HOME »NEWS »BUSINESS »lic pradhan mantri vaya vandana yojana offers various benefits for senior citizens know plan details ss gh

LIC Pradhan Mantri Vaya Vandana Yojana: ఈ ఎల్ఐసీ పాలసీతో ప్రయోజనాలు ఎన్నో... తెలుసుకోండి

LIC Pradhan Mantri Vaya Vandana Yojana: ఈ ఎల్ఐసీ పాలసీతో ప్రయోజనాలు ఎన్నో... తెలుసుకోండి
LIC Pradhan Mantri Vaya Vandana Yojana: ఈ ఎల్ఐసీ పాలసీతో ప్రయోజనాలు ఎన్నో... తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

LIC Pradhan Mantri Vaya Vandana Yojana | మీరు మంచి పెన్షన్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఎల్ఐసీలో మంచి పాలసీ ఒకటి ఉంది. ఈ ప్లాన్ తీసుకుంటే వచ్చే లాభాలేంటో తెలుసుకోండి.

  • Share this:
మన దేశంలో ఇన్సూరెన్స్ పథకాలను సామాన్యులకు చేరువ చేయడానికి లైఫ్‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-LIC ఎంతో కృషి చేసింది. ఎండోమెంట్ ప్లాన్స్, మనీ బ్యాక్ ప్లాన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ వంటి ఇన్సూరెన్స్ ప్లాన్లు ఎల్‌ఐసీ నుంచి వచ్చాయి. మార్కెట్లో ఎదురవుతున్న పోటీని తట్టుకోవడంతోపాటు ఎక్కువమందికి చేరువ కావాలనే ఉద్దేశంతో ఇటీవల ‘ప్రధాన్ మంత్రి వయా వందన యోజన’ (PMVVY) పెన్షన్ ప్లాన్‌ను కూడా LIC అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా PMVVY పెన్షన్ రేటును ప్రభుత్వం సవరించింది. ఈ పెన్షన్‌ పథకాన్ని 2023 మార్చి 31 వరకు కొనుగోలుకు అందుబాటులో ఉంచారు. ఈ పాలసీపై అందించే పెన్షన్‌ రేటును ప్రతి సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ఆర్థిక శాఖ సమీక్షిస్తుంది. ప్రస్తుతం 2021 మార్చి 31 వరకు ఉండే మొదటి ఆర్థిక సంవత్సరానికి 7.40 శాతం వడ్డీని ఎల్‌ఐసీ అందిస్తోంది.

2021 Bank Holidays List: 2021 లో బ్యాంకులకు 100 సెలవులు... ఎప్పుడెప్పుడో తెలుసుకోండి



Telangana Holidays 2021: తెలంగాణలో 2021 హాలిడేస్ లిస్ట్ ఇదే... సెలవులు ఎప్పుడంటే

PMVVY ప్రయోజనాలు


ఈ పథకంలో చేరిన వ్యక్తులకు 60 సంవత్సరాలు నిండినప్పటి నుంచి పెన్షన్ వస్తుంది. ఒకేసారి పాలసీ ప్రీమియం మొత్తాన్ని చెల్లించి కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ పెన్షన్ ప్లాన్ పాలసీ టర్మ్ పది సంవత్సరాలుగా ఉంది. ప్రతి నెలా లేదా మూడు, ఆరునెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. అవసరాలను బట్టి పెన్షన్ పేమెంట్ ఆప్షన్‌ను కొనుగోలుదారులు ఎంచుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని బట్టి ప్రతినెలా కనీసం రూ.1,000 పెన్షన్ పొందవచ్చు.

Gold: మీరు కొన్న బంగారం నకిలీదని డౌట్ ఉందా? ఈ యాప్ మీకోసమే

ATM: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలు ఇవే

ఆ సదుపాయాలు కూడా


ఈ పాలసీ తీసుకున్నవారికి పెన్షన్‌తో పాటు ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. ఒకవేళ ఏదైనా కారణంతో పాలసీదారుడు చనిపోతే.. ప్లాన్ కొనుగోలు ధరను వారి నామినీకి లేదా వారసులకు తిరిగి చెల్లిస్తారు. ప్రధాన్ మంత్రి వయా వందన యోజన పథకాన్ని ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండా కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు లేదా వారి జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యాల బారిన పడితే, పాలసీ నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సరెండర్ విలువను వారికి చెల్లిస్తారు. ప్రస్తుతం సరెండర్ వ్యాల్యూ పాలసీ కొనుగోలు ధరలో 98 శాతంగా ఉంది. పాలసీలో మూడేళ్లు కొనసాగిన తరువాత వినియోగదారులు లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. పాలసీ కొనుగోలు ధరపై 75 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:December 30, 2020, 12:33 IST