హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC New Plan: రోజుకు రూ.20 లోపు ప్రీమియం... కోటి రూపాయల ఇన్స్యూరెన్స్

LIC New Plan: రోజుకు రూ.20 లోపు ప్రీమియం... కోటి రూపాయల ఇన్స్యూరెన్స్

LIC New Plan: రోజుకు రూ.20 లోపు ప్రీమియం... కోటి రూపాయల ఇన్స్యూరెన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

LIC New Plan: రోజుకు రూ.20 లోపు ప్రీమియం... కోటి రూపాయల ఇన్స్యూరెన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

LIC New Plan | ఎల్ఐసీ ఇటీవల న్యూ టెక్ టర్మ్ ప్లాన్ (LIC New Tech Term Plan) తీసుకొచ్చింది. రోజుకు కేవలం రూ.20 లోపు ప్రీమియంతో కోటి రూపాయల ఇన్స్యూరెన్స్ పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) జీవన్ అమర్, టెక్ టర్మ్ పాలసీలను నిలిపివేసి వాటి స్థానంలో అవే పేర్లతో కొత్తగా రెండు పాలసీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్ (LIC New Jeevan Amar Plan) వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ (LIC New Tech Term Plan) విశేషాలు చూస్తే ఈ రెండు పాలసీల బెనిఫిట్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి. అయితే ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ పాలసీ ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ఈ పాలసీని తీసుకోవచ్చు. ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ పాలసీ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్.

ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ వివరాలివే

ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్‌ను 18 నుంచి 65 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. మెచ్యూరిటీ వయస్సు 80 ఏళ్ల లోపే ఉంటుంది. కనీస సమ్ అష్యూర్డ్ రూ.50 లక్షలు కాగా గరిష్ట పరిమితి లేదు. పాలసీ టర్మ్ 10 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్‌లో ఉన్నట్టుగానే రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ ప్రీమియంలో పాలసీ టర్మ్ మొత్తం ప్రీమియం చెల్లించాలి. లిమిటెడ్ ప్రీమియంలో పాలసీ టర్మ్ కన్నా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల ముందు వరకు ప్రీమియం చెల్లించాలి.

Third Party Insurance: టూవీలర్లకు రూ.538 నుంచి, కార్లకు రూ.2,094 ఇన్సూరెన్స్‌ ప్రీమియం

ఉదాహరణకు 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఆప్షన్ 1 ఎంచుకొని 20 ఏళ్ల పాలసీ టర్మ్‌తో రూ.1 కోటి ఈ పాలసీ తీసుకున్నారనుకుందాం. రెగ్యులర్ ప్రీమియం అయితే ఏడాదికి రూ.7,047 + జీఎస్‌టీ చెల్లించాలి. అంటే రోజుకు ప్రీమియం రూ.20 లోపే. సింగిల్ ప్రీమియం అయితే రూ.75,603 + జీఎస్‌టీ చెల్లిస్తే చాలు. అతనికి 20 ఏళ్ల పాటు రూ.1 కోటి కవరేజీ లభిస్తుంది. పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే వారి కుటుంబానికి బీమా డబ్బులు వస్తాయి.

ఈ పాలసీలో ఆప్షన్ 2 ఎంచుకున్నవారికి సమ్ అష్యూర్డ్ పెరుగుతూ ఉంటుంది. పైన చెప్పిన ఉదాహరణ ప్రకారం లెక్కేస్తే ఏడాదికి రూ.9,345 + జీఎస్‌టీ ప్రీమియం చెల్లించాలి. సింగిల్ ప్రీమియం అయితే రూ.1,02,617 + జీఎస్‌టీ చెల్లించాలి. పాలసీ 5 ఏళ్లు ముగిసిన తర్వాత ప్రతీ ఏటా 10 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. 15వ ప్రీమియం చెల్లించేనాటికి సమ్ అష్యూర్డ్ రెట్టింపు అవుతుంది. అంటే రూ.2 కోట్ల కవరేజీ లభిస్తుంది.

Savings Scheme: తక్కువ పొదుపుతో రూ.13 లక్షల పైనే రిటర్న్స్... స్కీమ్ వివరాలివే

ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్, ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్స్ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు. కాబట్టి మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు. ఈ ప్లాన్స్ తీసుకున్న వ్యక్తి, పాలసీ కొనసాగుతున్న సమయంలో అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఉపయోగపడే పాలసీలు ఇవి.

First published:

Tags: Insurance, LIC, Personal Finance

ఉత్తమ కథలు