న పురుషులు ఏడాది ప్రీమియం కనీసం రూ.10,800 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు రూ.9,440 చెల్లించాలి. కనీసం రూ.25 లక్షలకు పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి ఏమీ లేదు. పాలసీ హోల్డర్లు రెండు రకాల డెత్ బెనిఫిట్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. లెవెల్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్ ఎంచుకున్నవారికి మొదట బీమా మొత్తం ఎంత ఎంచుకుంటే అంతే ఉంటుంది. అంటే రూ.25 లక్షలకు ప్రీమియం చెల్లిస్తే బీమా అంతే కవర్ అవుతుంది. ఒకవేళ ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్ ఎంచుకుంటే ఐదేళ్ల తర్వాత బేసిక్ సమ్ అష్యూర్డ్ 10 శాతం చొప్పున 15 ఏళ్ల పాటు పెరుగుతుంది. ఉదాహరణకు రూ.25 లక్షలకు బీమా ఎంచుకుంటే ఐదేళ్ల వరకు అంతే ఉంటుంది. ఆ తర్వాత ప్రతీ ఏడాది 10 శాతం చొప్పున బీమా కవర్ పెరుగుతుంది.

LIC Jeevan Amar Policy, LIC Jeevan Amar Policy details, Life Insurance corporation of India, LIC new policy, LIC term insurance Policy, ఎల్ఐసీ జీవన్ అమర్ పాలసీ, ఎల్ఐసీ జీవన్ అమర్ పాలసీ వివరాలు, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ కొత్త పాలసీ, ఎల్ఐసీ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ
ఎల్ఐసీ జీవన్ అమర్ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ వివరాలు


ఎల్ఐసీ జీవన్ అమర్ టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ అన్న విషయం గుర్తుంచుకోవాలి. అంటే పాలసీదారుడు ప్రీమియం చెల్లిస్తున్న గడువులో చనిపోతేనే వారి కుటుంబానికి బీమా డబ్బులు వస్తాయి. మెచ్యూరిటీ తర్వాత డబ్బులు రావు. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లెవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. మెచ్యూరిటీ వయస్సు 28 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య ఉంటుంది. పాలసీ గడువు 10 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుంది. ఇక ప్రీమియం వివరాలు చూస్తే రెగ్యులర్, లిమిటెడ్, సింగిల్ ప్రీమియం ఆప్షన్లు ఉన్నాయి. ఈ పాలసీ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ... అదిరిపోయిన ఫోటోలు




ఇవి కూడా చదవండి:

Metz TV: రూ.17,999 ధరకే 40 అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ
Loading...
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో నేషనల్ షాపింగ్ డేస్ సేల్... ఆఫర్లు ఇవే

EPF Withdraw: ఏ కారణానికి ఎంత పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చో తెలుసా?
First published: August 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...