హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bima Ratna: పాలసీ ఒక్కటే.. లాభాలు మూడు.. ఈ ఎల్ఐసీ స్కీమ్ అదరహో!

Bima Ratna: పాలసీ ఒక్కటే.. లాభాలు మూడు.. ఈ ఎల్ఐసీ స్కీమ్ అదరహో!

Bima Ratna:పాలసీ ఒక్కటే.. లాభాలు మూడు.. ఈ ఎల్ఐసీ స్కీమ్ అదరహో!

Bima Ratna:పాలసీ ఒక్కటే.. లాభాలు మూడు.. ఈ ఎల్ఐసీ స్కీమ్ అదరహో!

LIC News | మీరు ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎల్ఐసీ నుంచి ఒక పాలసీ అందుబాటులో ఉంది. దీని ద్వారా మూడు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

LIC Bima Ratna | దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ ఎల్ఐసీ తన కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలు అందుబాటులో ఉంచింది. వీటిల్లో ఎల్ఐసీ (LIC) బీమా రత్న కూడా ఒకటి. ఈ పాలసీ తీసుకోవడం వల్ల పాలసీదారులు మూడు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. గ్యారంటీ రిటర్న్ పొందొచ్చు. ఇంకా డెత్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే మనీ (Money) బ్యాక్ పొందొచ్చు. అంటే ఒక్క పాలసీ తీసుకుంటే మూడు రకాల బెనిఫిట్స్ లభిస్తాయని చెప్పుకోవచ్చు.

దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలు కలిగిన వారు ఎల్ఐసీ అందిస్తున్న ఈ బీమా రత్న పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవాలని భావించే వారు మూడు రకాల ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు ప్రీమియం టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీరు మీకు నచ్చిన విధంగా ప్రీమియం టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీరు ఏ టెన్యూర్ ఎంచుకున్నా కూడా నాలుగేళ్లు తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఫోన్‌పే వాడే వారికి అదిరే శుభవార్త.. క్షణాల్లో రూ.5 లక్షల లోన్, ఇలా అప్లై చేసుకోండి!

అంతేకాకుండా పాలసీ తీసుకున్న వారికి 25 శాతం చొప్పున డబ్బులు చెల్లిస్తూ వస్తారు. 15 ఏళ్ల టెన్యూర్ ఎంపిక చేసుకుంటే వారికి 13వ సంవత్సరం, 14వ సంవత్సరం ఈ మనీ లభిస్తుంది. అదే 20 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే.. 18వ సంవత్సరం, 19వ సంవత్సరం డబ్బులు పొందొచ్చు. ఇక 25 ఏళ్ల టెన్యూర్ అయితే 23వ సంవత్సరం, 24వ సంవత్సరం డబ్బులు వస్తాయి.

ఒక్క రూపాయి కట్టక్కర్లేదు.. ఉచితంగా లభిస్తున్న 8 క్రెడిట్ కార్డులు ఇవే!

ఈ పాలసీలో చేరాలని భావించే వారు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. కనీసం రూ. 5 లక్షల మొత్తానికి బీమా తీసుకోవాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో బీమా మొత్తంలో 50 శాతం చెల్లిస్తారు. గ్యారంటీ అడిషన్ లభిస్తుంది. గ్యారంటీ బోనస్ ఉంటుంది. మరోవైపు ఈ పాలసీ తీసుకోవడం వల్ల డెత్ బెనిఫిట్ లభిస్తుంది. పాలసీదారుడు మరణిస్తే.. నామినీకి బీమా మొత్తంలో 125 శాతం అందజేస్తారు. లేదంటే వార్షిక ప్రీమియం మొత్తానికి 7 రెట్లు ఎక్కువగా చెల్లిస్తారు. ఏది ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని అందజేస్తారు.

చెల్లించిన ప్రీమియం మొత్తంలో 105 శాతం కన్నా తక్కువగా చెల్లించకూడదు. ప్రతికూల పరిస్థితుల్లో అటు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఇటు పాలసీ టర్మ్‌లో చేతికి డబ్బులు వస్తాయి. ఇంకా మెచ్యూరిటీ సమయంలో బీమా మొత్తం పొందొచ్చు. ఇలా మూడు రకాలుగా ఈ ప్లాన్ ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. అందుకే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వారు ఈ పాలసీని ఒకసారి పరిశీలించొచ్చు.

First published:

Tags: Insurance, LIC, Money, New policy

ఉత్తమ కథలు