హోమ్ /వార్తలు /బిజినెస్ /

Pension Scheme: మార్చి 31 లోగా ఈ స్కీమ్‌లో చేరితే రూ.9,250 పెన్షన్

Pension Scheme: మార్చి 31 లోగా ఈ స్కీమ్‌లో చేరితే రూ.9,250 పెన్షన్

Pension Scheme | మీరు ఏదైనా పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా? మీరు మార్చి 31 లోగా ఈ స్కీమ్‌లో చేరితే రూ.9,250 పెన్షన్ (Monthly Pension) పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Pension Scheme | మీరు ఏదైనా పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా? మీరు మార్చి 31 లోగా ఈ స్కీమ్‌లో చేరితే రూ.9,250 పెన్షన్ (Monthly Pension) పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Pension Scheme | మీరు ఏదైనా పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా? మీరు మార్చి 31 లోగా ఈ స్కీమ్‌లో చేరితే రూ.9,250 పెన్షన్ (Monthly Pension) పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అనేక పాలసీలను అందిస్తోంది. ఎల్ఐసీ నుంచి ఓ పెన్షన్ పథకం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఓ పెన్షన్ పథకాన్ని ఎల్ఐసీ నిర్వహిస్తోంది. ఆ పథకం పేరు ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY). వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం ఇది. రిటైర్ అయినవారికి ఎక్కువగా ఉపయోగపడే స్కీమ్ ఇది. రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బుల్ని ఒకేసారి ఇన్వెస్ట్ చేసి ప్రతీ నెలా పెన్షన్ పొందొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ ద్వారా 7.40 శాతం వడ్డీ లభిస్తోంది. 2022 ఏప్రిల్ 1న వడ్డీని సవరించే అవకాశం ఉంది. 2022 మార్చి 31 లోగా ఈ స్కీమ్‌లో చేరినట్టైతే 7.40 శాతం వడ్డీ పొందొచ్చు. ఈ లెక్కన రూ.9,250 వరకు పెన్షన్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వయ వందన యోజన గడువును 2023 మార్చి 31 వరకు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పట్లోగా ఎప్పుడైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. అయితే 2022 మార్చి 31 లోగా ఈ స్కీమ్‌లో చేరితే 7.40 శాతం వడ్డీ వర్తిస్తుంది. ఇది ఇమ్మీడియట్ పెన్షన్ ప్లాన్. అంటే ఈ పథకంలో చేరిన తర్వాతి నెల నుంచే పెన్షన్ పొందొచ్చు. పదేళ్ల పాటు పెన్షన్ తీసుకోవచ్చు.

Credit Card: క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ మొత్తం వాడేస్తున్నారా? అయితే జాగ్రత్త

ప్రధాన మంత్రి వయ వందన యోజన పాలసీలో రూ.1,62,162 ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.1,62,162 ఇన్వెస్ట్ చేసినవారికి నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, సంవత్సరానికి రూ.12,000 పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.15,00,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. వారికి 7.40 శాతానికి వార్షిక వడ్డీ లెక్కించి ప్రతీ నెలా పెన్షన్ ఇస్తారు. ప్రతీ నెలా రూ.9,250 పెన్షన్ లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన భార్యాభర్తలు ఇద్దరూ ఈ పెన్షన్ పథకంలో రూ.30,00,000 వరకు ఇన్వెస్ట్ చేసి నెలకు రూ.18500 పెన్షన్ పొందొచ్చు.

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... ఏప్రిల్ 1 లోగా ఈ పనిచేయండి

ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకంలో పెన్షన్ ప్రతీ నెల కాకుండా మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి ఓసారి కూడా తీసుకోవచ్చు. పాలసీదారులు తమ అవసరాలకు తగ్గట్టుగా పెన్షన్ తీసుకోవచ్చు. పాలసీ గడువు ముగిసిన తర్వాత ముందు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.15,00,000 వెనక్కి వస్తుంది. ఈ పెన్షన్ స్కీమ్‌లో 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఎవరైనా చేరొచ్చు. మూడేళ్ల తర్వాత లోన్ తీసుకునే సదుపాయం ఉంటుంది. గరిష్టంగా 75 శాతం వరకు లోన్ ఇస్తారు. పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీహోల్డర్ మరణిస్తే డబ్బులు నామినీకి తిరిగి ఇస్తారు.

First published:

Tags: LIC, Pension Scheme, Personal Finance

ఉత్తమ కథలు