news18-telugu
Updated: November 19, 2019, 6:04 PM IST
LIC Revival Campaign: గుడ్ న్యూస్... పాలసీ రివైవల్ క్యాంపైన్ గడువు పొడిగించిన ఎల్ఐసీ
(ప్రతీకాత్మక చిత్రం)
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC నుంచి మరో శుభవార్త. 63 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్ఐసీ సెప్టెంబర్ 16న ప్రారంభించిన రివైవల్ క్యాంపైన్ గడువు పెరిగింది. వాస్తవానికి స్పెషల్ రివైవల్ క్యాంపైన్ నవంబర్ 15న ముగిసింది. కానీ... పాలసీ రెన్యువల్ చేసుకోవాలనుకునేవారికి మరో అవకాశాన్ని ఇస్తూ నవంబర్ 30 వరకు గడువును పొడిగించింది ఎల్ఐసీ. 2014 జనవరి 1 తర్వాత తీసుకున్న పాలసీలు ల్యాప్స్ అయిపోతే వాటిని కూడా రివైవ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది ఎల్ఐసీ. దీంతో పాలసీ రివైవల్ క్యాంపైన్ తేదీ పొడిగించింది. మీరు ల్యాప్స్ అయిన మీ ఎల్ఐసీ పాలసీని రెన్యువల్ చేసుకోవాలనుకుంటే నవంబర్ 30 వరకు అవకాశముంది. గడువులోగా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల ఎల్ఐసీ పాలసీలు ల్యాప్స్ అవుతుంటాయి. వాటిని రెన్యువల్ చేసేందుకు తరచూ పాలసీ రివైవల్ క్యాంపైన్ నిర్వహిస్తూ ఉంటుంది ఎల్ఐసీ. ల్యాప్స్ అయిన మీ పాలసీని ఈ క్యాంపైన్లో రెన్యువల్ చేయొచ్చు. ల్యాప్స్ అయిన పాలసీ రెన్యువల్ చేయిస్తే అనేక లాభాలు ఉంటాయి. పాలసీ నిబంధనల ప్రకారం మీ రిస్క్ కవర్ కొనసాగుతుంది. పాలసీ ల్యాప్స్ కావడం వల్ల ఆగిపోయిన బోనస్లు, బకాయిలన్నీ క్రెడిట్ అవుతాయి.
LIC Revival Campaign: ఏఏ పాలసీలు రెన్యువల్ చేయొచ్చు?
ఎల్ఐసీ రివైవల్ క్యాంపైన్లో వ్యక్తిగత, ఆరోగ్య బీమా పాలసీలను రెన్యువల్ చేయొచ్చు. నాన్-లింక్డ్ పాలసీలను ఐదేళ్లలో, యూనిట్ లింక్డ్ పాలసీలను మూడేళ్లలో రివైవ్ చేసుకోవచ్చు. అంటే ప్రీమియం చెల్లించకుండా రెండేళ్లు దాటిపోయినా ఆ పాలసీలను రివైవ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎల్ఐసీ. గ్రేస్ పీరియడ్లో మీరు ప్రీమియం చెల్లించకపోతే మీ పాలసీ ల్యాప్స్ అయినట్టే. పాలసీ ల్యాప్స్ అయితే మీరు బీమా లాభాలను కోల్పోతారు. అందుకే మీరు పాలసీని రెన్యువల్ చేసుకుంటే బీమా లాభాలు ముందు లాగే లభిస్తాయి. ఏజెంట్ దగ్గర తీసుకున్న పాలసీలు మాత్రమే కాదు... ఆన్లైన్లో తీసుకున్న పాలసీలు కూడా రెన్యువల్ చేయొచ్చు. ఎల్ఐసీ రివైవల్ క్యాంపైన్లో పాలసీ రెన్యువల్ చేస్తే లేట్ ఫీజులో తగ్గింపు లభిస్తుంది. రూ.1,00,000 వరకు 20% గరిష్టంగా రూ.1500 వరకు, రూ.100001 నుంచి రూ.3,00,000 వరకు 25% గరిష్టంగా రూ.2000 వరకు, రూ.300001 కన్నా ఎక్కువ ప్రీమియంకు 30% గరిష్టంగా రూ.2500 వరకు తగ్గింపు పొందొచ్చు.
Mi Organic T-shirt: షావోమీ నుంచి ఆర్గానిక్ టీ-షర్ట్స్... ఎలా ఉన్నాయో చూడండి
ఇవి కూడా చదవండి:
Fake Apps: పొరపాటున ఫేక్ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారా? ఈ టిప్స్ పాటించండిIRCTC: రైల్వే ప్రయాణికులకు 49 పైసలకే రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్ ఇస్తున్న ఐఆర్సీటీసీ
LIC: ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెల్లించలేదా? గుడ్ న్యూస్
Published by:
Santhosh Kumar S
First published:
November 19, 2019, 11:35 AM IST