LIC NAVJEEVAN PLAN NO 853 LIFE INSURANCE CORPORATION LAUNCHED NEW POLICY KNOW ALL DETAILS ELIGIBILITY AND BENEFITS LIC NAVJEEVAN PLAN SS
LIC Navjeevan Plan: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... నవజీవన్ ప్లాన్‌తో లాభాలు ఇవే
LIC Navjeevan Plan: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... నవజీవన్ ప్లాన్‌తో లాభాలు ఇవే
LIC Navjeevan Plan No.853 | నవజీవన్ ప్లాన్‌లో కస్టమర్లు రెండు రకాల ప్రీమియంలు ఎంచుకోవచ్చు. అందులో ఒకటి సింగిల్ ప్రీమియం కాగా మరొకటి ఐదేళ్ల లిమిటెడ్ ప్రీమియం.
భారతదేశంలో అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ‘Navjeevan Plan No.853’ పేరుతో మరో కొత్త పాలసీని ప్రారంభించింది. 2019 మార్చి 18 నుంచే ఈ కొత్త పాలసీ అమలులోకి వచ్చింది. ఇది నాన్-లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్. నవజీవన్ ప్లాన్‌లో కస్టమర్లు రెండు రకాల ప్రీమియంలు ఎంచుకోవచ్చు. అందులో ఒకటి సింగిల్ ప్రీమియం కాగా మరొకటి ఐదేళ్ల లిమిటెడ్ ప్రీమియం. ఎల్ఐసీ ప్రారంభించిన నవజీవన్ ప్లాన్-853 గురించి పూర్తి వివరాలు, ఆ పాలసీతో గల లాభాల గురించి తెలుసుకోండి.
పాలసీ టర్మ్: 10 నుంచి 18 ఏళ్లు
ప్రీమియం: సింగిల్ లేదా ఐదేళ్లు
కనీస బీమా మొత్తం: రూ.1 లక్ష
గరిష్ట బీమా మొత్తం: పరిమితి లేదు
కనీస వయస్సు: సింగిల్ ప్రీమియం 90 రోజులు, నాన్ సింగిల్ ప్రీమియంకు 90 రోజులు(ఆప్షన్-1), 45 ఏళ్లు(ఆప్షన్-2)
గరిష్ట వయస్సు: సింగిల్ ప్రీమియంకు 44 ఏళ్లు, నాన్ సింగిల్ ప్రీమియంకు 60 ఏళ్లు(ఆప్షన్-1), 65 ఏళ్లు(ఆప్షన్-2)
మెచ్యూరిటీ బెనిఫిట్స్: మెచ్యూరిటీ తర్వాత సమ్ అష్యూర్డ్‌తో పాటు లాయల్టీ అడిషన్ లభిస్తుంది.
డెత్ బెనిఫిట్స్: రిస్క్ తేదీ మొదలుకాకముందే చనిపోతే చెల్లించిన ప్రీమియం వాపసు ఇస్తారు. రిస్క్ తేదీ మొదలయ్యాక సమ్ అష్యూర్డ్ చెల్లిస్తారు. పాలసీ మొదలైన ఐదేళ్ల తర్వాత చనిపోతే సమ్ అష్యూర్డ్‌తో పాటు లాయల్టీ అడిషన్ లభిస్తుంది.
45 ఏళ్లు దాటినవాళ్లు ఆప్షన్ 1 ఎంచుకుంటే వార్షిక ప్రీమియంకు 10 రెట్లు డెత్ బెనిఫిట్స్
ఆప్షన్ 2 ఎంచుకుంటే వార్షిక ప్రీమియంకు 7 రెట్లు డెత్ బెనిఫిట్స్
45 ఏళ్ల లోపు అయితే ఆప్షన్ 1 మాత్రమే వర్తిస్తుంది.
ఎల్ఐసీ నవజీవన్ ప్లాన్ ఆన్లైన్లో తీసుకుంటే సింగిల్ ప్రీమియం పేమెంట్‌పై 2%, లిమిటెడ్ ప్రీమియం పేమెంట్‌పై 5% డిస్కౌంట్ లభిస్తుంది.
Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.