LIC Policy: మీ జీతంలో కొంత పొదుపు చేయండి... మెచ్యూరిటీ తర్వాత రూ.70 లక్షలు మీవే

LIC Policy: మీ జీతంలో కొంత పొదుపు చేయండి... మెచ్యూరిటీ తర్వాత రూ.70 లక్షలు మీవే (ప్రతీకాత్మక చిత్రం)

LIC SIIP Plan | ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ తరహాలో ఓ పాలసీ అందిస్తోంది. ఈ పాలసీతో ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకోండి.

  • Share this:
    మీ జీతంలో కొంత మొత్తం భవిష్యత్తు కోసం దాచుకోవాలని అనుకుంటున్నారా? ప్రతీ నెలా కాస్త పొదుపు చేయాలని అనుకుంటున్నారా? మార్కెట్‌లో అనేక స్కీమ్స్ ఉన్నాయి. ఎక్కువ రిటర్న్స్ కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇటీవల కంపెనీలు ఇలాంటి పెట్టుబడులకు ఇన్స్యూరెన్స్ కూడా అందిస్తున్నాయి. అంటే మ్యూచువల్ పండ్స్‌లో ప్రతీ నెలా డబ్బులు జమ చేయడం ద్వారా పెట్టుబడితో పాటు బీమా కూడా లభిస్తోంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC కూడా SIIP ప్లాన్ అందిస్తోంది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, రెగ్యులర్ ప్రీమియం, ఇండివిజ్యువల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. ఈ ప్లాన్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు.

    ఎల్ఐసీ ఎస్ఎస్ఐపీ ప్లాన్‌లో చెల్లించే ప్రీమియం ఈక్విటీ, మనీ మార్కెట్, బాండ్ మార్కెట్‌లోకి వెళ్తుంది. మొత్తం నాలుగు రకాల ఫండ్స్ ఆఫర్ చేస్తోంది ఎల్ఐసీ. కస్టమర్లు తమకు నచ్చిన బాండ్ ఎంచుకోవచ్చు. బాండ్ ఫండ్ ఎంచుకుంటే 60 శాతం గవర్నమెంట్ బాండ్స్‌లో, 40 శాతం మనీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సెక్యూర్డ్ ఫండ్ ఎంచుకుంటే 45 శాతం గవర్నమెంట్ బాండ్స్‌లో, 40 శాతం మనీ మార్కెట్‌లో, 15 శాతం ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. బ్యాలెన్స్‌డ్ ఫండ్ ఎంచుకుంటే 30 శాతం గవర్నమెంట్ బాండ్స్‌లో, 40 శాతం మనీ మార్కెట్‌లో, 30 శాతం ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. గ్రోత్ ఫండ్ ఎంచుకుంటే 20 శాతం గవర్నమెంట్ బాండ్స్‌లో, 40 శాతం మనీ మార్కెట్‌లో, 40 శాతం ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.

    SBI Alert: కస్టమర్లకు అలర్ట్... రెండు గంటలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో సేవలు బంద్

    SBI Alert: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? జూన్ 30 లోగా ఈ పనిచేయండి

    ఎల్ఐసీ ఎస్ఎస్ఐపీ ప్లాన్ తీసుకోవడానికి కనీస వయస్సు 90 రోజులు, గరిష్ట వయస్సు 65 ఏళ్లు. మెచ్యూరిటీకి కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 85 ఏళ్లు. పాలసీ టర్మ్ 10 ఏళ్ల నుంచి 25 ఏళ్లు ఉంటుంది. నెలకు కనీసం రూ.4,000 లేదా ఏడాదికి రూ.40,000 చొప్పున పొదుపు చేయొచ్చు. మీరు చెల్లించే ప్రీమియంను బట్టి సమ్ అష్యూర్డ్ ఉంటుంది. 55 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారికి వార్షిక ప్రీమియంకు 10 రెట్లు సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. 55 ఏళ్ల వయస్సు దాటితే సమ్ అష్యూర్డ్ 7 రెట్లు ఉంటుంది. పాలసీ తీసుకున్న 5వ ఏడాది నుంచి ఎప్పుడైనా పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

    7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్... డీఏ చెల్లింపులపై డిసైడ్ చేసేది ఆరోజే

    Bank Charges: మీ బ్యాంక్ అకౌంట్‌లో ఇన్ని ఛార్జీలు ఉంటాయని తెలుసా?

    ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 25 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకున్నాడని అనుకుందాం. నెలకు రూ.10,000 ప్రీమియం ఎంచుకుంటే ఏడాదికి రూ.1,20,000 ప్రీమియం చెల్లించాలి. వార్షిక ప్రీమియంకు 10 రెట్లు కవరేజీ ఉంటుంది. అంటే రూ.12,00,000 సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. ఆ వ్యక్తి బాండ్ ఫండ్ ఎంచుకుంటే రిటర్న్స్ కనీసం 4 శాతం నుంచి 8 శాతం మధ్య ఉంటాయి. 4 శాతం రిటర్న్స్ లెక్క ప్రకారం మెచ్యూరిటీ సమయంలో రూ.40,04,293 + గ్యారెంటీడ్ అడిషన్స్ లభిస్తాయి. 8 శాతం రిటర్న్స్ లెక్క ప్రకారం మెచ్యూరిటీ సమయంలో రూ.69,17,669 + గ్యారెంటీడ్ అడిషన్స్ లభిస్తాయి. అంటే సుమారు రూ.70,00,000 వరకు రిటర్న్స్ పొందొచ్చు. ఒకవేళ రిస్క్ ఎక్కువ ఉన్న బాండ్స్ ఎంచుకుంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి.
    Published by:Santhosh Kumar S
    First published: