ఒక టీ తాగితే కనీసం రూ.10 ఖర్చు పెట్టాలి. సిగరెట్ అలవాటు ఉన్నవాళ్లు రోజూ కనీసం రూ.50 టీ, సిగరెట్లకే ఖర్చుపెడతారు. మరి మీ పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రూ.12 నుంచి రూ.20 జమ చేయాలనుకుంటే ఎల్ఐసీ నుంచే ప్రత్యేకమైన పాలసీ ఉంది. అదే 'న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్'. పిల్లల భవిష్యత్తు కోసం ఎల్ఐసీ రూపొందించిన మనీ బ్యాక్ పాలసీ ఇది. పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంతో పాటు వారికి లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుంది.
కనీస వయస్సు: 0 ఏళ్లు
గరిష్ట వయస్సు: 12 ఏళ్లు
పాలసీ టర్మ్: 25 ఏళ్లు- పాలసీ తీసుకున్న సమయంలో వయస్సు
ప్రీమియం చెల్లింపు: మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్
సమ్ అష్యూర్డ్: కనీసం రూ.1,00,000
Read this: RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?
ఉదాహరణకు మీ అమ్మాయి లేదా అబ్బాయి వయస్సు 0 ఏళ్లు ఉంటే రూ.1,00,000 పాలసీకి ప్రీమియం రూ.4,415 చెల్లించాలి.
మీ అమ్మాయి లేదా అబ్బాయి వయస్సు 5 ఏళ్లు ఉంటే రూ.1,00,000 పాలసీకి ప్రీమియం రూ.5,700 చెల్లించాలి.
మీ అమ్మాయి లేదా అబ్బాయి వయస్సు 10 ఏళ్లు ఉంటే రూ.1,00,000 పాలసీకి ప్రీమియం రూ.8,060 చెల్లించాలి.
మీరు కేవలం రూ.1,00,000 పాలసీ తీసుకుంటే ప్రీమియం రూ.4,415 అవుతుంది. అంటే రోజుకు రూ.12 మాత్రమే. మీ అమ్మాయి లేదా అబ్బాయి వయస్సు 18 ఏళ్లు పూర్తైన తర్వాత పాలసీ లాభాలు పొందొచ్చు. 18, 20, 22 ఏళ్ల వయస్సులో 20% చొప్పున మీకు మనీ బ్యాక్ వస్తుంది. మిగతా 40% సమ్ అష్యూర్డ్, బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ 25 ఏళ్లకు వస్తాయి. ఒకవేళ పాలసీ హోల్డర్ రిస్క్ కవర్ ప్రారంభానికి ముందు చనిపోతే చెల్లించిన ప్రీమియంలు తిరిగి ఇచ్చేస్తుంది కంపెనీ. రిస్క్ కవర్ మొదలైన తర్వాత చనిపోతే సమ్ అష్యూర్డ్, బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ లభిస్తాయి. ఈ పాలసీ తీసుకుంటే సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. క్లెయిమ్‌ల పైనా సెక్షన్ 10(10డీ) కింద మినహాయింపులు లభిస్తాయి.
Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్
ఇవి కూడా చదవండి:
PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి
Personal Finance: జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు ఈ 5 బ్యాంకులు బెస్ట్
Personal Finance: మీ బ్యాంక్ అకౌంట్ వాడట్లేదా? ఇలా క్లోజ్ చేసెయ్యండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: LIC, Personal Finance