• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • LICS JEEVAN SHANTI POLICY INVEST ONCE IN THIS LIC POLICY AND GET RUPEES 74300 EVERY YEAR HERE IS THE COMPLETE DETAILS NK

LIC Special Scheme: ఈ స్కీమ్‌లో చేరండి... ఏడాదికి రూ.74,300 పెన్షన్ పొందండి

LIC Special Scheme: ఈ స్కీమ్‌లో చేరండి... ఏడాదికి రూ.74,300 పెన్షన్ పొందండి

ప్రతీకాత్మక చిత్రం

LIC Special Scheme: ఈ స్కీమ్ ఎలా ఉంటుంది. దీన్ని మనం ఎలా ప్రారంభించుకోవాలి. దీని ద్వారా సంవత్సరానికి రూ.74,300 ఎలా వస్తాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    LIC’s Jeevan Shanti policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రకరకాల పాలసీలు తెచ్చింది. వాటిలో జీవన్ శాంతి పాలసీ ప్రత్యేకమైనది. పేరుకు తగ్గట్టే ఇది జీవితానికి శాంతిని ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పాలసీ ద్వారా... రిస్క్ లేకుండా ఎక్కువ ప్రయోజనాలు పొందే వీలు ఉందంటున్నారు. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. ఇది భవిష్యత్తులో పెన్షన్ రూపంలో ఆర్థిక భద్రత కల్పిస్తుంది. మరి ఇది ఎలా ఉంటుందో పరిశీలిస్తే... సపోజ్ ఓ వ్యక్తి వయసు 45 సంవత్సరాలు అయితే... అతను ఈ పాలసీ తీసుకుంటే... సింగిల్ ప్రీమియం కింద రూ.10,00,000 చెల్లించాలి. ఆ వ్యక్తిక ఏడాదికి రూ.74,300 పెన్షన్ రూపంలో వస్తుంది.

    పెన్షన్ ఎప్పటి నుంచి కావాలో డిసైడ్ చేసుకోవచ్చు. పాలసీ తీసుకున్న మొదటి ఏడాది నుంచే కావాలంటే పొందవచ్చు. లేదా 5, 10, 15, 20 ఏళ్లు ఇలా ఉంటుంది. ఏళ్లు గడిచే కొద్దీ... పెన్షన్ కూడా ఎక్కువగానే వస్తుంది. త్వరగానే పెన్షన్ కావాలనుకుంటే... దానికి తగ్గట్టుగా అది వస్తుంది. ఐతే... ఈ స్కీమ్‌లో కొన్ని కండీషన్లు ఉన్నాయి. ఇది నాన్-లింక్డ్ ప్లాన్. పైగా ఇది సింగిల్ ప్రీమియం యాన్యుటీ ప్లాన్. ఇది తీసుకున్నవారు... వెంటనే యాన్యుటీ ఎంచుకోవచ్చు లేదా మరో యాన్యుటీ తేదీని ఎంచుకోవచ్చు.

    ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్:
    ఇప్పుడు ఎల్‌ఐసీ పాలసీలను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పొందవచ్చు. జీవన్ శాంతి పాలసీ... సమగ్రమైన యాన్యుటీ ప్లాన్. ఇందులో పాలసీ తీసుకున్నవారు, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ప్రయోజనం పొందగలరు.

    Feature of the policy: ఈ పాలసీలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

    చెల్లించిన డబ్బుకి లోన్ పొందవచ్చు. ఏడాది పెన్షన్ ఇచ్చిన తర్వాత లోన్ పొందవచ్చు. దాన్ని మూడు నెలల్లో చెల్లించాలి.
    పెన్షన్ వెంటనే పొందవచ్చు లేదా... 1 నుంచి 20 ఏళ్లలోపు ఎప్పుడైనా కోరవచ్చు.
    జాయింట్ లైఫ్ ఆప్షన్ ద్వారా మీరు మీకు దగ్గరైన బంధువును కూడా ఇందులో చేర్చవచ్చు.

    ఇప్పుడు మీరు రూ.10 లక్షలు పెడితే... 5 ఏళ్ల తర్వాత పెన్షన్ కావాలని అనుకుంటే... 9.18 శాతం రిటర్నుతో వార్షిక పెన్షన్ వస్తుంది.

    Eligibility:
    ఎల్ఐసీ ప్రకారం... ఈ స్కీమ్ పొందేవారి వయసు కనీసం 30 సంవత్సరాలు, గరిష్టంగా 85 సంవత్సరాలు ఉండాలి. మీరు పాలసీ తీసుకునేటప్పుడే... ఏడాది తర్వాత ఎంత పెన్షన్ వస్తుంది... 5 ఏళ్ల తర్వాతైతే ఎంత వస్తుందో ముందో చెబుతారు. ఒకసారి ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మార్చడానికి వీలు ఉండదు.

    ఇది కూడా చదవండి:Healthy Food Spinach Dhokla: పాలకూర దోఖ్లా... తింటే ఎంతో ఆరోగ్యం

    ఈ ప్లాన్... జీవన్ అక్షయ లాంటదేనని LIC తెలిపింది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు