• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • LIC NEW CHILDRENS MONEY BACK POLICY GIVES MONEY BACK TO YOUR CHILDREN KNOW PREMIUM DETAILS AND OTHER BENEFITS SS

LIC New Childrens Money Back Plan: మీ పిల్లల పేరుతో ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే మనీబ్యాక్

LIC New Childrens Money Back Plan: మీ పిల్లల పేరుతో ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే మనీబ్యాక్

LIC New Childrens Money Back Plan: మీ పిల్లల పేరుతో ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే మనీబ్యాక్ (image: LIC)

LIC New Childrens Money Back Plan | ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ అందిస్తోంది. ఈ పాలసీని పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించింది ఎల్ఐసీ.

  • Share this:
    మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా మంచి పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ అందిస్తోంది. ఇది మనీ బ్యాక్ పాలసీ. అంటే పిల్లల చదువు, పెళ్లిళ్లు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీరు కోరుకున్నట్టుగా మనీ బ్యాక్ పొందొచ్చు. ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, లైఫ్ ఇన్స్యూరెన్స్, సేవింగ్స్ ప్లాన్. పిల్లలు పుట్టిన వెంటనే ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.1,00,000 సమ్ ఇన్స్యూర్డ్‌తో ఈ పాలసీని తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. పిల్లల తల్లిదండ్రులు లేదా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పిల్లల పేరుపై ఈ పాలసీని తీసుకోవచ్చు.

    ఉదాహరణకు రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో 0 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.4327 ప్రీమియం చెల్లించాలి. 5 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.5586 ప్రీమియం, 10 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.7899 ప్రీమియం, 15 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.9202 ప్రీమియం చెల్లించాలి.

    Aadhaar Card: ఆధార్ కార్డులో ఫోటోను మార్చాలనుకుంటున్నారా? ప్రాసెస్ ఇదే

    LIC Policy: ఎల్ఐసీ పాలసీ ఉందా? అయితే ఈ శుభవార్త మీకే


    LIC New Children’s Money Back Policy: ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ వివరాలివే...


    కనీస వయస్సు- 0 ఏళ్లు
    గరిష్ట వయస్సు- 12 ఏళ్లు
    మెచ్యూరిటీ వయస్సు- 25 ఏళ్లు
    పాలసీ గడువు- పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చేవరకు
    ప్రీమియం చెల్లింపు- ఏడాది, ఆరు నెలలకోసారి, మూడు నెలలకోసారి, నెలకోసారి
    సమ్ అష్యూర్డ్- కనీసం రూ.1,00,000. గరిష్ట పరిమితి లేదు.
    సర్వైవల్ బెనిఫిట్- ఈ పాలసీ తీసుకున్న పిల్లలకు వారి వయస్సు 18, 20, 22 ఏళ్లు ఉన్నప్పుడు 20 శాతం చొప్పున మనీ బ్యాక్ వస్తుంది.
    మెచ్యూరిటీ బెనిఫిట్- మూడు వాయిదాల్లో 20 శాతం చొప్పున 60 శాతం మనీ బ్యాక్ ఇచ్చారు కాబట్టి మిగతా 40 శాతం మెచ్యూరిటీ తర్వాత బోనస్‌తో కలిపి వస్తుంది.
    డెత్ బెనిఫిట్- అనుకోని పరిస్థితుల్లో పాలసీహోల్డర్ మరణిస్తే సమ్ అష్యూర్డ్, బోనస్ కలిపి ఇస్తుంది ఎల్ఐసీ.

    LIC Jeevan Umang Plan: రిటైర్మెంట్ నాటికి రూ.94 లక్షలు కావాలా? ఈ ఎల్ఐసీ ప్లాన్ మీకోసమే

    LIC Jeevan Umang Plan: రోజూ రూ.199 పొదుపు చేస్తే రూ.94 లక్షలు మీ సొంతం

    ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీకి ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకున్న తర్వాత నచ్చకపోతే 15 రోజుల్లో వెనక్కి ఇచ్చి ప్రీమియం తీసుకోవచ్చు. ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంది. ఇక ప్రీమియం పేమెంట్ ఆలస్యం అయితే 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ పాలసీకి రైడర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత సరెండర్ చేయొచ్చు. ఇక ఎల్ఐసీ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ తీసుకుంటే పాలసీ ప్రపోజర్ అంటే పిల్లల పేరుతో పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రీమియం చెల్లిస్తున్న కాలంలో మరణిస్తే ఆ తర్వాత చెల్లించాల్సిన ప్రీమియంలను మాఫీ చేస్తుంది ఎల్ఐసీ. అంటే ప్రీమియంలు చెల్లించకపోయినా పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చేవరకు పాలసీ కొనసాగుతుంది. మనీ బ్యాక్ కూడా వస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు