భవిష్యత్తు అవసరాల కోసం చాలా మంది వివిధ మార్గాలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్, ఎల్‌ఐసీ పాలసీ వంటివి పెట్టుబడులకు బెస్ట్ ఆప్షన్స్‌గా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ SIP(సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) నుంచి గరిష్ట రాబడిని పొందాలంటే తక్కువ వయసులోనే పెట్టుబడి ప్రారంభించి, దీర్ఘకాలికంగా కొనసాగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పదవీ విరమణ తరువాత ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేస్తున్నప్పుడు, పెట్టుబడిని త్వరగా ప్రారంభిస్తే ఎక్కువ రాబడి ఉంటుంది. రూ.10కోట్ల కార్పస్ రావాలంటే ఫండ్స్‌లో ఏ వయసులో ఎంత సిప్ చేయాలి, ఆ కార్పస్‌ను పెన్షన్‌గా ఎలా మార్చుకోవాలో పరిశీలిద్దాం.
* క్రమ వ్యవధిలో పెట్టుబడి
సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అనేది మ్యూచువల్ ఫండ్స్ అందిస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ మార్గం. దీని ద్వారా ఒక నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో క్రమ వ్యవధిలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే, ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా నెలకు లేదా త్రైమాసికానికి ఒకసారి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతినెలా ఇన్వెస్ట్ మొత్తాన్ని మీ అకౌంట్ నుంచి డెబిట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది.
* 20 ఏళ్ల వయసులో ఎస్‌ఐపీ ఎంతంటే?
ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ తరువాత రూ.10 కోట్లు పొందాలంటే, చిన్న వయసు నుంచి ఫండ్స్‌లో చిప్ చేయాలి. దీంతో ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఫండ్స్‌లో 12% రాబడిని ప్రమాణంగా తీసుకుంటే.. 20 సంవత్సరాల వయసులో అయితే నెలకు కేవలం రూ.8,416ను SIPగా చేయాల్సి ఉంటుంది. మీరు 25 ఏళ్ల నుంచి పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, పదవీ విరమణ సమయంలో రూ. 10 కోట్లు పొందాలంటే నెలకు SIPగా రూ.15,396 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : ఎక్కువ పెన్షన్ పొందే వారికోసం స్పెషల్ ఫెసిలిటీ.. ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్!
* 30 ఏళ్లలో SIP రూ.28,329
పెట్టుబడి ప్రారంభ సమయంలో మీ వయసును బట్టి SIP అమౌంట్ లో మార్పు ఉంటుంది. మీకు వయసు ఎక్కువగా ఉంటే, SIP మొత్తం కూడా భారీగా ఉంటుంది. 30 ఏళ్ల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, రూ.10 కోట్ల కార్పస్ కోసం నెలకు రూ.28,329 SIP పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 35 ఏళ్లకు రూ.52,697, 40 ఏళ్లకు అయితే రూ.1,00,085కు SIP మొత్తం పెరుగుతుంది.
* మంత్లీ రిటర్న్స్ కోసం పెట్టుబడి ఆప్షన్స్‌గా
రిటైర్మెంట్ తరువాత వచ్చే ఈ రూ.10 కోట్ల మొత్తంతో మీ ఆర్థిక అవసరాల కోసం తిరిగి మంత్లీ రిటర్న్స్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. అందుకు మార్కెట్‌లో అనేక ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా ఫిక్స్‌డ్ డిపాజిట్స్ లేదా LIC న్యూ జీవన్ శాంతి ప్లాన్ వంటి యాన్యుటీ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
* ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి స్కీమ్ వివరాలు
ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి పథకం అనేది ఒక యాన్యుటీ ప్లాన్. ప్లాన్ కొనుగోలు సమయంలోనే మీ పెన్షన్ మొత్తం ఫిక్స్ చేస్తారు. కొత్త జీవన్ శాంతి పథకం కనీస ప్లాన్ ధర రూ.1.5 లక్షలు. గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. మీరు మీ అవసరాన్ని బట్టి వార్షిక, 6 నెలలు, 3 నెలలు లేదా నెలవారీ ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు.
1.5 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు ప్రతి నెలా రూ.1000 జీవితకాల పెన్షన్ లభిస్తుంది. ఆ లెక్కన రూ.10 కోట్ల SIP మొత్తం ద్వారా ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్‌ను కొనుగోలు చేస్తే, రూ.68 లక్షలకు పైగా వార్షిక యాన్యుటీ (నెలకు దాదాపు రూ.5.6 లక్షలు) లభిస్తుంది. అయితే ఇందులో యాన్యుటీ ఒక సంవత్సరం వాయిదా వ్యవధితో సింగిల్ లైఫ్ కోసం కొనుగోలు చేయాలనే షరతుకు లోబడి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Investment Plans, LIC, Mutual Funds, Personal Finance