హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Pension Policy: 60 ఏళ్లకు కాదు... ఈ పాలసీతో 40 ఏళ్ల నుంచే పెన్షన్ తీసుకోవచ్చు

LIC Pension Policy: 60 ఏళ్లకు కాదు... ఈ పాలసీతో 40 ఏళ్ల నుంచే పెన్షన్ తీసుకోవచ్చు

LIC Pension Policy: 60 ఏళ్లకు కాదు... ఈ పాలసీతో 40 ఏళ్ల నుంచే పెన్షన్ తీసుకోవచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

LIC Pension Policy: 60 ఏళ్లకు కాదు... ఈ పాలసీతో 40 ఏళ్ల నుంచే పెన్షన్ తీసుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

LIC Pension Policy | మంచి పెన్షన్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నవారి కోసం ఎల్ఐసీ ఓ పెన్షన్ పాలసీని అందిస్తోంది. ఈ పాలసీ తీసుకుంటే 40 ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ పొందొచ్చు.

మీరు ఏదైనా పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా? మీ దగ్గరున్న డబ్బు పొదుపు చేసి భవిష్యత్తులో పెన్షన్ పొందాలనుకుంటున్నారా? మార్కెట్లో అనేక పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి. చాలావరకు పెన్షన్ స్కీమ్స్ 58 ఏళ్లు లేదా 60 ఏళ్ల నుంచి మొదలవుతాయి. కానీ... లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ఇటీవల తీసుకొచ్చిన ఓ పెన్షన్ పాలసీ తీసుకుంటే మీరు 40 ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ పొందొచ్చు. ఆ పాలసీ పేరు ఎల్ఐసీ సరళ్ పెన్షన్. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, సింగిల్ ప్రీమియం ప్లాన్. ఈ పాలసీ తీసుకున్న వెంటనే ప్రతీ నెలా పెన్షన్ వస్తుంది. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI గైడ్‌లైన్స్ ప్రకారం ఎల్ఐసీ ఈ పాలసీ రూపొందించింది.

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ పాలసీలో రెండు యాన్యుటీ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1 ఎంచుకుంటే యాన్యుటెంట్ జీవించి ఉన్నంతకాలం పెన్షన్ వస్తుంది. యాన్యుటెంట్ మరణించిన తర్వాత పెన్షన్ ఆగిపోతుంది. పాలసీ కొనడానికి చెల్లించిన డబ్బులు 100 శాతం నామినీకి వస్తాయి. ఇక ఆప్షన్ 2 ఎంచుకుంటే యాన్యుటెంట్, వారి జీవితభాగస్వామి బతికి ఉన్నన్ని రోజులు పెన్షన్ వస్తుంది. ఇద్దరూ మరణించిన తర్వాత పాలసీ డబ్బులు మొత్తం నామినీకి వస్తాయి. ఒకసారి యాన్యుటీ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత పాలసీ కొనసాగుతున్న సమయంలో మార్పులు చేసుకోవచ్చు.

Ola e-Scooter: రూ.499 ధరకే ఓలా స్కూటర్ రిజర్వేషన్... బుకింగ్ చేయండి ఇలా

LIC Policy: రోజూ రూ.29 పొదుపు చేసి రూ.4,00,000 సొంతం చేసుకోండి... మహిళలకు మాత్రమే

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 40 ఏళ్లు పూర్తి కావాలి. గరిష్ట వయస్సు 80 ఏళ్లు పూర్తి కావాలి. కనీసం నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 పెన్షన్ పొందొచ్చు. పెన్షన్ ఎప్పుడు కావాలో పాలసీహోల్డర్ నిర్ణయించుకోవచ్చు. అయితే పెన్షన్ ఎంత కావాలన్నది పాలసీ తీసుకున్నప్పుడు చెల్లించిన మొత్తంపై ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా ఎంతకైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఉదాహరణకు 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.10,00,000 చెల్లించి ఈ పాలసీ తీసుకుంటే ఏడాదికి రూ.51,650 చొప్పున పెన్షన్ వస్తుంది.

SBI Important Notice: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... రెండున్నర గంటలు అన్ని బ్యాంకింగ్ సేవలు బంద్

IFSC Codes: ఖాతాదారులకు అలర్ట్... ఈ బ్యాంకుల ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ మారాయి

పాలసీ తీసుకున్న ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా సరెండర్ చేయొచ్చు. యాన్యుటెంట్ లేదా వారి జీవిత భాగస్వామి లేదా వారి పిల్లల్లో ఎవరైనా పాలసీలో సూచించిన అనారోగ్య సమస్యల బారినపడితే ఈ పాలసీ సరెండర్ చేయొచ్చు. పాలసీ సరెండర్‌కు అప్రూవల్ లభిస్తే 95 శాతం డబ్బులు వెనక్కి వస్తాయి. పాలసీ తీసుకున్న ఆరు నెలల తర్వాత లోన్ కూడా తీసుకోవచ్చు.

First published:

Tags: LIC, Pension Scheme, Pensioners, Personal Finance

ఉత్తమ కథలు