లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC... భారత ప్రభుత్వానికి చెందిన బీమా సంస్థ. 63 ఏళ్ల చరిత్రగల ఈ బీమా సంస్థ గురించి తెలియనివాళ్లుండరు. ఎల్ఐసీ సేవలు గ్రామగ్రామానికి విస్తరించాయి. ఎల్ఐసీలో అన్ని వర్గాలకు కావాల్సిన పాలసీలున్నాయి. రెండు నెలల క్రితం ఎల్ఐసీ ఓ సరికొత్త బీమా పాలసీని ప్రారంభించింది. అదే 'ఎల్ఐసీ మైక్రో బచత్'. తక్కువ వేతనం ఉన్నవారి కోసం రూపొందించిన మైక్రో ఇన్స్యూరెన్స్ పాలసీ ఇది. రూ.2 లక్షల వరకు కవరేజీ ఇస్తుంది. తక్కువ వేతనం పొందుతున్నవాళ్లు కూడా బీమా రక్షణ కోరుకుంటే ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 35 ఏళ్ల వయస్సున్న వ్యక్తి రూ.1 లక్షకు పాలసీ తీసుకుంటే వార్షిక ప్రీమియం కేవలం రూ.5,220 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
Read this:
IRCTC-SBI offer: ఫ్రీగా రైలు టికెట్... 10% క్యాష్‌బ్యాక్... ఆఫర్ ఇలా పొందండి
LIC Micro Bachat: ఎల్ఐసీ మైక్రో బచత్ ప్లాన్ ఎవరు తీసుకోవచ్చు?
తక్కువ ఆదాయ వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఎల్ఐసీ మైక్రో బచత్ ప్లాన్‌ను ప్రారంభించింది. 18-55 ఏళ్ల వయస్సున్న ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎలాంటి ఆరోగ్య పరీక్షల అవసరం లేకుండానే ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు సమ్ అష్యూర్డ్ ఎంచుకోవచ్చు. పాలసీ గడువు 10-15 ఏళ్లు ఉంటుంది. ఒక ఏడాది పూర్తి ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా సరెండర్ చేయొచ్చు. ఐదేళ్లు పూర్తి ప్రీమియం చెల్లించిన వారికి లాయల్టీ అడిషన్ బోనస్ లభిస్తుంది.
Read this:
Aadhaar Alert: ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ చెల్లదు... ఏం చేయాలో తెలుసుకోండి
LIC Micro Bachat: ఎల్ఐసీ మైక్రో బచత్ ప్లాన్ లాభాలివే...
మెచ్యూరిటీ తర్వాత సమ్ అష్యూర్డ్‌తో పాటు లాయల్టీ అడిషన్స్ వస్తాయి. ఒకవేళ పాలసీహోల్డర్ పాలసీ గడువులో మొదటి ఐదేళ్లలో సమ్ అష్యూర్డ్ ఎంతో ఆ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. ఒకవేళ ఐదేళ్ల తర్వాత చనిపోతే సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్ లభిస్తుంది. పాలసీ హోల్డర్ యాక్సిడెంటల్ డెత్, డిసేబిలిటీ బెనిఫిట్ యాడ్ ఆన్స్ కూడా తీసుకోవచ్చు. మూడేళ్లు పూర్తి ప్రీమియంలు చెల్లించిన వాళ్లు 70 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. ఇక ఈ పాలసీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆటో కవర్ గురించి. మూడేళ్లు ప్రీమియంలు చెల్లించినవారికి ఆ తర్వాత ప్రీమియం చెల్లించలేకపోతే ఆరు నెలల ఆటోకవర్ లభిస్తుంది. ప్రీమియం చెల్లింపులపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద మినహాయింపు లభిస్తుంది.
Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్... రిలీజైన రెడ్మీ వై3
ఇవి కూడా చదవండి:
Indian Railways: మీ రైలు టికెట్‌పై జర్నీ డేట్ మార్చుకోవచ్చు ఇలా
Jio offer: రూ.251 రీఛార్జ్‌పై ఐపీఎల్ టికెట్లు గెలుచుకునే అవకాశం... మరెన్నో బహుమతులు
Paytm offer: పేటీఎంలో రూ.50 లక్షల ఫ్లైట్ ఓచర్లు... గెలుచుకోండి ఇలా