హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Fund: ఎల్‌ఐసీ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఎన్‌ఎఫ్‌ఓ పనితీరు ఎలా ఉంది? దీంట్లో పెట్టుబడి పెట్టవచ్చా?

LIC Fund: ఎల్‌ఐసీ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఎన్‌ఎఫ్‌ఓ పనితీరు ఎలా ఉంది? దీంట్లో పెట్టుబడి పెట్టవచ్చా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈక్విటీ, డెట్ మార్కెట్లో పెట్టుబడుల విభజనకు ఎల్‌బీఏఎఫ్ ప్రత్యేక నమూనా ఉపయోగిస్తుంది. వడ్డీ రేట్లు, ఆదాయ నిష్పత్తి, పెట్టుబడుల ద్వారా లభిస్తున్న ఆదాయాలను లెక్కించేందుకు ఈ నమూనా ఉపయోగపడుతుంది.

షేర్ మార్కెట్‌పై అవగాహన లేని వారు, అంత తీరిక లేని మరికొందరు, లేదంటే రిస్కు తీసుకోవడం ఇష్టం లేని వారు సహజంగా ఫండ్లలో పెట్టుబడి పెడతారు. కొన్ని సంస్థలు డెట్ ఫండ్స్‌తో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఈక్విటీ ఫండ్లను సంయుక్తంగా వినియోదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇలాంటి ఫండ్లలో ఎల్‌ఐసీ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్ ఫండ్ ఎన్‌ఎఫ్‌ఓ (LBAF) ఒకటి.

ఈ ఫండ్ నిధులను బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 50 షేర్లతో పాటు పదేళ్ల జీ సెక్షన్ ఇండెక్స్‌లో (డెట్ ఫండ్‌) సమానంగా పెట్టుబడులు పెడుతుంది. ఆర్థిక నిపుణులు యోగేష్ పాటిల్ ఈక్విటీ విభాగాన్ని, రాహుల్ సింగ్ రుణ విభాగాన్ని పర్వవేక్షిస్తున్నారు.

* ఇది ఎలా పనిచేస్తుంది?

అనేక రకాల సాధనాలను ఉపయోగించి షేర్ మార్కెట్లో అధిక రాబడులను ఇచ్చే వాటిని ముందుగా గుర్తించి వాటిలో పెట్టుబడి పెడతారు. ఒక షేర్ ధర.. దాని ద్వారా వస్తున్న ఆదాయం లెక్కించడం ద్వారా ఏయే షేర్లలో, బాండ్లలో ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయిస్తారు. ఈక్విటీ, డెట్ మార్కెట్లో పెట్టుబడుల విభజనకు ఎల్‌బీఏఎఫ్ ప్రత్యేక నమూనా ఉపయోగిస్తుంది. వడ్డీ రేట్లు, ఆదాయ నిష్పత్తి, పెట్టుబడుల ద్వారా లభిస్తున్న ఆదాయాలను లెక్కించేందుకు ఈ నమూనా ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: LIC Pension Policy: 40 ఏళ్ల నుంచే పెన్షన్ కావాలా? ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకోండి

పెద్ద కంపెనీల షేర్లతోపాటు, స్థిర ఆదాయం కోసం ఎక్కువ వడ్డీ ఆదాయం లభించే గవర్నమెంటు బాండ్లు, ప్రభుత్వరంగ సంస్థలు, ట్రిపుల్ ఏ రేటింగ్ కలిగిన ప్రైవేటు కార్పొరేట్ సంస్థల్లో ఎల్‌బీఏఎఫ్ పెట్టుబడులు పెడుతుంది. దీని ద్వారా అధిక ఆదాయంతోపాటు, పెట్టుబడిదారుల డబ్బుకు రక్షణ లభిస్తుంది. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, సహజంగా ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్ కు గురవుతాయని ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ హెడ్ యోగేష్ పాటిల్ చెప్పారు.

* మిశ్రమ పెట్టుబడులు

వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు డెట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ఫండ్ మంచి ఆదాయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. స్టాక్ ధరలు, బాండ్ ఆదాయాల మధ్య పెట్టుబడుల బ్యాలెన్స్ చేయడం ద్వారా, ఒక వేళ మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గినా ఫండ్ల ఆదాయంపై పెద్దగా ప్రభావం చూపవని డెట్ కార్పొరేట్ ట్రైనర్ జోయ్ డీప్ సేన్ చెప్పారు.

* పెట్టుబడులు ఎలా నిర్ణయిస్తారు?

ఈ స్కీమ్ ద్వారా ఈక్వీటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, మార్కెట్లో షేర్ల ధరలు తగ్గిన ప్రతిసారీ కొనుగోలు చేయడం ద్వారా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. తొందరపాటు నిర్ణయాలతో సంబంధం లేకుండా డైనమిక్ మోడల్ ద్వారా ఈ ఫండ్ పెట్టుబడులను పెడుతుంది. ఈ విధానం ఇప్పటికే మంచి ఫలితాలు అందించింది. నంబంరు 3తో ముగిసే ఎల్‌ఐసీ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్ ఫండ్ ఎన్‌ఎఫ్‌ఓ కూడా మంచి రిటర్న్స్ ఇస్తుందని ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ హెడ్ యోగేష్ పాటిల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Published by:Sambasiva Reddy
First published:

Tags: Business, Investment Plans, LIC, Mutual Funds

ఉత్తమ కథలు