హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC New Jeevan Shanti Policy: ఒక్కసారి ప్రీమియం కడితే ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు

LIC New Jeevan Shanti Policy: ఒక్కసారి ప్రీమియం కడితే ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు

LIC New Jeevan Shanti Policy: ఒక్కసారి ప్రీమియం కడితే ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు
(ప్రతీకాత్మక చిత్రం)

LIC New Jeevan Shanti Policy: ఒక్కసారి ప్రీమియం కడితే ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు (ప్రతీకాత్మక చిత్రం)

LIC New Jeevan Shanti Policy | ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పేరుతో సింగిల్ ప్రీమియం పాలసీ అందిస్తోంది. ఈ పాలసీ బెనిఫిట్స్ తెలుసుకోండి.

మీరు ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు వచ్చే పాలసీ ఎల్ఐసీలో ఉంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC గతేడాది 'న్యూ జీవన్ శాంతి' పాలసీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సింగిల్ ప్రీమియం, డిఫర్డ్ యాన్యుటీ పాలసీ. అంటే ఈ పాలసీ తీసుకుంటే ప్రతీ ఏటా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. అందుకే సింగిల్ ప్రీమియం పాలసీ అన్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నవారు, భవిష్యత్తులో ప్రతీ నెల కొంత ఆదాయం కోరుకునేవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. మరి ఎల్ఐసీ 'న్యూ జీవన్ శాంతి' పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

LIC New Jeevan Shanti Policy: ఎల్ఐసీ 'న్యూ జీవన్ శాంతి' పాలసీ వివరాలు ఇవే...


కనీస ప్రీమియం- రూ.1,50,000

గరిష్ట ప్రీమియం- పరిమితి లేదు

కనీస వయస్సు- 30 ఏళ్లు

గరిష్ట వయస్సు- 79 ఏళ్లు

యాన్యుటీ ఆప్షన్స్- డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్, డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్. డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్ ఎంచుకుంటే యాన్యుటీ అంటే ప్రతీ ఏటా డబ్బులు జీవితాంతం లభిస్తాయి. మరణించిన తర్వాత పాలసీ డబ్బులు నామినీకి వస్తాయి. డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ ఎంచుకుంటే పాలసీదారుడు జీవించి ఉన్నంత వరకు ప్రతీ ఏటా డబ్బులు వస్తాయి. పాలసీదారుడు మరణిస్తే ప్రైమరీ లేదా సెకండరీ యాన్యుటెంట్‌కు జీవితాంతం డబ్బులు వస్తాయి. ఇద్దరూ మరణించిన తర్వాత పాలసీ డబ్బులు నామినీకి వస్తాయి.

కనీస యాన్యుటీ- కనీసం రూ.1,50,000 సింగిల్ ప్రీమియం చెల్లించినవారికి నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000.

AC Buying Guide: ఏసీ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

SBI ATM PIN: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు పిన్ మర్చిపోయారా? ఒక్క ఫోన్ కాల్‌తో జనరేట్ చేయండి ఇలా

ఈ పాలసీ తీసుకున్నప్పుడు వడ్డీ రేట్లు ఎంత ఉంటాయో మెచ్యూరిటీ వరకు అవే వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ పాలసీని ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. లేదా ఎల్ఐసీ ఏజెంట్ దగ్గర తీసుకోవచ్చు. ఈ పాలసీలో సింగిల్ ప్రీమియం చెల్లించిన తర్వాత అవసరమైనప్పుడు లోన్ కూడా తీసుకోవచ్చు. లేదా పాలసీ సరెండర్ చేసి డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు.

Online Startup Ideas: ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించడానికి 10 ఐడియాలు

SBI Insurance: ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.20 లక్షల వరకు ఇన్స్యూరెన్స్... ఏ కార్డుపై ఎంతంటే

lic new jeevan shanti plan, lic new jeevan shanti interest rate 2021, lic new jeevan shanti policy, lic jeevan shanti 858 calculator, lic jeevan shanti latest news, lic new jeevan shanti pension plan, lic new jeevan shanti review, lic new jeevan shanti in telugu, ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీ, ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్, ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం ప్లాన్, ఎల్ఐసీ కొత్త పాలసీ
Source: LIC

ఉదాహరణకు 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.10,00,000 సింగిల్ ప్రీమియం చెల్లించి ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీ తీసుకున్నాడనుకుందాం. డిఫర్‌మెంట్ పీరియడ్ 12 ఏళ్లు ఎంచుకున్నాడు. సెకండరీ యాన్యుటెంట్ వయస్సు 35 ఏళ్లు. అతను డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్ పాలసీ ఎంచుకున్నట్టైతే ఏడాదికి రూ.99,400, ఆరు నెలలకు రూ.48,706, మూడు నెలలకు రూ.24,105, నెలకు రూ.7,952 డబ్బులు వస్తాయి. డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ ఎంచుకుంటే ఏడాదికి రూ.94,100, ఆరు నెలలకు రూ.46,109, మూడు నెలలకు రూ.22,819, నెలకు రూ.7,528 వస్తాయి.

First published:

Tags: Investment Plans, LIC, Personal Finance, Save Money, TAX SAVING

ఉత్తమ కథలు