LICS NEW CHILDRENS MONEY BACK PLAN DESIGNED FOR YOUR CHILDREN EDUCATIONAL MARRIAGE AND OTHER NEEDS SS
LIC Policy: రోజుకు రూ.206 పొదుపుతో 20 ఏళ్లలో రూ.27 లక్షలు
LIC Policy: రోజుకు రూ.206 పొదుపుతో 20 ఏళ్లలో రూ.27 లక్షలు
LIC New Children's Money Back Plan | మీ అబ్బాయి లేదా అమ్మాయి వయస్సు 12 ఏళ్లయితే పాలసీ 13 ఏళ్లు ఉంటుంది. ఒకవేళ వయస్సు ఐదేళ్లు అయితే పాలసీ గడువు 20 ఏళ్లు ఉంటుంది.
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పిల్లల భవిష్యత్తు కోసం న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ 832 రూపొందించింది. ఈ పాలసీలో రోజుకు రూ.206 చొప్పున పొదుపు చేస్తే 20 ఏళ్లలో రూ.27 లక్షలు తిరిగొస్తాయి. తమ పిల్లల పైచదువులు, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు చేతిలో డబ్బు ఉండాలనుకునేవారికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది. మీ పిల్లల వయస్సు 25 ఏళ్లు వచ్చాక పాలసీ మెచ్యూర్ అవుతుంది. ఉదాహరణకు మీ అబ్బాయి లేదా అమ్మాయి వయస్సు 12 ఏళ్లయితే పాలసీ 13 ఏళ్లు ఉంటుంది. ఒకవేళ వయస్సు ఐదేళ్లు అయితే పాలసీ గడువు 20 ఏళ్లు ఉంటుంది.
ఉదాహరణకు మీ అమ్మాయి లేదా అబ్బాయి వయస్సు ఐదేళ్లు ఉన్నప్పుడు ఈ పాలసీ తీసుకుంటే 20 ఏళ్లు పాలసీ చెల్లించాలి. రూ.1 లక్షకు పాలసీ తీసుకుంటే ఏడాదికి రూ.5586 ప్రీమియం చెల్లించాలి. 13వ ఏట రూ.20,000, 15వ ఏట రూ.20000, 17వ ఏట 20,000 మనీబ్యాక్ వస్తుంది. పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత రూ.98,500 వరకు రావొచ్చు. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ పాలసీలో రూ.206 చొప్పున రూ.15 లక్షల ప్రీమియం చెల్లిస్తే మెచ్యూరిటీతో కలిపి మొత్తం రూ.27 లక్షల వరకు రిటర్న్స్ వస్తాయి.
Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.