హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Pension Plan: సింగిల్ ప్రీమియం... ఏటా రూ.50,000 పెన్షన్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే

LIC Pension Plan: సింగిల్ ప్రీమియం... ఏటా రూ.50,000 పెన్షన్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే

LIC Pension Plan: సింగిల్ ప్రీమియం... ఏటా రూ.50,000 పెన్షన్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

LIC Pension Plan: సింగిల్ ప్రీమియం... ఏటా రూ.50,000 పెన్షన్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

LIC Pension Plan | ఎల్ఐసీ వేర్వేరు వర్గాలకు ప్రత్యేకంగా పాలసీలను అందిస్తోంది. 40 ఏళ్ల నుంచే పెన్షన్ పొందేందుకు ఓ పెన్షన్ పాలసీ (Pension Policy) ఉంది. ఒకసారి ప్రీమియం చెల్లించి పెన్షన్ పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ప్రజల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకోవాలని, వృద్ధాప్యంలో పెన్షన్ కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయాలన్న ఆలోచన పెరుగుతోంది. అలాంటి వారికి ప్రభుత్వ రంగ దిగ్గజ ఇన్స్యూరెన్స్ సంస్థ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అనేక పాలసీలను అందిస్తోంది. ప్రత్యేకంగా పెన్షన్ ప్లాన్స్ (Pension Plans) కూడా ఉన్నాయి. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ (LIC Saral Pension Plan) పేరుతో ఓ పెన్షన్ పాలసీ ఉంది. ఈ పాలసీలో ఒకేసారి డబ్బులు చెల్లించాలి. ఏడాదికి రూ.50,000 పైనే పెన్షన్ లభిస్తుంది. 40 ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ తీసుకోవచ్చు. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ వివరాలివే

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ సింగిల్ ప్రీమియం పాలసీ. 40 ఏళ్ల నుంచి 80 ఏళ్లలోపు వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న ఏడాది నుంచే యాన్యుటీ అంటే పెన్షన్ లభిస్తుంది. యాన్యుటీ కనీసం నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 పొందొచ్చు. ఎంత యాన్యుటీ కావాలన్నదానిపై ఎంత ప్రీమియం చెల్లించాలన్నది ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా ఎంతైనా ప్రీమియం చెల్లించవచ్చు. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్‌ను ఆఫ్‌లైన్‌లో అంటే ఎల్ఐసీ ఏజెంట్ల దగ్గర లేదా ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో తీసుకోవచ్చు.

IRCTC Food Delivery: పండక్కి ఊరెళ్తున్నారా? రైలులో ఫుడ్ కోసం వాట్సప్‌లో ఆర్డర్ చేయండిలా

ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. మొదటి ఆప్షన్ ఎంచుకుంటే పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నన్ని రోజులు యాన్యుటీ వస్తుంది. వారు మరణించిన తర్వాత నామినీకి మొత్తం డబ్బులు వస్తాయి. రెండో ఆప్షన్‌లో పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నన్ని రోజులు యాన్యుటీ వస్తుంది. వారు మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి యాన్యుటీ వస్తుంది. జీవిత భాగస్వామి కూడా మరణించిన తర్వాత నామినీకి డబ్బులు వస్తాయి. రెండో ఆప్షన్‌నే జాయింట్ యాన్యుటీ ఆప్షన్ అని కూడా అంటారు.

Aadhaar Card: ఈ 5 టిప్స్‌తో ఆధార్ మోసాలకు చెక్... గుర్తుంచుకోండి

ఉదాహరణకు 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.10 లక్షల ప్రీమియం చెల్లించి ఏడాదికోసారి యాన్యుటీ తీసుకున్నారనుకుందాం. ఆపన్ష్ 1 ఎంచుకుంటే ఏడాదికి రూ.58,950 యాన్యుటీ వస్తుంది. జాయింట్ యాన్యుటీ ఆప్షన్ ఎంచుకుంటే పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నన్ని రోజులు ఏడాదికి రూ.58,250 చొప్పున యాన్యుటీ లభిస్తుంది. వారు మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి కూడా ఏడాదికి రూ.58,250 యాన్యుటీ లభిస్తుంది. వారు కూడా మరణించిన తర్వాత నామినీకి రూ.10 లక్షలు వెనక్కి వస్తాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Pension Scheme, Pensioners, Pensions, Personal Finance

ఉత్తమ కథలు