హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC: ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్... ఈ కొత్త ఫీచర్ మీకోసమే

LIC: ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్... ఈ కొత్త ఫీచర్ మీకోసమే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

LIC | మీరు ఎల్ఐసీ పాలసీ తీసుకున్నారా? కొత్త పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎల్ఐసీ కొత్తగా రూపొందించిన మొబైల్ యాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్స్ వచ్చాయి.

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC... పరిచయం అక్కర్లేని ప్రభుత్వ రంగ బీమా సంస్థ. దేశంలోని అన్ని ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలను కలిపినా... ఇన్స్యూరెన్స్ రంగంలో ఎల్ఐసీదే పైచేయి అన్న సంగతి తెలిసిందే. భారతదేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఎల్ఐసీ గురించి తెలియనివాళ్లుండరు. దశాబ్దాలుగా కోట్లాదిమంది భారతీయులకు బీమా సేవల్ని అందిస్తున్న ఇన్స్యూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీ. టెక్నాలజీని ఉపయోగించుకొని కస్టమర్లకు సేవల్ని అందించడంలోనూ ఎల్ఐసీ ముందుంటోంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో సోషల్ డిస్టెన్సింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆన్‌లైన్‌లోనే అన్ని పనుల్ని చేసేలా టెక్నాలజీ తోడ్పడుతుంది. ఎల్ఐసీ కూడా అలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని పాలసీహోల్డర్లకు సేవలు అందిస్తోంది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎల్ఐసీ... తమ ఏజెంట్ల కోసం ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. ఆత్మ నిర్భర్ ఏజెంట్ న్యూ బిజినెస్ డిజిటల్ అప్లికేషన్-ANANDA పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను 2020 నవంబర్ 19న ఆవిష్కరించింది.

LIC Agent Jobs 2021: టెన్త్ పాసైతే ఎల్ఐసీ ఏజెంట్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

LIC New Jeevan Anand Plan: ఇన్స్యూరెన్స్ పాలసీపై ఎక్కువ లాభాలు కావాలా? ఈ ప్లాన్ మీకోసమే

ఇప్పుడు ఎల్ఐసీ ఆనంద యాప్‌లో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఆన్‌లైన్ ప్రపోజల్ డిపాజిట్ కలెక్షన్ ఫీచర్‌ను అందిస్తోంది ఎల్ఐసీ. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు ప్రపోజల్ డిపాజిట్‌ను ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ గేట్‌వే ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఇ-వ్యాలెట్స్, యూపీఐ ఉపయోగించి సింపుల్‌గా పేమెంట్ చేయొచ్చు. అంతేకాదు... ఎల్ఐసీ కస్టమర్లు యూలిప్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికీ ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలంటే రకరకాల ఫామ్స్‌పై సంతకాలు పెట్టే రోజులు పోయాయి. ఇప్పుడు మొత్తం ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. పేపర్ అవసరం లేకుండా కస్టమర్లకు పాలసీలు అందించేందుకు ఏజెంట్లకు ఎల్ఐసీ ఆనంద మొబైల్ యాప్‌ ఉపయోగపడుతోంది. భారత జీవిత బీమా పరిశ్రమలోనే ఇలాంటి యాప్ ఉపయోగిస్తున్న ఘనత తమదేనని ఎల్ఐసీ ప్రకటిస్తోంది.

LIC Plans: ఉద్యోగం చేస్తున్నారా? ఈ 5 ఎల్ఐసీ పాలసీలు మీకు బెస్ట్

LIC Aadhaar Shila Plan: మహిళల కోసం ఎల్ఐసీలో ప్రత్యేక పాలసీ... బెనిఫిట్స్ ఇవే

ఎల్ఐసీలో గతంలో ఉన్న ఫిజికల్ పేపర్స్ అన్నీ డిజిటల్‌లోకి మారాయి. ఎల్ఐసీ ఆనంద యాప్‌లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. కస్టమర్లు కొత్తగా ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలంటే ఇప్పుడు చాలా సులువు. ఏజెంట్ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. డిజిటల్ పద్ధతుల్లో సులువుగా పాలసీ తీసుకోవచ్చు.

First published:

Tags: Insurance, LIC, Mobile App, Playstore

ఉత్తమ కథలు