హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Policy: జస్ట్ నెలకు రూ.2,000 పొదుపు చేస్తే చాలు... రూ.48 లక్షల రిటర్న్స్

LIC Policy: జస్ట్ నెలకు రూ.2,000 పొదుపు చేస్తే చాలు... రూ.48 లక్షల రిటర్న్స్

LIC Policy: జస్ట్ నెలకు రూ.2,000 పొదుపు చేస్తే చాలు... రూ.48 లక్షల రిటర్న్స్
(ప్రతీకాత్మక చిత్రం)

LIC Policy: జస్ట్ నెలకు రూ.2,000 పొదుపు చేస్తే చాలు... రూ.48 లక్షల రిటర్న్స్ (ప్రతీకాత్మక చిత్రం)

LIC Plan | ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకునేవారికి అలర్ట్. ఓ ఎల్ఐసీ పాలసీతో (LIC Policy) సుమారు అరకోటి వరకు రిటర్న్స్ పొందొచ్చు ఇందుకోసం నెలకు రూ.2,000 పొదుపు చేస్తే చాలు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

జీతం రాగానే కొంత డబ్బు పొదుపు చేయాలనుకుంటున్నారా? ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? లైఫ్ ఇన్స్యూరెన్స్ ఆఫ్ ఇండియా (LIC) అందిస్తున్న ఓ స్కీమ్‌లో పొదుపు చేయడం ద్వారా సుమారు అరకోటి రూపాయల రిటర్న్స్ పొందొచ్చు. నెలకు కేవలం రూ.2,000 చొప్పున పొదుపు చేస్తే చాలు. ఎల్ఐసీ సేవింగ్స్‌తో పాటు రక్షణ కోసం న్యూ ఎండోమెంట్ పాలసీ (LIC New Endowment Policy) పేరుతో ఈ ప్లాన్ అందిస్తోంది. ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, లైఫ్ అష్యూరెన్స్ ప్లాన్. డబ్బు పొదుపు చేయడంతో పాటు రక్షణ కూడా పొందొచ్చని చెబుతోంది ఎల్ఐసీ. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ పొందొచ్చు. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్ వివరాలివే

ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్‌లో 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు ఎవరైనా చేరొచ్చు. కనీసం 12 ఏళ్ల నుంచి 35 ఏళ్ల టర్మ్ తీసుకోవచ్చు. కనీస సమ్ అష్యూర్డ్ రూ.1,00,000. రైడర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడస్, ఎల్ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ఎల్ఐసీ న్యూ క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ ఎంచుకోవచ్చు. డెత్ బెనిఫిట్‌ను ఒకేసారి కాకుండా ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో తీసుకోవచ్చు. కనీసం నెలకు రూ.5,000, మూడు నెలలకు రూ.15,000, ఆరు నెలలకు రూ.25,000, ఏడాదికి రూ.50,000 చొప్పున తీసుకోవచ్చు.

Money Matters: అలర్ట్... ఈ శుక్రవారం షాక్ తప్పదు... గుర్తుంచుకోండి

ఈ ప్లాన్ బెనిఫిట్స్ చూస్తే ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 35 ఏళ్ల పాలసీ టర్మ్‌తో రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకున్నారనుకుందాం. వార్షిక ప్రీమియం రూ.2,881 + పన్నులు కలిపి చెల్లించాలి. మెచ్యూరిటీ నాటికి మెచ్యూరిటీ బెనిఫిట్స్ రూ.2,49,000 వరకు వస్తాయి. ఇక 18 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 35 ఏళ్ల టర్మ్‌తో ఈ పాలసీ తీసుకున్నాడనుకుందాం. వార్షిక ప్రీమియం రూ.24,391 చెల్లించాలి. అంటే నెలకు రూ.2,079 ప్రీమియం చెల్లించాలి. మెచ్యూరిటీ సమయంలో రూ.48 లక్షలకు పైగా రిటర్న్స్ వస్తాయి.

New Rules: అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి... వెంటనే ఇలా చేయండి

ఎల్ఐసీ నుంచి అనేక ప్లాన్స్ ఉన్నాయి. ఎల్ఐసీ వేర్వేరు వర్గాల వారికి ప్రత్యేకంగా వేర్వేరు పాలసీలను అందిస్తోంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు... ఇలా ఎవరికి కావాల్సిన ప్లాన్ వారు ఎంచుకోవచ్చు. ఎల్ఐసీ నుంచి ఏ ప్లాన్ తీసుకోవాలన్నా అధికారిక వెబ్‌సైట్‌లో ఆ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Insurance, LIC, Life Insurance, Personal Finance

ఉత్తమ కథలు