హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Policy: ఒక్కసారి ప్రీమియం కడితే రూ.12,000 పెన్షన్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే

LIC Policy: ఒక్కసారి ప్రీమియం కడితే రూ.12,000 పెన్షన్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

LIC Policy | ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే ప్రతీ ఏడాది ప్రీమియం చెల్లించాలి. అయితే ఒకేసారి ప్రీమియం చెల్లించి బెనిఫిట్స్ పొందే పాలసీలు కొన్నే ఉంటాయి. అలాంటివాటిలో ఎల్ఐసీ సరళ్ పెన్షన్ (LIC Saral Pension) పాలసీ ఒకటి. ఈ పాలసీలో ఒకసారి డబ్బులు కట్టి ప్రతీ నెలా పెన్షన్ పొందొచ్చు.

ఇంకా చదవండి ...

మీరు ఏదైనా పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా? లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సరళ్ పెన్షన్ పేరుతో ఓ పాలసీని అందిస్తోంది. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ (LIC Saral Pension) పాలసీ ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు. ప్రతీ నెలా పెన్షన్ పొందొచ్చు. ప్రీమియం చెల్లించిన వెంటనే పెన్షన్ అమలులోకి వస్తుంది. పాలసీహోల్డర్లకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా ఆప్షన్ ఎంచుకోవచ్చు. నెలవారీ ఖర్చుల కోసం పెన్షన్ పొందాలనుకునేవారికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది. అసలు ఎల్ఐసీ సరళ్ పెన్షన్ పాలసీ ఎవరు తీసుకోవచ్చు? రూల్స్ ఏంటీ? ప్రీమియం ఎంత చెల్లించాలి? ఈ వివరాలు తెలుసుకోండి.

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ వివరాలివే...

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ పాలసీలో తీసుకునేవారి కనీస వయస్సు 40 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 80 ఏళ్లు. నెలకు పెన్షన్ ఎంత పొందాలి అన్నదానిపై చెల్లించాల్సిన ప్రీమియం నిర్ణయిస్తారు. కనీసం నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 పెన్షన్ పొందొచ్చు. పెన్షన్ ఎన్ని రోజులకు ఓసారి కావాలి అన్నది పాలసీహోల్డర్ నిర్ణయించుకోవచ్చు. నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి పెన్షన్ పొందొచ్చు.

LIC Policy: ఎల్ఐసీ నుంచి మీకు పాలసీ డబ్బులు రావాల్సి ఉందా? ఇలా చెక్ చేయండి

లైఫ్ యాన్యుటీ ఆప్షన్ ఎంచుకుంటే జీవితాంతం యాన్యుటీ అంటే పెన్షన్ లభిస్తుంది. పాలసీహోల్డర్ మరణిస్తే చెల్లించిన ప్రీమియం నామినీకి లభిస్తుంది. ఇక జాయింట్ లైఫ్ యాన్యుటీ ఎంచుకుంటే ప్రైమరీ పాలసీహోల్డర్ మరణించిన తర్వాత పెన్షన్ వారి జీవిత భాగస్వామికి లభిస్తుంది. ఇద్దరూ మరణించిన తర్వాత ప్రీమియం చెల్లించిన ప్రీమియం నామినీకి లభిస్తుంది.

ఉదాహరణకు 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏడాదికి ఓసారి యాన్యుటీ కోసం రూ.10,00,000 సింగిల్ ప్రీమియం చెల్లించి ఈ పాలసీ తీసుకున్నారనుకుందాం. వారికి ఏటా రూ.56,450 యాన్యుటీ జీవితాంతం లభిస్తుంది. వారు మరణించిన తర్వాత రూ.10,00,000 నామినీకి వస్తాయి. ఇక 55 ఏళ్ల వయస్సు ఉన్న జీవిత భాగస్వామిని చేరుస్తూ ముందే జాయింట్ యాన్యుటీ ఆప్షన్ ఎంచుకున్నారంటే పాలసీహోల్డర్ మరణించిన తర్వాత వారి జీవిత భాగస్వామికి ఏటా రూ.55,950 చొప్పున యాన్యుటీ లభిస్తుంది.

Paytm: వ్యాపారం కోసం పేటీఎం యాప్‌లో రూ.5 లక్షల లోన్... అప్లై చేయండిలా

అయితే పాలసీహోల్డర్, వారి జీవిత భాగస్వామి, లేదా పిల్లలు అనారోగ్యానికి గురైనట్టైతే ఈ పాలసీలో చేరిన ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా పాలసీ సరెండర్ చేయొచ్చు. లోన్ సదుపాయం కూడా ఉంది. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఫ్రీ లుక్ పీరియడ్ కూడా ఉంది. అంటే పాలసీ తీసుకున్న తర్వాత నచ్చకపోతే 15 రోజుల్లో వెనక్కి ఇచ్చి ప్రీమియం డబ్బులు తీసుకోవచ్చు. ఈ పాలసీ ఆన్‌లైన్‌లో తీసుకుంటే 30 రోజుల్లో వెనక్కి ఇచ్చేయొచ్చు.

First published:

Tags: Investments, LIC, Pension Scheme, Personal Finance

ఉత్తమ కథలు