లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రెండు టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్‌ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. జీవన్ అమర్, టెక్ టర్మ్ పాలసీలను నిలిపివేస్తున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది. అయితే వీటి స్థానంలో ఇవే పేర్లతో రెండు కొత్త పాలసీలను తీసుకొచ్చింది. ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్ (LIC New Jeevan Amar Plan), ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ (LIC New Tech Term Plan) పేర్లతో పాత పాలసీలను కొన్ని మార్పులతో కొత్తగా లాంఛ్ చేసింది. అయితే ఇప్పటికే పాత ప్లాన్స్ తీసుకున్నవారికి ఇబ్బంది ఏమీ లేవు. వాళ్లు ఆ పాలసీని కొనసాగించవచ్చు. పాత పాలసీలు అందుబాటులో లేవు కాబట్టి ఎవరైనా ఈ పాలసీలు తీసుకోవాలంటే కొత్త వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ కొత్త పాలసీల బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. పాలసీ తీసుకున్న వ్యక్తి, పాలసీ కొనసాగుతున్న సమయంలో అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. పాత పాలసీకి, కొత్త పాలసీకి పెద్దగా మార్పులు ఏమీ లేవు. కానీ ప్రీమియంలో కొన్ని మార్పులు ఉన్నాయి.
UPI Payment Apps: గూగుల్ పే, ఫోన్ పే, ఇతర UPI ట్రాన్సాక్షన్లపై లిమిట్
ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్‌ను 18 నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న వారు ఎవరైనా తీసుకోవచ్చు. మెచ్యూరిటీ వయస్సు 80 ఏళ్ల లోపే ఉంటుంది. కనీస సమ్ అష్యూర్డ్ రూ.25 లక్షలు. గరిష్ట పరిమితి లేదు. పాలసీ టర్మ్ 10 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ ప్రీమియంలో పాలసీ టర్మ్ మొత్తం ప్రీమియం చెల్లించాలి. లిమిటెడ్ ప్రీమియంలో పాలసీ టర్మ్ కన్నా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల ముందు వరకు ప్రీమియం చెల్లించాలి.
SBI Account Balance: వాట్సప్‌లో మీ ఎస్బీఐ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా
ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది కూడా నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్‌లో ఉన్నట్టుగానే బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో కనీస సమ్ అష్యూర్డ్ రూ.25 లక్షలు కాగా గరిష్ట పరిమితి లేదు. పాలసీ టర్మ్, ప్రీమియం చెల్లించే టర్మ్ ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్‌లో ఉన్నట్టుగానే ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurance, LIC, Personal Finance