హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC New Plan: రూ.6,000 లోపు ప్రీమియంతో రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ పాలసీ... పూర్తి వివరాలివే

LIC New Plan: రూ.6,000 లోపు ప్రీమియంతో రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ పాలసీ... పూర్తి వివరాలివే

LIC New Plan: రూ.6,000 లోపు ప్రీమియంతో రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ పాలసీ... పూర్తి వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

LIC New Plan: రూ.6,000 లోపు ప్రీమియంతో రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ పాలసీ... పూర్తి వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

LIC New Plan | లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కొత్త కొత్త పాలసీలను ప్రకటిస్తోంది. ఓ కొత్త పాలసీలో రూ.6,000 లోపు ప్రీమియంతో రూ.50 లక్షల బీమా పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గత రెండు టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్‌ని నిలిపివేసి, వీటి స్థానంలో మరో రెండు కొత్త పాలసీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్ (LIC New Jeevan Amar Plan), ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ (LIC New Tech Term Plan) ప్రకటించింది. వీటిలో ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్ బెనిఫిట్స్ చూస్తే కేవలం రూ.6,000 లోపు ప్రీమియంతో రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ పొందొచ్చు. మరి ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్

ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్ వివరాలు చూస్తే ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ కాబట్టి మెచ్యూరిటీ ప్రయోజనాలు ఏమీ ఉండవు. పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ టర్మ్ పాలసీ ఉపయోగపడుతుంది.

PAN Card: వారి పాన్ కార్డ్ చెల్లదు... ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక

ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్‌ను 18 నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న వారు ఎవరైనా తీసుకోవచ్చు. మెచ్యూరిటీ వయస్సు 80 ఏళ్ల లోపే ఉంటుంది. కనీస సమ్ అష్యూర్డ్ రూ.25,00,000. గరిష్టంగా ఎంత మొత్తానికైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 10 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ ప్రీమియంలో పాలసీ టర్మ్ మొత్తం ప్రీమియం చెల్లించాలి. లిమిటెడ్ ప్రీమియంలో పాలసీ టర్మ్ కన్నా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల ముందు వరకు ప్రీమియం చెల్లించాలి.

ఉదాహరణకు 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఆప్షన్ 1 ఎంచుకొని 20 ఏళ్ల పాలసీ టర్మ్‌తో రూ.50 లక్షలకు టర్మ్ ఈ పాలసీ తీసుకున్నారనుకుందాం. రెగ్యులర్ ప్రీమియం అయితే ఏడాదికి రూ.5,959 + జీఎస్‌టీ చెల్లించాలి. సింగిల్ ప్రీమియం అయితే రూ.57,768 + జీఎస్‌టీ చెల్లిస్తే చాలు. అతనికి 20 ఏళ్ల పాటు రూ.50 లక్షల కవరేజీ లభిస్తుంది. పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే వారి కుటుంబానికి బీమా డబ్బులు లభిస్తాయి.

Bank Charges: ఆ అకౌంట్ ఉన్నవారికి డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు

ఈ పాలసీలో ఆప్షన్ 2 ఎంచుకున్నవారికి సమ్ అష్యూర్డ్ పెరుగుతూ ఉంటుంది. పైన చెప్పిన ఉదాహరణ ప్రకారం లెక్కేస్తే రూ.7,832 + జీఎస్‌టీ ప్రీమియం చెల్లించాలి. సింగిల్ ప్రీమియం అయితే రూ.1,14,187 + జీఎస్‌టీ చెల్లించాలి. పాలసీ 5 ఏళ్లు ముగిసిన తర్వాత ప్రతీ ఏటా 10 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. 15వ ప్రీమియం చెల్లించేనాటికి సమ్ అష్యూర్డ్ రెట్టింపు అవుతుంది. అంటే రూ.1 కోటి కవరేజీ లభిస్తుంది.

First published:

Tags: Insurance, LIC, Personal Finance

ఉత్తమ కథలు