LIC Micro Bachat: ఎల్ఐసీ నుంచి 'మైక్రో బచత్ ప్లాన్'... వివరాలివే

LIC Micro Bachat | ఈ పాలసీపై ఇన్‍కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎల్ఐసీ యాక్సిడెంటల్ రైడర్ కూడా ఈ పాలసీతో పాటు తీసుకోవచ్చు.

news18-telugu
Updated: February 21, 2019, 7:20 AM IST
LIC Micro Bachat: ఎల్ఐసీ నుంచి 'మైక్రో బచత్ ప్లాన్'... వివరాలివే
LIC Micro Bachat: ఎల్ఐసీ నుంచి 'మైక్రో బచత్ ప్లాన్'... వివరాలివే
  • Share this:
'మైక్రో బచత్' పేరుతో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC). ఇది రెగ్యులర్ ప్రీమియం ప్లాన్. బీమా కవరేజీతో పాటు సేవింగ్స్‌కు ఉపయోగపడుతుంది. ఇందులో కవరేజీ రూ.2 లక్షల వరకు మాత్రమే తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ సమయంలో పాలసీహోల్డర్ దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుందని ఎల్ఐసీ చెబుతోంది.

ఎల్ఐసీ 'మైక్రో బచత్' ప్లాన్ వివరాలు


కనీస బీమా: రూ.50,000

గరిష్ట కవరేజీ: రూ.2,00,000
కనీస వయస్సు: 18 ఏళ్లు పూర్తికావాలి
గరిష్ట వయస్సు: 55 ఏళ్ల లోపు ఉండాలి


పాలసీ గడువు: 10 నుంచి 15 ఏళ్లు
Loading...
మెచ్యూరిటీ నాటికి గరిష్ట వయస్సు: 70 ఏళ్లు

ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్లకు ఎల్ఐసీ 'మైక్రో బచత్' ప్లాన్ తీసుకుంటే ప్రతీ వెయ్యి బీమాకు రూ.51.5 ప్రీమియం చెల్లించాలి. అదే 25 ఏళ్ల వ్యక్తి రూ.51.60, 35 ఏళ్ల వ్యక్తి రూ.52.20 చొప్పున ప్రీమియం చెల్లించాలి. మూడేళ్లు ప్రీమియంలు చెల్లించిన తర్వాత లోన్ తీసుకునే అవకాశం లభిస్తుంది. మీరు చెల్లించిన ప్రీమియంలో 70% లోన్ తీసుకోవచ్చు. వడ్డీ రేటు 10.42 శాతం. ఇక ఈ పాలసీపై ఇన్‍కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎల్ఐసీ యాక్సిడెంటల్ రైడర్ కూడా ఈ పాలసీతో పాటు తీసుకోవచ్చు. 3 ఏళ్లు వరుసగా ప్రీమియం చెల్లించి ఆ తర్వాత ప్రీమియం కట్టకపోతే బీమా ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. అదే ఐదేళ్లు ప్రీమియం చెల్లిస్తే 2 ఏళ్లే ఆటో కవర్ వర్తిస్తుంది.

Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్


ఇవి కూడా చదవండి:

NPCI Contest: క్రియేటీవ్‌గా ట్వీట్ చేస్తే రూ.5 లక్షల బహుమతి

Railway Jobs: 1,30,000 రైల్వే ఉద్యోగాలకు ఆర్ఆర్‌బీ ప్రకటన

SBI Offer: హోమ్‌ లోన్‌పై జీరో ప్రాసెసింగ్ ఫీజ్... ఫిబ్రవరి 28 వరకే అవకాశం
First published: February 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...