లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీహోల్డర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. ల్యాప్స్ అయిన ఇన్స్యూరెన్స్ పాలసీలను పునరుద్ధరించడానికి మరో ఛాన్స్ ఇస్తోంది. ఇందుకోసం స్పెషల్ రివైవల్ క్యాంపైన్ (LIC Special Revival Campaign) ప్రారంభించింది. మార్చి 24 వరకు ఈ క్యాంపైన్ కొనసాగుతుంది. ఎల్ఐసీ పాలసీహోల్డర్స్ తమ పాలసీ ల్యాప్స్ అయితే ఈ క్యాంపైన్‌లో పునరుద్ధరించుకోవచ్చు. తిరిగి పాలసీని కొనసాగించవచ్చు. అయితే ఇందుకోసం పాలసీహోల్డర్స్ కొంత లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే లేట్ ఫీజ్ పైనా డిస్కౌంట్ ప్రకటించింది ఎల్ఐసీ. మరి ఏ పాలసీకి ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.
ల్యాప్స్ అయిన మీ ఎల్ఐసీ పాలసీకి మీరు చెల్లించాల్సిన ప్రీమియం రూ.1,00,000 లోపు ఉంటే లేట్ ఫీజులో 25 శాతం కన్సెషన్ పొందొచ్చు. గరిష్టంగా రూ.2,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక మీరు చెల్లించాల్సిన ప్రీమియం రూ.1,00,001 నుంచి రూ.3,00,000 లోపు ఉంటే లేట్ ఫీజులో 25 శాతం కన్సెషన్ పొందొచ్చు. గరిష్టంగా రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక మీరు చెల్లించాల్సిన ప్రీమియం రూ.3,00,001 పైన ఉంటే లేట్ ఫీజులో 30 శాతం కన్సెషన్ పొందొచ్చు. గరిష్టంగా రూ.3,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మైక్రో ఇన్స్యూరెన్స్ పాలసీలకు లేట్ ఫీజు 100 శాతం తొలగించింది ఎల్ఐసీ.
New Tax Regime: కొత్త పన్ను విధానం ఎంచుకున్న తర్వాత పాత విధానంలోకి వెళ్లొచ్చా?
#LIC #SpecialRevivalCampaign pic.twitter.com/6LJCBA0Q2Z
— LIC India Forever (@LICIndiaForever) February 1, 2023
ల్యాప్స్ అయిన పాలసీ రివైవ్ చేయడానికి కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. మీరు ప్రీమియం చెల్లించని తేదీ నుంచి 5 ఏళ్ల లోపే పాలసీ రివైవ్ చేయాలి. కొన్ని పాలసీలకు మెడికల్ టెస్టులు అవసరం. వాటిపై కన్సెషన్ వర్తించదు. ULIP ప్లాన్‌లు మినహా ఇతర పాలసీలన్నీ రివైవ్ చేయొచ్చు. NACH, బిల్ పే రిజిస్టర్డ్ పాలసీలకు స్పెషల్ ఆఫర్ కింద లేట్ ఫీజు రూ.5 మాత్రమే వసూలు చేస్తోంది ఎల్ఐసీ. ప్రీమియంలు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఎల్ఐసీ ఆఫీస్, ఎల్ఐసీ ఏజెంట్ల దగ్గరా ప్రీమియం చెల్లించవచ్చు.
టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మల్టిపుల్ రిస్క్‌లతో కూడిన పాలసీలు, హై-రిస్క్ ప్లాన్‌లను పునరుద్ధరించడం సాధ్యం కాదు. ప్రీమియం చెల్లింపు వ్యవధిలో ల్యాప్స్ అయిన పాలసీలు మాత్రమే పునరుద్ధరించవచ్చు. అయితే ఈ పాలసీలు రివైవల్ డేట్ లోపే ఉండాలి.
Electric Bike: రూ.25 ఖర్చుతో 100 కిలోమీటర్ల ప్రయాణం... కొత్త ఎలక్ట్రిక్ బైక్ విశేషాలివే
ఎల్ఐసీ రెండు నెలల క్రితం వాట్సప్ సేవల్ని ప్రారంభించింది. పాలసీహోల్డర్స్ 8976862090 మొబైల్ నెంబర్‌కు Hi అని మెసేజ్ చేసి 10 సేవల్ని పొందొచ్చు. ప్రీమియం డ్యూ, బోనస్ వివరాలు, పాలసీ స్టేటస్ లాంటి అనేక సేవలు పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurance, LIC, Personal Finance