• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • LIFE INSURANCE CORPORATION LIC LAUNCHES NEW JEEVAN SHANTI POLICY KNOW PREMIUM BENEFITS AND OTHER DETAILS SS

LIC new plan: ఎల్ఐసీ నుంచి సరికొత్త పాలసీ... ఈ ప్లాన్‌తో ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు

LIC new plan: ఎల్ఐసీ నుంచి సరికొత్త పాలసీ... ఈ ప్లాన్‌తో ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు

LIC new plan: ఎల్ఐసీ నుంచి సరికొత్త పాలసీ... ఈ ప్లాన్‌తో ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు (ప్రతీకాత్మక చిత్రం)

LIC New Jeevan Shanti policy | కొత్తగా లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. ఎల్ఐసీ కొత్తగా లాంఛ్ చేసిన ఈ పాలసీ తీసుకుంటే ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. పాలసీ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC సరికొత్త పాలసీని ప్రవేశపెట్టింది. 'న్యూ జీవన్ శాంతి' పేరుతో డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్‌ను ప్రకటించింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సింగిల్ ప్రీమియం, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఈ పాలసీ ప్రారంభించినప్పుడు నిర్ణయించిన వడ్డీ రేట్లే అమలులో ఉంటాయి. డిఫర్‌మెంట్ పీరియడ్ తర్వాత పాలసీదారుడికి ప్రతీ ఏటా జీవితాంతం యాన్యుటీ చెల్లిస్తారు. ఈ పాలసీని ఆఫ్‌లైన్‌లో అంటే ఏజెంట్ దగ్గర లేదా ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఈ పాలసీని కనీసం రూ.1.5 లక్షలకు తీసుకోవాలి. యాన్యుటీ ప్రతీ ఏటా, ఆరు నెలలకోసారి, మూడు నెలలకోసారి, నెలకోసారి చెల్లిస్తారు. కనీసం ఏడాదికి రూ.12,000 యాన్యుటీ లభిస్తుంది. గరిష్టంగా ఎంతకైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.1,50,000 పాలసీ తీసుకుంటే ఏడాదికి రూ.12,000 యాన్యుటీ వస్తుంది. రూ.5,00,000 కన్నా ఎక్కువకు పాలసీ తీసుకుంటే యాన్యుటీ ఇన్సెంటీవ్ లభిస్తుంది.

    Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే లాభం

    EPF Account Transfer: మీ ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా


    ఇందులో రెండు రకాల యాన్యుటీ ఆప్షన్లు ఉంటాయి. డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్‌లో యాన్యుటీ పేమెంట్స్ పాలసీదారుడికి జీవితాంతం లభిస్తాయి. డిఫర్‌మెంట్ కాలంలో లేదా ఆ తర్వాత వారి మరణానంతరం డెత్ బెనిఫిట్‌ను నామినీకి చెల్లిస్తారు. ఇక డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్‌లో డిఫర్‌మెంట్ పీరియడ్ తర్వాత పాలసీదారుడు కోరుకున్నట్టుగా నెలకు లేదా ఏడాదికి ఓసారి డబ్బులు వస్తాయి. వారి మరణానంతరం ప్రైమరీ, సెకండరీ యాన్యుటెంట్‌ జీవించినంత కాలం యాన్యుటీ వస్తుంది. వారు కూడా మరణించిన తర్వాత డెత్ బెనిఫిట్ నామినీకి ఇస్తారు. జాయింట్ లైఫ్ యాన్యుటీని కుటుంబంలోని వ్యక్తులు అంటే నానమ్మ, అమ్మమ్మ, తాత, తల్లిదండ్రులు, పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు కలిపి తీసుకోవచ్చు.

    PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? తెలుగులో తెలుసుకోండి ఇలా

    e-PAN Card Download: పాన్ కార్డు మర్చిపోయారా? ఇ-పాన్ డౌన్‌లోడ్ చేయడం ఈజీ

    ఈ ప్లాన్‌ను కనీసం 30 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వ్యక్తులు తీసుకోవచ్చు. డిఫర్‌మెంట్ పీరియడ్ 1 ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు ఉంటుంది. గరిష్టంగా 80 ఏళ్ల వరకే డిఫర్‌మెంట్ పీరియడ్ వర్తిస్తుంది. దివ్యాంగులు ఈ ప్లాన్ తీసుకోవాలంటే కనీసం రూ.50,000 చెల్లించాలి. ఈ పాలసీకి లోన్ సదుపాయం కూడా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో పాలసీ సరెండర్ చేసి డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎల్ఐసీ గతంలో తీసుకొచ్చిన జీవన్ శాంతి పాలసీని 6,11,695 మంది తీసుకోవడం విశేషం. ఆ పాలసీలో మార్పులు చేసి న్యూ జీవన్ శాంతి పాలసీని పరిచయం చేసింది. ఎల్ఐసీలో Jeevan Akshay VII పాలసీ కూడా ఇలాగే యాన్యుటీని ఇస్తుంది. వీటితో పాటు SIIP, Nivesh Plus, New Endowment Plus పేర్లతో యూలిప్ పాలసీలు ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు