జీవిత బీమా పాలసీలు(life insurance policy) దశాబ్దాలుగా భారతీయ కుటుంబాలలో భాగంగా ఉన్నాయి. తమ కుటుంబాల భవిష్యత్తు భద్రతకు భద్రపరచడానికి తరతరాలుగా జీవిత బీమా పాలసీలు మార్గమయ్యాయి. అయితే లైఫ్ ఇన్సూరెన్స్(Life Insurance ) కౌన్సిల్ నిర్వహించిన ఒక సర్వే(Survey) ప్రకారం.. జీవిత బీమా పాలసీ ఆవశ్యకతపై అవగాహన 91 శాతం ఉండగా, దానిని తీసుకొన్న వారి సంఖ్య 60 శాతం తక్కువగా ఉంది. అవగాహన ఉన్న వారికి పాలసీలు తీసుకొన్న వారికి మధ్య వ్యత్యాసానికి కారణం అధిక ప్రీమియం, అధిక పన్ను రేట్లు, సాంకేతికతను తక్కువగా వినియోగించడం వంటివి ఉన్నాయి. 2020లో కరోనా మహమ్మారితో ఇన్సూరెన్స్(Insurance) రంగం పూర్తిగా మారిపోయింది. కొవిడ్(Covid) మహమ్మారితో ప్రజలు తమ ఆర్థిక సంసిద్ధతను పునరాలోచించవలసి వచ్చింది. విచక్షణ లేని వస్తువులపై ఖర్చు తగ్గించబడినప్పటికీ, సంక్షోభం మధ్య కుటుంబ ఆర్థిక భవిష్యత్తు(Finance Future) కోసం ఆదా చేయడం అనేది ఒక కీలకమైన అంశంగా మారింది. ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ అంటే జీవిత బీమా కవరేజీ కలిగి ఉండటం. జీవిత బీమా పాలసీని కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు..
బీమా సంస్థ ట్రాక్ రికార్డ్
బీమా తీసుకొనే ముందు వినియోగదారులు బీమా సంస్థ ట్రాక్ రికార్డును పరిశీలించాలి. కంపెనీ చేసిన క్లెయిమ్‌ల సంఖ్య, అందిస్తున్న సేవలను ఇన్సూరెన్స్ కంపెనీ ట్రాక్ రికార్డ్ సూచిస్తుంది. వివిధ బీమా కంపెనీలు, వాటి పాలసీలను పోల్చి చూసేటప్పుడు బీమా సంస్థ ప్రతిష్ఠ పై సమగ్ర పరిశోధన చేయడం చాలా ముఖ్యం. ప్రతి బీమా కంపెనీకి సంబంధించిన ట్రాక్ రికార్డ్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. క్లెయిమ్‌లు మొదలైన వాటికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా కంపెనీ స్పష్టమైన రికార్డును కలిగి ఉండేలా చూసుకోవడం వినియోగదారుల బాధ్యత.
సంస్థ బలం
లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నిర్వహించిన సర్వే ప్రకారం.. బీమాలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులకు కొన్ని ప్రధాన అడ్డంకులు అవిశ్వాసం, అమ్మకాల కోసం ఉపయోగించే అనైతిక పద్ధతులు. సంస్థ యొక్క ప్రొఫైల్, స్థితికి సంబంధించిన సమాచారం ఆన్లైన్లో వివిధ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ రివ్యూలను చదవడం ద్వారా సమాచారం ఎంపిక చేసుకోవడం, స్నేహితులు, బంధువుల నుంచి అభిప్రాయాన్ని తీసుకోవడం కూడా సహాయపడుతుంది.
కంపెనీ సర్వీస్ క్వాలిటీ
గ్లోబల్ జర్నల్స్ అధ్యయనం ప్రకారం.. సర్వీస్ క్వాలిటీని రెండు రకాలు విభజించారు. టెక్నికల్ క్వాలిటీ, ఫంక్షనల్ క్వాలిటీ. సర్వీస్ క్వాలిటీ.. బీమా కంపెనీ సాంకేతికంగా, క్రియాత్మకంగా ఎలాంటి సేవలు అందిస్తోంది, ఒకరి అవసరాలను ఎలా పరిష్కరిస్తుందో చూస్తుంది. ఆధునిక యుగంలో బీమాను కొనుగోలు చేసే ప్రక్రియ సులువుగా మారింది. బీమా ప్రొవైడర్ ఈ రెండు సేవలు కస్టమర్ నుంచి పొందే సంతృప్తిని నిర్ణయిస్తాయి. సర్వీస్ క్వాలిటీ అనేది క్లెయిమ్ ప్రక్రియలో ముఖ్యమైన దశలను వివరిస్తుంది. వినియోగదారుకు సరైన విధానాన్ని అందించడం, వినియోగదారులకు సహాయం చేయడానికి సాధ్యమైనంత గరిష్ట సమాచారాన్ని అందించడం మొదలైనవి.
బీమా కంపెనీ సాంకేతికతను స్వీకరించిందా?
ఇంతకుముందు బీమా పాలసీలు పేపర్‌పై ఉండటం, వ్యక్తిగతంగా కియోస్క్‌లు, ఏజెంట్లు ముఖాముఖి కూర్చుని వినియోగదారులకు పాలసీని వివరించడం ద్వారా మాత్రమే చెల్లింపులు జరిగేవి. జీవిత బీమా రంగంలో అప్పుడు సాంకేతికత లేదు.ప్రస్తుతం బీమా-టెక్ గొప్ప ప్రజాదరణ పొందింది. పరిశ్రమలో కీలకమైన భాగంగా మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధునిక కొనుగోలుదారులకు చాలా రకాల సేవలు అందిస్తోంది.
వినియోగదారుల దృష్టి
వినియోగదారుడు అవసరాన్ని బట్టి కవరేజీని కోరుకొంటారని, ఆశ కొద్దీ కాదని బీమా కంపెనీ భావిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన, సుదీర్ఘ బీమాదారు-కస్టమర్ సంబంధానికి పునాది కావాలి. అందువల్ల వినియోగదారుడు ఇప్పుడు నిజమైన అవసరాలకు అనుగుణంగా బీమా కంపెనీల వివిధ ఆఫర్లను ఎంచుకోవడం ముఖ్యం. వినియోగదారులు తమ అవసరానికి ఉత్తమంగా సరిపోయే బీమా పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.