హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Policy: ఈ ఎల్ఐసీ పాలసీలో ప్రీమియం తక్కువ... కవరేజీ ఎక్కువ

LIC Policy: ఈ ఎల్ఐసీ పాలసీలో ప్రీమియం తక్కువ... కవరేజీ ఎక్కువ

LIC Policy: ఈ ఎల్ఐసీ పాలసీలో ప్రీమియం తక్కువ... కవరేజీ ఎక్కువ
(ప్రతీకాత్మక చిత్రం)

LIC Policy: ఈ ఎల్ఐసీ పాలసీలో ప్రీమియం తక్కువ... కవరేజీ ఎక్కువ (ప్రతీకాత్మక చిత్రం)

LIC Policy | ఎల్ఐసీలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ఇచ్చే ఓ పాలసీ ఉంది. రోజుకు కేవలం రూ.20 ప్రీమియంతో రూ.1 కోటి కవరేజీ పొందవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మూడు నెలల క్రితం ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ (LIC New Tech Term Plan) ప్లాన్ ప్రకటించింది. ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే, తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ పొందవచ్చు. ఎల్ఐసీ అందిస్తున్న ప్రత్యేక టర్మ్ ఇన్స్యూరెన్స్ (Term Insurance) పాలసీ ఇది. ఈ పాలసీలో మహిళలకు, పొగ త్రాగనివారికి ప్రత్యేక రేట్స్ వర్తిస్తాయి. నాన్ స్మోకర్స్ రేట్స్ వర్తించాలంటే యూరినరీ కొటినైన్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. లేకపోతే స్మోకర్ రేట్స్ వర్తిస్తాయి. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. ఇందులో మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు. పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీహోల్డర్ మరణిస్తే డబ్బులు నామినీకి వస్తాయి.

ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ వివరాలు

ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ ‌ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అంటే ఎల్ఐసీ ఏజెంట్ల దగ్గర ఈ పాలసీ అందుబాటులో ఉండదు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో న్యూ టెక్ టర్మ్ ప్లాన్ ‌తీసుకోవచ్చు. బెనిఫిట్‌లో రెండు ఆప్షన్స్ ఉంటాయి. లెవెల్ సమ్ అష్యూల్డ్ లేదా ఇన్‌క్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఎంచుకోవచ్చు. సింగిల్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం లేదా లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆఫ్షన్స్ కూడా ఉంటాయి.

Indian Railways: సెంట్రల్, జంక్షన్, టెర్మినల్... రైల్వే స్టేషన్లలో వీటి మధ్య తేడాలు తెలుసా?

ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ ‌డెత్ బెనిఫిట్ వివరాలు చూస్తే రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం ఎంచుకున్నవారికి వార్షిక ప్రీమియంకు ఏడు రెట్లు లేదా మరణించిన నాటి వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105 శాతం లేదా మరణించినప్పుడు ఎంత మొత్తం చెల్లిస్తామని హామీ ఇస్తుందో ఆ మొత్తం చెల్లిస్తారు. ఇక సింగిల్ ప్రీమియం ఎంచుకున్నవారికి చెల్లించిన ప్రీమియంకు 125 షశాతం లేదా మరణించినప్పుడు ఎంత మొత్తం చెల్లిస్తామని హామీ ఇస్తుందో ఆ మొత్తం లభిస్తుంది.

ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ అర్హతలు

ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ తీసుకోవడానికి కనీస వయస్సు 18 ఏళ్లు కాగా గరిష్ట వయస్సు 65 ఏళ్లు. మెచ్యూరిటీ వయస్సు 80 ఏళ్లు. కనీస సమ్ అష్యూర్డ్ రూ.50 లక్షలు కాగా, గరిష్ట పరిమితి లేదు. పాలసీ టర్మ్ 10 నుంచి 40 ఏళ్లు ఉంటుంది. ఈ పాలసీలో కోటి రూపాయల బీమా తీసుకున్నా ప్రీమియం తక్కువగా ఉంటుంది. అయితే ఇది టర్మ్ ఇన్స్యూరెన్స్ అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ పాలసీకి మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు. కేవలం డెత్ బెనిఫిట్ మాత్రమే ఉంటుంది.

New Rules: మీ జేబుకు చిల్లు పెట్టే కొత్త నిబంధనలు... రేపటి నుంచి అమలులోకి వచ్చే 7 కొత్త రూల్స్ ఇవే

ఉదాహరణకు 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఆప్షన్ 1 ఎంచుకొని 20 ఏళ్ల పాలసీ టర్మ్‌తో రూ.1 కోటి ఈ పాలసీ తీసుకున్నారనుకుందాం. రెగ్యులర్ ప్రీమియం అయితే ఏడాదికి రూ.7,047 + జీఎస్‌టీ చెల్లించాలి. అంటే రోజుకు ప్రీమియం రూ.20 లోపే. సింగిల్ ప్రీమియం అయితే రూ.75,603 + జీఎస్‌టీ చెల్లిస్తే చాలు. అతనికి 20 ఏళ్ల పాటు రూ.1 కోటి కవరేజీ లభిస్తుంది. పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే వారి కుటుంబానికి బీమా డబ్బులు వస్తాయి.

ఈ పాలసీలో ఆప్షన్ 2 ఎంచుకున్నవారికి సమ్ అష్యూర్డ్ పెరుగుతూ ఉంటుంది. పైన చెప్పిన ఉదాహరణ ప్రకారం లెక్కేస్తే ఏడాదికి రూ.9,345 + జీఎస్‌టీ ప్రీమియం చెల్లించాలి. సింగిల్ ప్రీమియం అయితే రూ.1,02,617 + జీఎస్‌టీ చెల్లించాలి. పాలసీ 5 ఏళ్లు ముగిసిన తర్వాత ప్రతీ ఏటా 10 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. 15వ ప్రీమియం చెల్లించేనాటికి సమ్ అష్యూర్డ్ రెట్టింపు అవుతుంది. అంటే రూ.2 కోట్ల కవరేజీ లభిస్తుంది.

First published:

Tags: Insurance, LIC, Personal Finance

ఉత్తమ కథలు