LIC Good News: ల్యాప్స్ అయిన పాలసీని రెన్యువల్ చేయండి ఇలా

LIC Revival Campaign | ఏజెంట్ దగ్గర తీసుకున్న పాలసీలు మాత్రమే కాదు... ఆన్‌లైన్‌లో తీసుకున్న పాలసీలు కూడా రెన్యువల్ చేయొచ్చు. ఎల్ఐసీ రివైవల్ క్యాంపైన్‌లో పాలసీ రెన్యువల్ చేస్తే లేట్ ఫీజులో లగ్గింపు లభిస్తుంది.

news18-telugu
Updated: November 19, 2019, 6:05 PM IST
LIC Good News: ల్యాప్స్ అయిన పాలసీని రెన్యువల్ చేయండి ఇలా
LIC Good News: ల్యాప్స్ అయిన పాలసీని రెన్యువల్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC పాలసీ తీసుకున్నారా? ప్రీమియం చెల్లించకపోవడంతో పాలసీ ల్యాప్స్ అయిందా? అయితే మీకు శుభవార్త. 63వ వార్షికోత్సవం సందర్భంగా పాలసీ రివైవల్ క్యాంపైన్ ప్రారంభించింది ఎల్ఐసీ. భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతీ ఇంట్లో ఎల్ఐసీ పాలసీ ఉండటం మామూలైపోయింది. అయితే ప్రీమియంలు చెల్లించకపోవడంతో పాలసీలు ల్యాప్స్ అవుతుంటాయి. వాటిని రెన్యువల్ చేసేందుకు తరచూ పాలసీ రివైవల్ క్యాంపైన్ నిర్వహిస్తూ ఉంటుంది ఎల్ఐసీ. ల్యాప్స్ అయిన మీ పాలసీని ఈ క్యాంపైన్‌లో రెన్యువల్ చేయొచ్చు. సెప్టెంబర్ 16న ప్రారంభమైన స్పెషల్ క్యాంపైన్ నవంబర్ 15న ముగుస్తుంది. అప్పట్లోగా ల్యాప్స్ అయిన పాలసీలను రెన్యువల్ చేయొచ్చు. ల్యాప్స్ అయిన పాలసీ రెన్యువల్ చేయిస్తే అనేక లాభాలు ఉంటాయి. పాలసీ నిబంధనల ప్రకారం మీ రిస్క్ కవర్ కొనసాగుతుంది. పాలసీ ల్యాప్స్ కావడం వల్ల ఆగిపోయిన బోనస్‌లు, బకాయిలన్నీ క్రెడిట్ అవుతాయి.

lic special revival campaign 2019, lic revival campaign, lic revival campaign 2019, lic revival campaign 2019-20, lic lapsed policy renewal scheme 2019, lic policy revival campaign 2019, lic policy revival online payment, Life Insurance Corporation of India, ఎల్ఐసీ స్పెషల్ రివైవల్ క్యాంపైన్ 2019, ఎల్ఐసీ రివైవల్ క్యాంపైన్, ఎల్ఐసీ రివైవల్ క్యాంపైన్ 2019, ఎల్ఐసీ పాలసీ రివైవల్ క్యాంపైన్ 2019, ఎల్ఐసీ పాలసీ రెన్యువల్ క్యాంపైన్ 2019, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
image: Life Insurance Corporation of India


LIC Revival Campaign: ఏఏ పాలసీలు రెన్యువల్ చేయొచ్చు?


ఎల్ఐసీ రివైవల్ క్యాంపైన్‌లో వ్యక్తిగత, ఆరోగ్య బీమా పాలసీలను రెన్యువల్ చేయొచ్చు. మైక్రో, యూలిప్ ప్లాన్స్‌కు రివైవల్‌ సాధ్యం కాదు. గ్రేస్ పీరియడ్‌లో మీరు ప్రీమియం చెల్లించకపోతే మీ పాలసీ ల్యాప్స్ అయినట్టే. పాలసీ ల్యాప్స్ అయితే మీరు బీమా లాభాలను కోల్పోతారు. అందుకే మీరు పాలసీని రెన్యువల్ చేసుకుంటే బీమా లాభాలు ముందు లాగే లభిస్తాయి. ఏజెంట్ దగ్గర తీసుకున్న పాలసీలు మాత్రమే కాదు... ఆన్‌లైన్‌లో తీసుకున్న పాలసీలు కూడా రెన్యువల్ చేయొచ్చు. ఎల్ఐసీ రివైవల్ క్యాంపైన్‌లో పాలసీ రెన్యువల్ చేస్తే లేట్ ఫీజులో తగ్గింపు లభిస్తుంది. రూ.1,00,000 వరకు 20% గరిష్టంగా రూ.1500 వరకు, రూ.100001 నుంచి రూ.3,00,000 వరకు 25% గరిష్టంగా రూ.2000 వరకు, రూ.300001 కన్నా ఎక్కువ ప్రీమియంకు 30% గరిష్టంగా రూ.2500 వరకు తగ్గింపు పొందొచ్చు.

Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:Bank Account: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయొద్దు

e-PAN Card: పాన్ కార్డ్ మర్చిపోయారా? ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా...

Aadhaar Download: ఆధార్ నెంబర్‌తో కార్డు డౌన్‌లోడ్ చేయండి ఇలా...
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading