హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Policy: ఎల్ఐసీ కీలక నిర్ణయం.. ఈరోజు నుంచి ఈ 2 పాలసీలు అందుబాటులో ఉండవు!

LIC Policy: ఎల్ఐసీ కీలక నిర్ణయం.. ఈరోజు నుంచి ఈ 2 పాలసీలు అందుబాటులో ఉండవు!

 LIC Policy: ఎల్ఐసీ కీలక నిర్ణయం.. ఈరోజు నుంచి ఈ 2 పాలసీలు అందుబాటులో ఉండవు!

LIC Policy: ఎల్ఐసీ కీలక నిర్ణయం.. ఈరోజు నుంచి ఈ 2 పాలసీలు అందుబాటులో ఉండవు!

LIC Tech Term | ఎల్ఐసీ పాలసీదారులకు ముఖ్యమైన అలర్ట్. కంపెనీ రెండు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌ను విత్‌డ్రా చేసుకుంది. అంటే పాలసీలను ఉపసంహరించుకుంది. ఇకపై ఈ ప్లాన్స్ అందుబాటులో ఉండవు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

LIC Jeevan Amar | దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రెండు పాపులర్ పాలసీలకు మంగళం పాడింది. అంటే ఇకపై ఈ రెండు ఎల్ఐసీ పాలసీలు అందుబాటులో ఉండవని చెప్పుకోవచ్చు. ఎల్ఐసీ టర్మ్ ఇన్సూరెన్స్ (Insurance) ప్లాన్స్‌ను ఉపసంహరించుకుంది. ఇందులో జీవన్ అమర్, టెక్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి. ఇకపై ఈ ప్లాన్స్ అందుబాటులో ఉండవు. ఎల్ఐసీ టెక్ టర్మ్ అనేది ఆన్‌లైన్ పాలసీ. అలాగే ఎల్ఐసీ జీవన్ అమర్ అనేది ఆఫ్‌లైన్ ప్లాన్.

నవంబర్ 23 నుంచి ఈ ప్లాన్స్ అందుబాటులో ఉండవని ఎల్ఐసీ తెలిపింది. టర్మ్ ప్లాన్స్‌ను విత్‌డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్లు ఎల్ఐసీ సర్క్యూలర్‌లో పేర్కొంటోంది. రీఇన్సూరెన్స్ రేట్లు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ జీవన్ అమర్ పాలసీని 2019 ఆగస్ట్ నెలలో, టెక్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను 2019 సెప్టెంబర్ నెలలో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. పాలసీలు మార్కెట్‌లోకి వచ్చిన దగ్గరి నుంచి చూస్తే.. అంటే మూడేళ్ల నుంచి ఈ పాలసీల ప్రీమియం రేట్లు అలానే ఉన్నాయి. ఎలాంటి పెరుగుదల లేదు.

బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు ఆన్‌లైన్‌లో ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి!

అయితే ఇదే కాలంలో ఇతర ప్రైవేట్ కంపెనీలు తీసుకువచ్చిన ప్లాన్స్ రేట్లు అయితే ఏకంగా 40 శాతం వరకు పైకి చేరాయి. కోవిడ్ 19 కారణంగా కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ రేట్లను పెంచేశాయి. అయితే ఎల్ఐసీ మాత్రం పాలసీ ప్రీమియం రేట్లను అలానే కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు కంపెనీ ఈ రెండు పాలసీలను ఉపసంహరించకున్నట్లు ప్రకటించింది.

వారెవ్వా అదిరే ఆఫర్.. కారు కొంటే రూ.30 వేల డిస్కౌంట్! ధర మారుతీ స్విఫ్ట్, టాటా పంచ్ కన్నా తక్కువే!

ఎల్ఐసీ ఈ రెండు ప్లాన్లను మళ్లీ కొద్ది స్వల్ప మార్పులతో మార్కెట్‌లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రెండు పాలసీల ద్వారా పాలసీ దారులు పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. దీర్ఘకాలం పాలసీ కవరేజ్ లభిస్తుంది. 10 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు టెన్యూర్‌తో పాలసీలు పొందొచ్చు.

పాలసీదారుడు మరణిస్తే.. కుటుంబానికి బీమా మొత్తం లభిస్తుంది. దీని వల్ల కుంటుంబానికి ఆర్థిక భద్రత ఉంటుంది. ఎల్ఐసీ జీవన్ అమర్ పాలసీని కనీసం రూ. 25 లక్షల బీమా మొత్తానికి తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఎల్ఐసీ టెక్ టర్మ్ ప్లాన్‌ అయితే రూ. 50 లక్షల కనీస బీమా మొత్తానికి కొనుగోలు చేయాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఇకపోతే ఇప్పటికే ఈ పాలసీలు తీసుకున్న వారికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. పాలసీలు అలానే కొనసాగుతాయి. పాలసీ బెనిఫిట్స్ ఎప్పటిలాగే లభిస్తాయి.

First published:

Tags: Insurance, LIC, Life Insurance, Term insurance

ఉత్తమ కథలు