హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Policy: ఆ ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అదిరిపోయే వార్త... మరింత లాభం

LIC Policy: ఆ ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అదిరిపోయే వార్త... మరింత లాభం

LIC Policy: ఆ ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అదిరిపోయే వార్త... మరింత లాభం
(ప్రతీకాత్మక చిత్రం)

LIC Policy: ఆ ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అదిరిపోయే వార్త... మరింత లాభం (ప్రతీకాత్మక చిత్రం)

LIC Policy | లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఓ ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. మరిన్ని బెనిఫిట్స్ ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ జీవన్ శాంతి పాలసీ (ప్లాన్ నెంబర్ 858) తీసుకున్నవారికి యాన్యుటీ రేట్స్‌ని రివైజ్ చేసింది. కొత్త రేట్లు జనవరి 5 నుంచి అమలులోకి వచ్చాయి. న్యూ జీవన్ శాంతి ప్లాన్ (New Jeevan Shanti Plan) అధిక మొత్తంతో తీసుకునేవారికి ఇన్సెంటీవ్ కూడా పెంచింది ఎల్ఐసీ. పాలసీదారులు రూ.1000 కొనుగోలు ధరకు రూ.3 నుంచి రూ.9.75 వరకు ఇన్సెంటీవ్స్ పొందవచ్చు. అయితే ఎంత మొత్తంలో పాలసీ తీసుకున్నారు, ఎంత కాల వ్యవధితో తీసుకున్నారు అనేదానిపై ఇన్సెంటీవ్స్ ఆధారపడి ఉంటాయన్న విషయం పాలసీహోల్డర్స్ గుర్తుంచుకోవాలి.

ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీ విశేషాలివే

ఎల్ఐసీ అందిస్తున్న యాన్యుటీ ప్లాన్స్‌లో న్యూ జీవన్ శాంతి పాలసీ ఒకటి. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సింగిల్ ప్రీమియం, డిఫర్డ్ యాన్యుటీ పాలసీ. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ కాబట్టి ప్రతీ ఏటా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ప్రీమియం చెల్లించి, ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి.

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ రైలు... రూట్, ముహూర్తం ఫిక్స్

రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో డబ్బులు వచ్చినవాళ్లు, ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నవారు, ప్రతీ నెల కొంత ఆదాయం కోరుకునేవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 30 ఏళ్లు. గరిష్ట వయస్సు 79 ఏళ్లు. కనీస ప్రీమియం రూ.1,50,000. గరిష్ట ప్రీమియం పరిమితి లేదు. డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్, డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.

డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్ ఎంచుకుంటే యాన్యుటీ అంటే ప్రతీ ఏటా డబ్బులు జీవితాంతం లభిస్తాయి. మరణించిన తర్వాత పాలసీ డబ్బులు నామినీకి వస్తాయి. డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ ఎంచుకుంటే పాలసీ తీసుకున్న వ్యక్తి బతికి ఉన్నంత వరకు ప్రతీ ఏటా డబ్బులు వస్తాయి. పాలసీదారుడు మరణిస్తే ప్రైమరీ లేదా సెకండరీ యాన్యుటెంట్‌కు జీవితాంతం డబ్బులు వస్తాయి. ఇద్దరూ మరణించిన తర్వాత పాలసీ డబ్బులు నామినీకి వస్తాయి. వడ్డీ రేట్లపై యాన్యుటీ ఎంత వస్తుందన్నది ఆధారపడి ఉంటుంది.

Wedding Loan: పెళ్లి చేసుకుంటున్నారా? అయితే వెడ్డింగ్ లోన్ తీసుకోవచ్చు

ఉదాహరణకు 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.10,00,000 సింగిల్ ప్రీమియం చెల్లించి, డిఫర్‌మెంట్ పీరియడ్ 12 ఏళ్లు ఎంచుకున్నారనుకుందాం. సెకండరీ యాన్యుటెంట్ వయస్సు 35 ఏళ్లు. అతను డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్ పాలసీ ఎంచుకున్నట్టైతే ఏడాదికి రూ.1,39,900, ఆరు నెలలకు రూ.68,551, మూడు నెలలకు రూ.33,926, నెలకు రూ.11,192 చొప్పున వస్తాయి. డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ ఎంచుకుంటే ఏడాదికి రూ.132,200, ఆరు నెలలకు రూ.64,778, మూడు నెలలకు రూ.32,059, నెలకు రూ.10,576 వస్తాయి.

First published:

Tags: Insurance, LIC, Personal Finance

ఉత్తమ కథలు