లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో కొత్త పాలసీని ప్రకటించింది. ఎల్ఐసీ జీవన్ ఆజాద్ (LIC Jeevan Azad) కొత్త ప్లాన్ ప్రారంభించింది. ఇది వ్యక్తిగత, పొదుపు, జీవిత బీమా లాంటి బెనిఫిట్స్ అందించే ప్లాన్. ఈ ప్లాన్‌లో కనీస సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షలు కాగా, గరిష్ట సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు. ఈ లిమిటెడ్ పీరియడ్ పేమెంట్ ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక మద్దతు లభిస్తుంది. ఇది మెచ్యూరిటీ తర్వాత పాలసీహోల్డర్‌కు బెనిఫిట్స్ లభిస్తాయి. పాలసీహోల్డర్ అవసరాన్ని బట్టి లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.
ఎల్ఐసీ జీవన్ ఆజాద్ ప్లాన్ తీసుకోవాలంటే కనీస వయస్సు 90 రోజులు ఉండాలి. గరిష్ట వయస్సు 50 ఏళ్లు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్‌తో ఎల్ఐసీ జీవన్ ఆజాద్ ప్లాన్ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ విషయానికి వస్తే 15 నుంచి 20 ఏళ్ల టర్మ్ ఎంచుకోవచ్చు. ఎంచుకున్న టర్మ్ నుంచి 8 ఏళ్లు తీసేసి, మిగతా సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 20 ఏళ్ల పాలసీ టర్మ్ తీసుకుంటే 12 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం ఏడాదికి, ఆరు నెలలకు, మూడు నెలలకు, నెలకు ఓసారి ప్రీమియం చెల్లించాలి.
LIC Policy: ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకున్నవారికి కొత్త రేట్స్... ఎక్కువ రిటర్న్స్
Managing Directors of LIC of India along with other senior officials at the launch of LIC’s Jeevan Azad - An Individual, Savings, Life Insurance Plan which offers an attractive combination of protection and savings. For more details, Visit https://t.co/AZ6ToCPtyt pic.twitter.com/bromwbFhOc
— LIC India Forever (@LICIndiaForever) January 19, 2023
ఎల్ఐసీ జీవన్ ఆజాద్ ప్లాన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీహోల్డర్ మరణిస్తే నామినీకి డెత్ బెనిఫిట్ లభిస్తుంది. లేదా మెచ్యూరిటీ తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్స్ లభిస్తాయి. ఆరోగ్యకరంగా ఉన్నవారికి ఎలాంటి మెడికల్ ఎగ్జామినేషన్ లేకుండా రూ.3 లక్షల వరకు సమ్ అష్యూర్డ్‌తో ప్లాన్ తీసుకోవచ్చు. మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే రూ.5 లక్షల వరకు సమ్ అష్యూర్డ్‌తో ప్లాన్ తీసుకోవచ్చు.
PAN Card: పాన్ కార్డ్ ఉన్నవారికి లాస్ట్ వార్నింగ్... అప్పటివరకే ఛాన్స్
ఎల్ఐసీ జీవన్ ఆజాద్ ప్లాన్ బ్రోచర్‌లో ఉన్న ఉదాహరణ చూస్తే 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 18 ఏళ్ల పాలసీ టర్మ్ ఎంచుకొని రూ.2 లక్షల బేసిక్ సమ్ అష్యూర్డ్‌తో ఈ పాలసీ తీసుకున్నారనుకుందాం. 10 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. ప్రతీ ఏటా రూ.12,083 ప్రీమియం చెల్లించాలి. 10 ఏళ్లలో చెల్లించే ప్రీమియం రూ.1,20,830 అవుతుంది. 18 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.2,00,000 లభిస్తుంది. ఒకవేళ పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీహోల్డర్ మరణిస్తే నామినీకి రూ.2,00,000 బెనిఫిట్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurance, LIC, Personal Finance