LIC: ఆందోళన చెందకండి.. మీ సొమ్ము భద్రమే.. వదంతులపై ఎల్ఐసీ క్లారిటీ

ఎల్‌ఐసీ ఆర్థిక పరిస్థితి గురించి తప్పుడుగా ప్రచారం జరుగుతోందని ఆ సంస్థ తెలిపింది. పాలసీదారుల సొమ్ము భద్రంగా ఉందని, ఎవరూ.. ఎలాంటి.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 10, 2019, 8:31 AM IST
LIC: ఆందోళన చెందకండి.. మీ సొమ్ము భద్రమే.. వదంతులపై ఎల్ఐసీ క్లారిటీ
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఆర్థికంగా బలహీనపడిందని, నష్టాల్లో ఉన్న కంపెనీలో కేంద్రం పెట్టుబడులు పెట్టించడం వల్ల ఆ సంస్థ పరిస్థితి దారుణంగా తయారైందని గత కొన్ని రోజులుగా వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఎల్‌ఐసీ ఖండించింది. అవి తప్పుడు వార్తలని, ఎల్‌ఐసీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న వార్తలో వాస్తవం లేదని తెలిపింది. ఎల్‌ఐసీ బ్రాండ్‌ ఇమేజ్‌, వాల్యూ దిగజార్చి పాలసీదారుల్లో ఆందోళన రేకెత్తించాలన్న ఉద్దేశంతో ఈ ప్రచారం జరుగుతున్నట్టు వెల్లడించింది. ఎల్‌ఐసీ ఆర్థిక పరిస్థితి గురించి తప్పుడుగా ప్రచారం జరుగుతోందని స్పష్టం చేసింది. పాలసీదారుల సొమ్ము భద్రంగా ఉందని, ఎవరూ.. ఎలాంటి.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని తేల్చి చెప్పింది. సంస్థపై వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని సూచించింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో పాలసీదారులకు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రూ.50వేల కోట్లకు పైగా బోనస్‌ ప్రకటించామని, దీన్ని బట్టే సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని తెలిపింది. 2019 ఆగస్టు 31 నాటికి ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా పాలసీల పరంగా 72.84 శాతంగా, తొలి సంవత్సరం ప్రీమియం పరంగా చూస్తే 73.06 శాతంగా ఉందని వివరించింది. ఈ ఏడాది మార్చి చివరికి తొలి ఏడాది ప్రీమియం పరంగా మార్కెట్‌ వాటా 66.24 శాతం ఉండగా.. ఆగస్టు 31 నాటికి 73.06 శాతానికి పెరిగిందని గుర్తు చేసింది.

ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు దీటుగా ఎల్‌ఐసీ దూసుకుపోతుందని తెలిపింది. ఏడాది ముందు ప్రైవేటు కంపెనీల మార్కెట్ షేర్ 30.28 శాతంగా ఉండగా, అది 26.94 శాతానికి తగ్గిందని.. అదే సమయంలో ఎల్‌ఐసీ మార్కెట్ షేర్ పెరిగిందని స్పష్టం చేసింది.

First published: October 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading